సిద్దిపేట జిల్లా కొల్గూర్ గ్రామానికి చెందిన తిగుళ్ల భానుప్రియ, రెండు రోజుల క్రితం ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు బాగా వస్తాయని ఎవరో చెప్పగా ఆన్లైన్లో లింకు వెతకగా లింక్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజీలో గుర్తుతెలియని సైబర్ నేరస్తుడు పంపించిన లింకును ఇంస్టాగ్రామ్ లో ఓపెన్ చేసి అతను పంపించిన ఫోన్ నెంబర్ కు బాధితురాలు రెండు దఫాలుగా గూగుల్ పే ఫోన్ పే ద్వారా ₹ 23,548/- రూపాయలు పంపించింది మరుసటి రోజు లింక్ ఓపెన్ చేయగా బ్లాక్ఐ ఉంది వెంటనే ఆ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది అనుమానం వచ్చిన బాధితురాలు వెంటనే జాతీయ హెల్ప్ లైన్ నం.1930, ఫిర్యాదు చేయగానే, వారు స్పందించి బాధితుని యొక్క డబ్బులు 23,548/- రూపాయలు ఫ్రీజ్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్వేత ఐపీఎస్ మాట్లాడుతూ సైబర్ నేరం జరగగానే వెంటనే లేదా 24 గంటల లోపు స్పందించి పోలీసులను ఆశ్రయిస్తే డబ్బులు రికవరీ చేసే అవకాశం 99% ఉంటుందని ఈ అవకాశాన్ని సైబర్ నేరం జరిగిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం సూచించారు.
డబ్బులు ఊరికే రావు అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకోవడం నేరగాళ్ల వలలో పడడం ఇప్పటికైనా మారాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరగాళ్లు పంపించే లింకులు ఓపెన్ చేయవద్దని ఓపెన్ చేయగానే మీ బ్యాంకుకు సంబంధించిన వివరాలు వాళ్ల చేతుల్లోకి వెళుతున్నాయని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.జిల్లాలో ఇప్పటివరకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన సైబర్ నేరాల్లో బాధితులు పోగొట్టుకున్న డబ్బులు 42,76,365/- వేల రూపాయలు ఫ్రిజ్ చేయడం జరిగింది. కోర్టు ద్వారా విడతలవారీగా వారివారి అకౌంట్ లో డబ్బులు జమఅవుతాయి అని తెలిపారు.




