వర్గల్ మండల్ మజీద్ పల్లి. గ్రామంలోని ప్రజలందరూ శ్రీరామనవమి పండుగలు జరుపుకున్నారు. గ్రామంలో ఉన్న హనుమంతుని గుడి దగ్గర, బురుజు మీద శ్రీ ఆంజనేయ స్వామి చిత్రపటం ఉన్న జెండాని గ్రామ యువకులందరూ కలిసి ఎగరవేశారు.హనుమంతుని దర్శించుకుంటూ రాము భక్తిని కనబరిచారు.
????????????????????????????????????????????????
*సంక్షేపరామాయణమ్*
శ్రీగణేశాయ నమః ।
అథ సంక్షేపరామాయణమ్ ।
తపఃస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్ ।
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుఙ్గవమ్ ॥ 1॥
తపఃశాలియగు వాల్మీకి తపస్సును, వేదాధ్యయమును చేయుటయందు ఆసక్తికలవాడును, వాక్కులు తెలిసినవారిలో శ్రేష్ఠుడు, మునులలో గొప్పవాడును అగు నారదుని ప్రశ్నించెను.
కో న్వస్మిన్సామ్ప్రతం లోకే గుణవాన్కశ్చ వీర్యవాన్ ।
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః ॥ 2॥
ఇప్పుడు భూలోకమునందు మంచి గుణములు కలవాడును, గొప్పపరాక్రమము కలవాడును, ధర్మము తెలిసినవాడును, కృతజ్ఞుడును, సత్యమైన వాక్కులు కలవాడును, ధృఢమైన సంకల్పము కలవాడును అగు మహాపురుషుడెవ్వడున్నాడు?
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః ।
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైకప్రియదర్శనః ॥ 3॥
మంచి నడవడి కలవాడును, సర్వప్రాణులకు హితము నాచరించువాడు, విద్వాంసుడును, అసాధ్యములైన కార్యములను కూడ సాధించు సామర్థ్యము కలవాడును, చూచువారికి ఎల్లప్పుడూ ఒకే విధముగ ఆనందముకలుగు విధమున కనబడువాడును అగు మహాపురుషుడు ఎవడు?
ఆత్మవాన్కో జితక్రోధో ద్యుతిమాన్ కోఽనసూయకః ।
కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ॥ 4॥
ధైర్యము కలవాడును, కోపమును జయించినవాడును, ప్రశస్తమైన కాంతి కలవాడును, అసూయ లేనివాడును ఎవడు? యుద్ధములో కోపమువచ్చిన ఎవనిని చూచి దేవతలి కూడ భయపడుదురు?
ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే ।
మహర్షే త్వం సమర్థోఽసి జ్ఞాతుమేవంవిధం నరమ్ ॥ 5॥
నే నీ విషయమును విన గోరుచున్నాను. నాకు ఎక్కువ కుతూహలముగా ఉన్నది. ఓ మహర్షీ! ఇట్టి గుణములు గల మనుష్యుని గూర్చి నీకు తెలియుటకు అవకాశము ఉన్నది.
శ్రుత్వా చైతత్త్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః ।
శ్రూయతామితి చామన్త్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్ ॥ 6॥
మూడులోకముల వృత్తాంతము తెలిసిన నారదుడు వాల్మీకి మాటలను విని, సంతసించినవాడై “చెప్పెదెను వినుము” అని పలికి, ఇట్లు చెప్పెను.
బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణాః ।
మునే వక్ష్యామ్యహం బుద్ధా తైర్యుక్తః శ్రూయతాం నరః ॥ 7॥
ఓ వాల్మీకి మునీ! నీవు అడిగిన గుణములు అనంతములు. సాధారణ మానవులలో దొరకవు. అట్టి గుణములతో కూడిన మహాపురుషుని నిశ్చయించి చెప్పెదెను. సావధానముగా వినుము.
ఇక్ష్వాకువంశప్రభవో రామో నామ జనైః శ్రుతః ।
నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ధృతిమాన్వశీ ॥ 8॥
ఇక్ష్వాకువంశమునందు పుట్టిన రామునిగూర్చి జను లెల్లరును వినియున్నారు. ఇతడు నిశ్చితమైన స్వభావము కలవాడు. గొప్ప పరాక్రమము కలవాడు. మంచి కాంతి కలవడు. ధైర్యము కలవాడు. ఇంద్రియనిగ్రహవంతుడు.
