గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెకు బీఎస్పీ మద్దత
మార్కుక్ మండలం మంగళవారం, 11జూలై,2023
తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గత ఆరు రోజుల నుండి మార్కుక్ మండలంలో మండల ప్రజా పరిషత్ ముందు చేస్తున్న నిరవధిక సమ్మెకు మంగళవారం బహుజన్ సమాజ్ పార్టీ మార్కుక్ మండల కమిటీ మద్దతు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల ప్రధాన డిమాండ్లు అయినటువంటి 1.కనీస వేతనం 19వేల రూపాయలు పెంచాలి,
2 .ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబానికి ప్రభుత్వమే 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి,
3. జీవో నెంబర్ 51 ని సవరించి, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి
4.ఆదివారాలు, పండుగ సెలవులు జాతీయ దిన దిన సెలవులను అమలు చేయాలి.
5.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి.
6.పిఎఫ్,ఈఎస్ఐ, ప్రమాద భీమా,గ్రాట్యుటీ,గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
వారు చేస్తున్నట్టువంటి ఈ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని సమ్మెకు బహుజన్ సమాజ్ పార్టీ మద్దతును తెలియజేయడం జరిగింది. అదే విదంగా బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని నియోజకవర్గ ఇంచార్జి కొండనోళ్ళ నరేష్ గారు అన్నారు. ఈ కార్యక్రమ నియోజకవర్గ అధ్యక్షులు గూడూరి కర్ణాకర్ గారు, ప్రధాన కార్యదర్శి మొండి కర్ణాకర్ గారు, మండల అధ్యక్షులు ఇసకంటి బాబు గారు,bvf శరదని శ్రీశైలం ,రాజంగారి భాను, శరదని రాము, కొండనోళ్ళ వంశీ గార్లు ఉన్నారు.
