ప్రాంతీయం

రేవంత్ రెడ్డిని కలిసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు జశ్వంత్ రెడ్డి

107 Views

రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు

సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నేతలు టీపీసీసీ డెలిగేట్ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాదాడి జశ్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని హైదరాబాదులో శుక్రవారం మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా మాదాడి జశ్వంత్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని అన్ని విధాల అండగా ఉంటామని గజ్వేల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా పని చేస్తుందని ఇటీవల రాహుల్ గాంధీ జోడయాత్రకు సంఘీభావంగా నిర్వహించిన పాదయాత్ర బాగుందని గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి పెట్టింది పేరని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయం అని పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని రేవంత్ రెడ్డి తెలిపారని అన్నారు ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజక వర్గం సీనియర్ నాయకుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి, పూజల హరి కృష్ణ, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ కొండపాక విజయ్, నరేందర్ రెడ్డి, మామిడ్యాల శ్రీనివాస్, అఙ్గర్, నర్సంపల్లి నాగరాజు, రవి గౌడ్, పృథ్వీరాజ్, మంద కొమరయ్య, యేశం నాగరాజు యాదవ్, సుదర్శన్,నాగరాజు, రవి, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Gangolla Sreenivas gajwel