ప్రాంతీయం

బిజెపి ఆధ్వర్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రచార కార్యక్రమం

23 Views

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల బిజెపి ఆధ్వర్యంలో వన్ నేషన వన్ ఎలక్షన్ ప్రచార కార్యక్రమం.

భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆదేశానుసారం బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ సూచన మేరకు ఈరోజు మంచిర్యాల పట్టణం లోని డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో వాకర్స్ నీ కలిసి వారికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి వివరించడం జరిగింది. లోక్ సభ మరియు శాసనసభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల ఖర్చు తగ్గి భారం తగ్గుతుందన్నారు. సమయం కూడా వృధా కాదన్నారు.వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి ప్రజలందరికీ తెలియజెయాలని ఉద్దేశ్యంతో ప్రజల ముందుకు వస్తున్నాము అని దీనివల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తున్నాం అన్నారు.

ఈ కార్యక్రమంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ దుర్గం అశోక్ కో కన్వీనర్ తులా ఆంజనేయులు మరియు బీజేపీ పట్టణ అధ్యక్షులు అమిరి శెట్టి రాజు కుమార్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ పట్టణ కన్వీనర్ ఆకుల అశోక్ వర్ధన్, కో కన్వీనర్ బోయిని హరికృష్ణ మరియు సీనియర్ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం తులా మధుసూదన్ , కాశెట్టి నాగేశ్వర్ రావు ,చిరంజీవి మరియు వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్