ప్రాంతీయం

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భద్రత ఏర్పాట్ల పై సమీక్షా సమావేశం

21 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భద్రత ఏర్పాట్ల పై సమీక్షా సమావేశం.

అన్ని శాఖల సమన్వయంతో… యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి.: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.

రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్  అధ్యక్షతన రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జిల్లా పరిధిలోని సింగరేణి, ఏన్టీపీసీ, ఆర్ ఎఫ్ సి ఎల్, ప్రధానమైన ఇండస్ట్రియల్ సంస్థల అధికారులు, భద్రతాధికారులు మరియు రామగుండం కమిషనరేట్ పరిధిలోని డిసిపిలు ఏసిపిలతో భద్రతా పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించడంతోపాటు ప్రధాన మైన సంస్థల ప్రాంతాల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ రక్షణ వ్యవస్థ, భద్రతా వ్యవస్థను కట్టదిట్టం చేయాలని అధికారులకు పోలీస్ కమీషనర్  ఆదేశించారు.

రామగుండం కమీషనరేట్ ప్రాంత రక్షణ పరంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అన్ని శాఖల యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అని ఇండస్ట్రీయల్ సంస్థల వద్ద భద్రతను పెంచాలి. అత్యవసర సర్వీసులు అందించే విభాగాల ఉద్యోగులు, అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి, నిరంతర నిఘా, పర్యవేక్షణ చేపట్టాలని సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెంటనే అమలు చేయడానికి చర్యలు అన్ని భద్రత విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కమీషనరేట్ పరిధిలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి భాస్కర్ ఐపీఎస్., పెద్దపెల్లి డిసిపి కర్ణాకర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, సుధేష్ జంకర్ సి ఐ ఎస్ ఏ /ac, సర్వర్ సిఐఎస్ఎఫ్ కమాండెంట్, S. A. రాజు, dy. కమాండెంట్,చందన్ కుమార్ సమత Ntpc ED, లలిత్ కుమార్ ఆర్ జి వన్ జీఎం, రాముడు జిఎం. ఆర్ జి -2, ఎం సుదర్శన్ రావు ఆర్ జి త్రీ జి ఎం, ఎం శ్రీనివాస్ జి ఎం శ్రీరాంపూర్, ఉదయ్ ఆర్ ఎఫ్ సి ఎల్ సి జి ఎం., సోమనాథ్ సంక డిజిఎం హెచ్ఆర్ ఎన్ టి పి సి, భగవాన్ రెడ్డి మంచిర్యాల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, అనిల్ కుమార్ పెద్దపల్లి డిస్టిక్ ఫైర్ ఆఫీసర్,బి. రాంబాబు ఏ ఈ ఈ పార్వతీ పంప్ హౌస్, రాకేష్ రెడ్డి, hpcl, రామగుండం, రవి రాజ్ ఐఓసీఎల్ రామగుండం, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, గోదావరిఖని ఏసిపిఎం రమేష్ మంచిర్యాల ఐఎఫ్ఎస్సి జైపూర్ ఏసిపి ఆర్ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, cisf, crpf అధికారులు, సింగరేణి ఎన్ టి పి సి, ఆర్ ఎఫ్ సి ఎల్, తదితర సంస్థల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్