బుద్ధిమాన్నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణః ।
విపులాంసో మహాబాహుః కమ్బుగ్రీవో మహాహనుః ॥ 9॥
ఆ రాముడు బుద్ధి, నీతి, సర్వశాస్త్ర పాండిత్యము, ఐశ్వర్యము కలవాడు. శత్రువులను నశింపచేయువాడు. అతని మూపులు ఉన్నతమైనవి. బాహువులు బలిసినవి. కంఠము శంఖము వలె ఉండును. చెక్కిళ పై భాగము ఉన్నతముగ ఉండును.
మహోరస్కో మహేష్వాసో గూఢజత్రురరిన్దమః ।
ఆజానుబాహుః సుశిరాః సులలాటః సువిక్రమః ॥ 10॥
ఆ రాముని వక్షస్థలము చాల విశాలమైనది. ధనుస్సు చాల గొప్పది. అతని మూపులు సంధి ఎముకలు పైకి కనబడవు. అతడు కామక్రోధాది శత్రువులను, పాపములను పోగొట్టువాడు. అతని బాహువులు మ్రోకాళవరకును వ్రేలాడుచుండును. అతని శిరస్సు, లలాటము కూడ మంచిలక్షణములతో ఒప్పుచుండును. నడక ఎంతో అందముగా ఉండును.
సమః సమవిభక్తాఙ్గః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ ।
పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాఞ్ఛుభలక్షణః ॥ ౧౧॥
ఆ శ్రీ రాముని శరీరము పొట్టిగా కాని, పొడవైనదిగా కాని లేదు. అతని అవయవములు అన్నియు హెచ్చుతగ్గులు లేక సరిగా విభజింపబడి ఉన్నవి. శరీరపు చాయ చాల చక్కనిది. తెజ్జస్సు చాలా ప్రశంసనీయమైనదుఇ. వక్షఃస్థలము బలిసి ఉండును. నేత్రములు విశాలమైనవి. అవయవముల శోభ ప్రశస్తమైనది. సాముద్రిక శాస్త్రములో చెప్పిన శుభలక్షణము లన్నియు అతని శరీరము నందున్నవి.
ధర్మజ్ఞః సత్యసన్ధశ్చ ప్రజానాం చ హితే రతః ।
యశస్వీ జ్ఞానసమ్పన్నః శుచిర్వశ్యః సమాధిమాన్ ॥ ౧౨॥
శ్రీరాముడు శరణాగతరక్షణాది ధర్మములు బాగుగా తెలిసినవాడు, చేసిన ప్రతిజ్ఞను నిలుపుకొనును. ప్రజల హితమునకై ఎక్కువ ఆసక్తి చోపును. అన్ని విషయములను తెలిసినవాడు, పరిశిద్ధమైనవాడు, అనగా నిజాయతీ కలవాడు, గురుజనులకు లొంగి ఉండువాడు, ఆశ్రితులకు అందుబాటులో ఉండువాడు, ఆశ్రితులను రక్షించుటకై దీక్షవహించినవాడు.
ప్రజాపతిసమః శ్రీమాన్ ధాతా రిపునిషూదనః ।
రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా ॥ ౧౩॥
శ్రీరాముడు బ్రహ్మతో సమాననుడు. అందరిని మించినవాడు. సర్వలోకములను పోషించువాడు. శత్రువులను నశింపచేయువాడు. సమస్తప్రపంచమును రక్షించువాడు. ధర్మమును బాగుగా రక్షించువాడు.
రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా ।
వేదవేదాఙ్గతత్త్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః ॥ ౧౪॥
శ్రీరాముడు తనధర్మమును చక్కగ పాటించుచు తనవారి నందరిని రక్షించుచుండును. వేదవేదాంగముల రహస్యములన్నియు ఈతనికి తెలియును. ధనుర్వేదమునందు ఈతనికున్న జ్ఞానము అసాధారణమైనది.
సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞః స్మృతిమాన్ప్రతిభానవాన్ ।
సర్వలోకప్రియః సాధురదీనాత్మా విచక్షణః ॥ ౧౫॥
రాముదు వెనుక చెప్పిన వేదవేదాంగములే కాక మిగిలిన ధర్మశాస్త్ర-పురాణ-న్యాయ-మీమాంసా-సాంఖ్య-వైశేషిక-యోగశాస్త్రముల అభిప్రాయములను, సిద్ధాంతములనుబాగుగా తెలిసికొనినవాడు. తెలిసికొన్న విషయములను ఎన్నడును మరువడు. లోకవ్యవహారములలో ఈతనికి గల ఉత్తరోత్తరయుక్తుల స్ఫురనమ్ గొప్పది. సమస్త జనులయందును ఈతనికి ప్రేమ అధికము. ఆ జనులకు కూడా రాముడనిన ప్రాణము. ఎట్టి కష్టకాలమునందైనను ఈతని మన్అస్సు కలత చెందదు. వినివారికి ఆనందము కలుగుఇ నట్లు భాషణ చేయుట యందును, సమయోచితములగు కార్యములను నిరహించుటయందును గొప్పనేర్పు కలవాడు.
