తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు
సిద్దిపేట జిల్లా జూన్ 2
మర్కుక్ మండలం లోని వివిధ గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో స్వరాష్ట్రం సాధించుకొని నేటికీ పది సంవత్సరాలు పూర్తవడంతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గ్రామాలలోని పార్టీ అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.అనంతరం పార్టీ అధ్యక్షులు వివిధ బిఆర్ఎస్ ముఖ్య నేతలు మాట్లాడుతూ ఆరు దశాబ్దాల కల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమని 2014 జూన్ రెండవ తేదీన ఆ కల సహకారమైందని అన్నారు.
ఈ స్వరాష్ట్రం వెనుక ఎందరో మహనీయుల పోరాటం ఉందని అందులో శ్రీకాంత్ చారి లాంటి యువకుల ప్రాణత్యాగం ఆత్మబలిదానాలు ఉన్నాయని గుర్తు చేశారు. సాధించుకున్న స్వరాష్ట్రంలో తెలంగాణ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని వందేళ్ల అభివృద్ధి చేసి చూపించారని అన్నారు. తెలంగాణను దేశంలోనే రాష్ట్రాలన్నింటిలో ఉన్నత స్థానంలో నిలిపిన ఘనత మన కేసీఆర్ ది అని అన్నారు. రైతుల గురించి పేదింటి ఆడ బిడ్డల గురించి ఆలోచించే ఏకైక పార్టీ మన బి ఆర్ ఎస్ పార్టీ అని మరోసారి మండల ప్రజలకు గుర్తు చేశారు.
ఎంపీపీ పండు గౌడ్, జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి,ఎంపీటీసల పోరం అధ్యక్షులు కృష్ణ యాదవ్, మండల కో ఆప్షన్ సభ్యులు సాహెరా లక్కాకుల నరేష్, గ్రామపటి అధ్యక్షులు అజయ్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు తుమ్మల కనకయ్య,బిఆర్ ఎస్ నాయకులు సతీష్ గౌడ్ , సంతోష్ రెడ్డి,మహేష్, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.





