క్రీడలు

నాగచైతన్య స్మారక వాలీబాల్ టోర్నమెంట్ ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజమౌళి

119 Views

గజ్వేల్ మండలం వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కీర్తి శేషులు నాగ చైతన్య స్మారక ఉమ్మడి మెదక్ జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ శుక్రవారం ప్రారంభించిన *గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ Nc. రాజమౌళి గుప్తా* ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కీర్తిశేషులు నాగచైతన్య స్మారకర్థం వాలీబాల్ టోర్నమెంటు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు గజ్వేల్ ప్రాంతానికి వాలీబాల్ క్రీడల్లో జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన ఘనత నాగచైతన్య కు దక్కిందని యువత క్రీడలో రాణించి మంచి పేరు సంపాదించాలని, క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు, శారీరక దృఢత్వం,ఆనందం కలుగుతుందని అన్నారు ఈరోజు వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన వాలీబాల్ జట్లకు మొదటి ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండల వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు, రాజు,కనకయ్య,వెంకటేశ్,సంతోష్,స్వామి,అరుణ్,తెరాస నాయకులు కొమరవెల్లి ప్రవీణ్, కన్న యాదవ్, హౌసింగ్ బోర్డు నాయకులు వాసు, జయసింహారెడ్డి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Gangolla Sreenivas gajwel