సర్వదాఽభిగతః సద్భిః సముద్ర ఇవ సిన్ధుభిః ।
ఆర్యః సర్వసమశ్చైవ సదైవ ప్రియదర్శనః ॥ ౧౬॥
నదులు ఎల్లపుడును, అనగా మూడు కాలములందును, సముద్రమును చేరుచుండు నట్లు సత్పురుషులు ఎల్లవేళల రామునివద్దకు వచ్చుచుండురు. ఈతడు ప్రతి ఒక్కరును దగ్గరకు చేరవలసిన వ్యక్తి. పూజనీయుడు. అందరి విషయమునను సమముగా ప్రవర్తించువాడు. ఈతని దర్శనము ఎల్లపుడును ఒకే విధముగ ఆనందజనకముగా ఉండును.
స చ సర్వగుణోపేతః కౌసల్యానన్దవర్ధనః ।
సముద్ర ఇవ గామ్భీర్యే ధైర్యేణ హిమవానివ ॥ ౧౭॥
కౌసల్యకు ఆనందమును వృద్దిపొందించు ఆ రాముడే సకలగుణ ములతో కూడినవాడు. అతడు గాంభీర్యమునందు సముద్రమువంటివాడు. దైర్యమునందు హిమవత్పర్వతము వంటివాడు.
విష్ణునా సదృశో వీర్యే సోమవత్ప్రియదర్శనః ।
కాలాగ్నిసదృశః క్రోధే క్షమయా పృథివీసమః ||
ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః ||౧౮||
రాముడు పరాక్రమునందు విష్ణువుతో సమానుడు. చంద్రదర్శనము వలె ఈతని దర్శనము ఆనందకరము. కోపము వచ్చినప్పుడు ప్రలయకాలాగ్ని వలె చాల భయంజరమైనవాడు. ఓర్పులో భూమివంటివాడు. ఇతరులకు దానముచేయుటలో కుబేరునివంటివాడు. సత్యమును సంరక్షించు విషయమున ధర్మదేవత వంటివాడు. ఈ విషయమున ఈతనిని మించినవారెవరును లేరు.
తమేవఙ్గుణసమ్పన్నం రామం సత్యపరాక్రమమ్ ॥ ౧౯॥
జ్యేష్ఠం శ్రేష్ఠగుణైర్యుక్తం ప్రియం దశరథః సుతమ్ ।
ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతిప్రియకామ్యయా ॥ ౨౦॥
యౌవరాజ్యేన సంయోక్తుమైచ్ఛత్ప్రీత్యా మహీపతిః ।
దశరథమహారాజు ప్రజలకు హితము చేయవలెనను కోరికతో, సమస్తసద్గుణసంపన్నుడును, అమోఘములగు బలపరాక్రమములు కలవాడును, ఎల్లప్పుడును ప్రజాహితమే కోరుచుండువడును, తనకు ప్రీతిపాత్రుడును అగు జ్యేష్ఠకుమారుడైన రాముని యువరాజుగా చేయగోరెను.
తస్యాభిషేకసమ్భారాన్ దృష్ట్వా భార్యాఽథ కైకయీ ॥ 21॥
పూర్వం దత్తవరా దేవీ వరమేనమయాచత । వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనమ్ ॥ 22॥
దశరథుని రాణులలో నొకతె యైన కైకయి రామాభిషేకమునకై సేకరించిన సాధనసామగ్రిని చూచి, దశరథుడు పూర్వము తనకు రెండు వరములిచ్చి యుండుటచే, వాటిలో ఒక వరముగా రాముని అరణ్యవాసమునకు పంపవలెననియు, రెండవ వరముగా భరతుని రాజ్యాభిషిక్తుని చేయవలెననియు, దశరథుని కోరెను.
స సత్యవచనాద్రాజా ధర్మపాశేన సంయతః । వివాసయామాస సుతం రామం దశరథః ప్రియమ్ ॥ 23॥
సత్యవాక్యమును పరిపాలించవలె నను కారణముచే, ఆ దశరథుడు, ధర్మపాశముచే బంధింపబడినవాడై, తన ప్రియపుత్రుడైన రాముని వనములకు పంపెను.
