Breaking News నేరాలు

ప్రమాదవశాస్తూ బావిలో పడ్డ వృద్ధురాలు మృతి

325 Views

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వృద్ధురాలు ప్రమాదవశాస్తూ బావిలో పడగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మండల కేంద్రానికి చెందిన బాధ దేవవ్వ(80) అనే వృద్ధురాలు శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి కనిపియ్యకుండా పోయింది. కుటుంబ సభ్యులు గాలిస్తున్న క్రమంలో శనివారం మధ్యాహ్నం ఇంటి సమీపంలో ఉన్న ఓ వ్యవసాయ బావిలో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ రమాకాంత్ దర్యాప్తు చేస్తున్నారు.

No Slide Found In Slider.

Poll not found