ప్రాంతీయం

బిజెపి ఆధ్వర్యంలో 30 పడకల ఆసుపత్రి కోసం అర్ధనగ్న నిరసన ర్యాలీ…

192 Views
ముస్తాబాద్/అక్టోబర్ 25; రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా మార్చాలని ఎన్నిసార్లు ఆందోళనలు చేసిన ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లు ఉందని ఆరోపిస్తూ బిజెపి నాయకులు ఈరోజు అర్థ నగ్న ప్రదర్శనగా కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి స్థానిక వివేకానంద విగ్రహం వద్ద ధర్నా రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ స్థానిక మంత్రి కేటీఆర్ తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలంలొ దావకానని 30 పడకల ఆస్పత్రిగా మారుస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు మాట నిలబెట్టుకో కుండా మునుగోడును దత్తత తీసుకుంటున్నానని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా మార్చకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు  కార్తీకరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు కోలా కృష్ణగౌడ్, క్రాంతి, బీజేవైఎం మండల అధ్యక్షుడు కుడుకల జనార్ధన్, పట్టణ అధ్యక్షుడు మహేందర్, కిసాన్ మోర్చా వరి వెంకటేష్, ఓబీసీ మోర్చా మల్లేష్, దళిత మోర్చా తిరుపతి,సీనియర్ నాయకులు,శ్రీనివాసరావు, సుధాకర్ రెడ్డి, మల్లారెడ్డి, మీస శంకర్, గూడ బాల్ రెడ్డి, సీనియర్ నాయకుడు కరెడ్ల రమేష్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్  గిరిధర్ రెడ్డి, జిల్లా కార్యాలయ కార్యదర్శి బాధనరేష్, చిగురు వెంకన్న, ఉపాధ్యక్షులు ఎదునూరి గోపి, రమేష్,శ్రావణ్, ఆది శేఖర్, అజయ్, బీజేవైఎం నాయకులు కిట్టు, పెంజర్ల కళ్యాణ్, మద్దికుంట రమేష్, ఊరడి రాజు, కిషన్ బాబు సృజిత్ వంశీ మెరుగు అజయ్ బోయిని వేణు పోచంపల్లి బాలాజీ ఆకారం వేణు తదితరులు పాల్గొన్నారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7