స జగామ వనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్ । పితుర్వచననిర్దేశాత్కైకేయ్యాః ప్రియకారణాత్ ॥ 24॥
అతిపరాక్రమశాలియైన రాముడు కైకేయికి సంతోషము కలిగించుటకై, తండ్రి మాట మాత్రము చెప్పినంతనే దానిని ఆజ్ఞగా గ్రహించి, తన ప్రతిజ్ఞను నిలుపుకొనుచు అరణ్యమునకు వెళ్ళెను.
తం వ్రజన్తం ప్రియో భ్రాతా లక్ష్మణోఽనుజగామ హ । స్నేహాద్వినయసమ్పన్నః సుమిత్రానన్దవర్ధనః |
భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాత్రమనుదర్శయన్ ||25||
లక్ష్మణుడు రామునికి చాల ఇష్టమైన తమ్ముడు. అతనియందు సహజమైన ప్రేమకలవాడు. వినయసంపన్నుడు. అతడు తన భ్రాతృ స్నేహమును చూపుచు అరణ్యమునకు పోవుచున్న ఆ రాముని వెంట వెళ్ళెను. ఇట్లు ఉత్తమకార్యము చేయుటచే తల్లి యగు సుమిత్రకు కూడ ఆనందమును వృద్ధిపొందించెను.
రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణసమా హితా ॥ 26॥
జనకస్య కులే జాతా దేవమాయేవ నిర్మితా । సర్వలక్షణసమ్పన్నా నారీణాముత్తమా వధూః ॥ 27॥
సీతాప్యనుగతా రామం శశినం రోహిణీ యథా ।
జనకుని వ్చంశమునందు పుట్టి, రామునికి భార్యయై దశరథుని కోడలైన సీత రామునకు చాల ఇష్టురాలు. ప్రాణము వంటిది. ఆమె సర్వదా రామునకు హితమునే చేయుచుండును. రాక్షసులను మోహింపచేయుటకై సృజింపబడిన దేవమాయ వలె లోకోత్తర మైన సౌందర్యము కలది. సాముద్రికశాస్త్రములో చెప్పిన మంచి లక్షణము లన్నియు ఆమెయందు ఉన్నవి. స్త్రీలలో ఉత్తమురాలు. అట్టి సీత కూడ, రోహిణి చంద్రుని అనుసరించినట్లు, ఆ రామచంద్రుని అనుసరించి వెళ్ళెను.
పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ ॥ 28॥
శృఙ్గవేరపురే సూతం గఙ్గాకూలే వ్యసర్జయత్ । గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియమ్ ॥ 29॥
గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా ।
పౌరులును, దశరథుడును చాల దూరమువరకు రాముని వెంబడించిరి. ధర్మాత్ము డైన ఆ రాముడు, గంగా తీరమునందు, శృంగిబేరమనెడి పట్టణములో, బోయల ప్రభువైన గుహుని కలిసికొనెను. సీతాలక్ష్మణ గుహులతో కూడిన ఆ రాముడు తన సారథియైన సూతుని వెనకకు పంపివేసెను.
తే వనేన వనం గత్వా నదీస్తీర్త్వా బహూదకాః ॥ 30॥
చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ ।రమ్యమావసథం కృత్వా రమమాణా వనే త్రయః ॥ 31॥
దేవగన్ధర్వసఙ్కాశాస్తత్ర తే న్యవసన్ సుఖమ్ ।
ఆ సీతారామలక్ష్మణులు ఒక వనమునుండి మరొక వనము చేరుచు, గొప్ప గొప్ప నదులను దాటుచు, భరద్వాజమహర్షి ఆదేశము ప్రకారము చిత్రకూటపర్వతమును చేరిరి. అచట పర్ణశాల నిర్మించుకొని దేవగంధర్వుల వలె సుఖముగా నివసించిరి.
చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తదా ॥ 32॥
రాజా దశరథః స్వర్గం జగామ విలపన్ సుతమ్ ।
రాముడు చిత్రకూటమునకు వెళ్ళిన పిమ్మట దశరథుడు పుత్రశోకముచే పీడితుడై, పుత్రుని గూర్చి ఏడ్చుచు స్వర్గస్థుడయ్యెను.
మృతే తు తస్మిన్ భరతో వసిష్ఠప్రముఖైర్ద్విజైః ॥ 33॥
నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః ।
దశరథుడు మరణించిన పిదప వసిష్ఠాదులు రాజ్యము చేయు మని భరతుని ఆజ్ఞాపించిరి. అయినను, తనకు రాజ్యము చేయు సామర్థ్యమున్నను, భరతుడు రామునిపై తన కున్న గౌరవముచే, రాజ్యమునకు ఒప్పుకొనలేదు.
