ముస్తాబాద్, ఏప్రిల్ 25 (
24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలో ఇటీవల న్యూ ప్రెస్ క్లబ్ బాడీ సమాయత్తమై 9మంది సభ్యులు కలిసి సుదీర్ఘంగా పలు అంశాలపై చర్చించి క్లబ్ సభ్యులలో కొందరికీ పదవులు నిర్ణయించి సాల్వతో సత్కరించి ఏకగ్రీవ తీర్మానం చేశారు. కానీ ప్రెస్ క్లబ్ కొన్నిరోజులకే భిన్నంగా ఉందన్నారు. క్లబ్బు ఏర్పడి పట్టుమని ఒక నెల కాకముందే అధ్యక్షునిపై నిలకడ లోపించడంతో అసహనం వ్యక్తమవడంతో క్లబ్బును రద్దు చేశారు. ఈ క్లబ్ లో సువర్ణ అవకాశాన్ని వదులుకొని ప్రెస్ క్లబ్ సభ్యులను లెక్కచేయకుండా ఓ సభ్యుడు అన్ని పదవులు కూడా తానే ఏలుతానని ముందుకు నడవనించకుండా క్లబ్బును నిలువరించే ప్రయత్నంచేస్తూ అతని వ్యవహార శైలిపై సర్వత్ర విమర్శలకు తావిస్తున్నాయని క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా బాడీ సభ్యులందరికీ మరో రోజు నూతన క్లబ్ ఏర్పాటు చేసుకోవాలని మొహమాటం లేకుండా తెలిపారు.