స జగామ వనం వీరో రామపాదప్రసాదకః ॥ 34॥
రాగద్వేషాదులు జయించి ఆ భరతుడు రాముని అనుగ్రహింప చేసికొనుటకై అరణ్యమునకు వెళ్లెను.
గత్వా తు స మహాత్మానం రామం సత్యపరాక్రమమ్ ।అయాచద్భ్రాతరం రామమార్యభావపురస్కృతః ॥ 35॥
భరతుడు వినయముతో సుమహాత్ముడును, సత్యవ్రతుడును, తన సోదరుడును అగు, రాముని చేరి ప్రార్థించెను.
త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోఽబ్రవీత్ ।
“నీవు సమస్తధర్మములను తెలిసినవాడవు. అన్నగా రుండగా తమ్ముడు రాజ్యము చేయరాదు అను ధర్మము నీకు తెలియనిది కాదు. అందుచేత నీవే రాజు కావలెను”అని భరతుడు రామునితో చెప్పెను.
రామోఽపి పరమోదారః సుముఖః సుమహాయశాః ॥ 36॥
న చైచ్ఛత్పితురాదేశాద్రాజ్యం రామో మహాబలః ।
రాముడు అందరికిని సంతోషమునే కలిగించును. తనను ఆశ్రయించిన వారికి సాయుజ్యము మొదలైన సకలాభీష్టములను ఇచ్చును. ఎవరైన యాచించినంతమాత్రముననే”యాచకుల మనోరథములను తీర్చు భగ్యము నా కబ్బినది కదా” అని సంతోషించును. :న హ్యర్థినః కార్యవశాదుపేతాః కకుత్థ్సవంశే విముఖాః ప్రయాంతి” (ఏదైన కార్యమును కోరి కకుత్థ్సవంశము వారి వద్దకు వచ్చిన యాచకులు ఎన్నడును నిరాశులై వెళ్ళరు) అని విష్ణుపురాణములో చెప్పి నట్లు ప్రసిద్ధమైన దానజనిత కీర్తికలవాడు. ఆశ్రయించిన వారి అభీష్టములను నెరవేర్చుటకు సమర్థుడు. ఇంతటి మృదుస్వబావు డైనను రాముడు, తండ్రి యాజ్ఞను అనుసరించవలెనను దీక్షచే , భరతుడు ఎంత ప్రార్థించినను రాజ్యమును స్వీకరించుటకు అంగీకరించలేదు.
పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్త్వా పునః పునః ॥ 37॥
నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః ।
“నేను వచ్చునంతవరుకును నా పాదుకలను నా ప్రతినిధిగా రాజ్యము చేయుటకై ఉంచుకొనుము” అని చెప్పి తన పాదుకలను భరతునకిచ్చి, రాముడు అతనికి అనేకవిధముల బోధించి అయోధ్యకు పంపెను.
స కామమనవాప్యైవ రామపాదావుపస్పృశన్ ॥ 38॥
నన్దిగ్రామేఽకరోద్రాజ్యం రామాగమనకాఙ్క్షయా ।
రాముని తిరిగి తీసుకొనివెళ్లవలె నన్న కోరిక తీరని భరతుడు ఆ రామపాదుకలనే సేవించుచు, రాముడు సుఖముగా తిరిగి రావలెనని మనస్సులో కోరుకొనుచు, అయోధ్యాసమీపమున నున్న నందిగ్రామ మనెడు గ్రామములో నివసించి రాజ్యమును చేసెను.
గతే తు భరతే శ్రీమాన్సత్యసన్ధో జితేన్ద్రియః ॥ 39॥
రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ ।తత్రాగమనమేకాగ్రో దణ్డకాన్ ప్రవివేశ హ ॥40||
భరతుడు వెళ్లగానే రాముడు, అతడు వచ్చుటకు తనకు కలిగిన ప్రతిజ్ఞాభంగభయము పోవుటచే సర్వాతిశయి యగు కాంతి కలవాడై, భరతుడెఅంత నిర్బంధించినను తన ప్రతిజ్ఞనుండి చలింపక, కౌసల్యాభరతాదులు చేసిన ప్రార్థనలు వ్యాజముగా తీసికొని తాను మరల రాజ్యమును అంగీకరించుటకు అవకాశమున్నను, రాజ్యభోగములపై ఎంతమాత్రము చాపలము చూపక, అయోధ్యా పౌరులును భరతాదులును మాటిమాటికి ఆ చిత్రకూటపర్వతమునకు వచ్చుచుందురు అని ఊహించి, పిత్రాజ్ఞాపాలనమునందు సావధానుడై దండకావనమును ప్రవేశించెను.
ప్రవిశ్య తు మహారణ్యం రామో రాజీవలోచనః ।
విరాధం రాక్షసం హత్వా శరభఙ్గం దదర్శ హ ॥ 41॥
సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్యభ్రాతరం తథా ।
పద్మములవంటి నేత్రములు గల రాముడు, దండకారణ్యమును ప్రవేశించిన వెనువెంటనే విరాధుడను రాక్షసుని చంపి, శరభంగ – సుతీక్ష్ణ – అగస్త్యమహర్షులను, అగస్త్యుని సోదరుని చూచెను.
అగస్త్యవచనాచ్చైవ జగ్రాహైన్ద్రం శరాసనమ్ ॥ 42॥
ఖడ్గం చ పరమప్రీతస్తూణీ చాక్షయసాయకౌ ।
అగస్త్యుడు తన కింద్రు డిచ్చిన ధనుస్సును, కత్తిని, తరగని బాణములు గల అమ్ములపొదులను తీసికొనుమని రామున కీయగా అతడు తనకు తగిన ఆయుధములు దొరకినందులకు చాల సంతసించి, వానిని గ్రహించెను.
వసతస్తస్య రామస్య వనే వనచరైః సహ ॥ 43॥
ఋషయోఽభ్యాగమన్సర్వే వధాయాసురరక్షసామ్ ।
రాముడు శరభంగమహర్షి తపోవనములో వాసము చేయుచుండగా ఆ చుట్టు ప్రక్కల నున్న ఋషులందరును, ” అసురులను, రాక్షసులను సంహరింపుము” అని ప్రార్థించుటకై రామునివద్దకు వచ్చిరి.
స తేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తదా వనే ॥ 44॥
ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధః సంయతి రక్షసామ్ ।
ఋషీణామగ్నికల్పానాం దణ్డకారణ్యవాసినామ్ ॥ 45॥
రాక్షసనివాస మైన ఆ వనములో ఆ ఋషులు చేసిన ప్రార్థనను రాముడు అంగీకరించెను. “యుద్ధములో రాక్షసులను సంహరించెదను” అని అగ్నితుల్యతేజస్కు లగు ఆ దండకారణ్యవాసిమునులకు మాట ఇచ్చెను.
తేన తత్రైవ వసతా జనస్థాననివాసినీ ।
విరూపితా శూర్పణఖా రాక్షసీ కామరూపిణీ ॥ 46॥
రాము డా దండకారణ్యములోనే నివసించుచు, ఆ దండకారణ్యమునందు, రావణుని సేనానివేషస్తాన మగు జనస్థానమునందు వాసము చేయు, కామరూపిణి యగు శూర్పణఖ యను రక్కసిని ముక్కుచెవులు కోసి విరూపిణిగా చేసెను.
తతః శూర్పణఖావాక్యాదుద్యుక్తాన్సర్వరాక్షసాన్ ।
ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసమ్ ॥ 47॥
నిజఘాన రణే రామస్తేషాం చైవ పదానుగాన్ ।
శూర్పణఖ విరూపిత యైన పిమ్మట ఆ శూర్పణఖ మాట విని యుద్ధమునకు వచ్చిన ఖరుని, త్రిశిరసుని, దూషణుని, వారి అనుచరులైన సకల రాక్షసులను రాముడు యుద్ధమునందు సంహరించెను.
వనే తస్మిన్నివసతా జనస్థాననివాసినామ్ ॥ 48॥
రక్షసాం నిహతాన్యాసన్సహస్రాణి చతుర్దశ ।
దండకారణ్యమునందు నివసించు నపుడు రాముడు జనస్థానములో నివసించు రాక్షసులలో పదునాలుగు వేలమందిని సంహరించెను.
తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణః క్రోధమూర్ఛితః ॥ 49॥
సహాయం వరయామాస మారీచం నామ రాక్షసమ్ ।
పిమ్మట రావణుడు జ్ఞాతుల మరణవార్త విని, మిక్కిలి కోపించినవాడై, తనకు సాహాయ్యముచేయు మని మారీచు డను రాక్షసుని కోరెను.
వార్యమాణః సుబహుశో మారీచేన స రావణః ॥ 50॥
న విరోధో బలవతా క్షమో రావణ తేన తే ।
ఓ రావణా! మహాబలవంతులైన ఖరుడు మొదలగు పదునాలుగు వేల రాక్షసులను చంపి నట్టి బలవంతుడైన రామునితో వైరము పెట్టుకొనకుము” అని మారీచుడు రావణుని అనేక పర్యాయములు వారించెను.
అనాదృత్య తు తద్వాక్యం రావణః కాలచోదితః ॥ 51॥
జగామ సహమారీచస్తస్యాశ్రమపదం తదా ।
మృత్యువు సమీపించుటచే రావణుడు మారీచుని మాటలు వినలేదు. అతనిని వెంటబెట్టుకొని రాముని ఆశ్రమమునకు వెళ్లెను.
తేన మాయావినా దూరమపవాహ్య నృపాత్మజౌ ॥ 52॥
జహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషమ్ ।
మాయావి యైన మారీచుని ద్వారా రామలక్ష్మణులు పర్ణశాలనుండి చాల దూరము వెళ్లిపోవునట్లు చేసి, రాముని భార్య యగు సీతను అపహరించెను. ఆమెను విడిపించుటకై వచ్చిన జటాయువును చంపెను.
గృధ్రం చ నిహతం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీమ్ ॥ 53॥
రాఘవః శోకసన్తప్తో విలలాపాకులేన్ద్రియః ।
రాముడు, చచ్చుటకు సిద్ధమైపడిఉన్న జటాయువును చూచి, ఆ జటాయువు వలన సీతాదేవిని రావణుడు అపహరించినట్లు విని, మిక్కిలి దుఃఖితుడై, ఇంద్రియములను వశములో ఉంచుకొనజాలక విలపించెను.
తతస్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషమ్ ॥ 54॥
మార్గమాణో వనే సీతాం రాక్షసం సన్దదర్శ హ ।
కబన్ధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనమ్ ॥ 55॥
అత్యధిక మైన దుఃఖముతో రాముడు జటాయువునకు దహనసంస్కారము చేసి సీతకై వెదుకుచు, ఆ వనములో వికృత మైన ఆకారముతో, భయంకరముగా ఉన్న కబంధుడనెడి రాక్షసుని చూచెను.
తన్నిహత్య మహాబాహుర్దదాహ స్వర్గతశ్చ సః । స చాస్య కథయామాస శబరీం ధర్మచారిణీమ్ ॥ 56॥
శ్రమణీం ధర్మనిపుణామభిగచ్ఛేతి రాఘవ ।
బలిష్ఠములైన బాహువులు గల రాముడు ఆ కబంధుని చంపి దహనసంస్కారము చేయగా, అతడు స్వర్గమునకు వెళ్లెను. అతడు స్వర్గమునకు పోవుటకుముందు “ఓ రామా! ధర్మమును ఆచరించుటయందు నేర్పుకలదియు, ధర్మమును ఆచరించునదియు, అగు ఒక శబరస్త్రీ సన్న్యాసాశ్రమమును స్వీకరించియున్నది, ఆమె వద్దకు వెళ్లుము” అని చెప్పెను.
సోఽభ్యగచ్ఛన్మహాతేజాః శబరీం శత్రుసూదనః ॥ 57॥
శబర్యా పూజితః సమ్యగ్రామో దశరథాత్మజః ।
మహాతేజశ్శాలియు, శత్రుసంహారకుడును అయిన రాముడు భక్త పరాధీనుడు గాన తానే స్వయముగ శబరి దగ్గరకు వెళ్లెను. శబరి ఆ రాముని చక్కగా పూజించెను.
పమ్పాతీరే హనుమతా సఙ్గతో వానరేణ హ ॥ 58॥
హనూమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగతః ।
రాముడు పంపాసరస్తీరమునహనుమంతునితోపరిచయ మేర్పరచుకొని పిదప ఆతని మాట ప్రకారము సుగ్రీవునితో స్నేహము చేసికొనెను.
సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబలః ॥ 59॥
ఆదితస్తద్యథావృత్తం సీతాయాశ్చ విశేషతః ।
మహాబలుడగు రాముడు తనవృతాంతమునంతను, మొదటినుండియు సుగ్రీవహనుమంతులకు చెప్పి, విశేషించి సీతావృత్తాంతమును వారికి తెలిపెను.
సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః ॥ 60॥
చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికమ్ ।
సుగ్రీవుడు రాముని వృత్తాంత మంతయు విని, తనవలెనే దుఃఖితుడైన మహాబలునితో పరిచయము కలిగినందుకు సంతోషించి, అగ్నిసాక్షికముగా రామునితో మైత్రి చేసిక్నెను.
తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి ॥ 61॥
రామాయావేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ ।
“నీకును వాలికిని విరోధమెట్లు ఏర్పడినది?” అని రాముడు ప్రశ్నింపగా, సుగ్రీవుడు దుఃఖించుచు, స్నేహముతో రామునకు ఆ వృత్తంతము అంతయు తెలిపెను.
ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి ॥ 62॥
వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః ।
వాలిని చంపెద అని రాముడు ప్రతిజ్ఞ చేసెను. సుగ్రీవుడు కూడా రామునకు వాలి యొక్క బలవిశేషములను గూర్చి చెప్పెను.
సుగ్రీవః శఙ్కితశ్చాసీన్నిత్యం వీర్యేణ రాఘవే ॥ 63॥
రాఘవప్రత్యయార్థం తు దున్దుభేః కాయముత్తమమ్ । దర్శయామాస సుగ్రీవో మహాపర్వతసన్నిభమ్ ॥ 64॥
సుగ్రీవుడు రాముని చూచినది మొదలు “ఇతడు వాలిని చంప సమర్థుడో కాడో ” అని సందేహిమ్చుచుందెను. అతడు రామునివిషయమున తనకు నమ్మకము కలుగుటకై, కొండవలె నున్న, దుందుభి యను రాక్షసుని కళేబరము రామునకు చూపెను. (పూర్వ మొకప్పుడు దానిని వాలి చాలదూరముగ విసరి వేసెను.)
ఉత్స్మయిత్వా మహాబాహుః ప్రేక్ష్య చాస్థి మహాబలః । పాదాఙ్గుష్ఠేన చిక్షేప సమ్పూర్ణం దశయోజనమ్ ॥ 65॥
ఊహింపరాని బలము కలవాడును, ఆ బలమునకు తగి నట్లు కార్యము చేయు సమర్థము లైన బాహువులు కలవాడును అగు రాముడు అస్థిమయమైన ఆ దుందుభికళేబరమును చూచి,”ఇది ఎంత?” అని నవ్వి, కొంచె మైనను తక్కువ లేకుండా పది యోజనముల దూరములో పడునట్లు, దానిని తన పాదాంగుష్ఠముతో ఎత్తి విసరెను.
బిభేద చ పునస్తాలాన్ సప్తైకేన మహేషుణా । గిరిం రసాతలం చైవ జనయన్ప్రత్యయం తదా ॥ 66॥
అప్పుడా రాముడు, సుగ్రీవున కింకను నమ్మకము కలుగునటకై ఒక్క బాణముచే ఏడు మద్దిచెట్లను, పర్వతమును, పాతాళమును భేదించెను.
తతః ప్రీతమనాస్తేన విశ్వస్తః స మహాకపిః కిష్కిన్ధాం రామసహితో జగామ చ గుహాం తదా ॥ 67॥
రాముడు ఆ సప్తసాలాది భేదనము చేసిన పిమ్మట సురీవునకు నమ్మిక కుదిరెను. తనకు రాజ్యము లభించునని అతడు సంతసించి, రాముని వెంటబెట్టుకొని గుహ వలె నున్న క్ష్కింధా పట్టణమునకు వెళ్లెను.
తతోఽగర్జద్ధరివరః సుగ్రీవో హేమపిఙ్గలః । తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః ॥ 68॥
కిష్కింధ ప్రవేశించి, బంగారువంటి వన్నె గల వానర శేష్ఠుడైన సుగ్రీవుడు గర్జించెను. ఆ మహానాదము విని వాలి గృహమునుండి బైటకు వచ్చెను.
అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగతః । నిజఘాన చ తత్రైవ శరేణైకేన రాఘవః ॥ 69॥
వాలి, యుద్ధమునకు వెళ్లవద్దని నివారించుచున్న తారను ఒప్పించి, సుగ్రీవునుతో యుద్ధమునకు తలపడె. అచట రాముడు ఒక్క బాణముతో వాలిని చంపెను.
తతః సుగ్రీవవచనాద్ధత్వా వాలినమాహవే । సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్ ॥ 70॥
రాముడు సుగ్రీవుని ప్రార్థనప్రకారము వాలిని సంహరించి, అతని రాజ్యమునందు సుగ్రీవునే పట్టాభిషిక్తుని చేసెను.
స చ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభః ।
దిశః ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజామ్ ॥ 71॥
వానరశ్రేష్ఠుడగు సుగ్రీవుడు వానరు లందరిని రప్పించి, సీతాదేవిని అన్వేషించుటకై అన్ని దిక్కులకు పంపెను.
తతో గృధ్రస్య వచనాత్సమ్పాతేర్హనుమాన్బలీ ।
శతయోజనవిస్తీర్ణం పుప్లువే లవణార్ణవమ్ ॥ 72॥
మహా బలశాలి యగు హనుమంతుడు సంపాతి యనెడు గ్రద్దచెప్పిన ప్రకారము నూరు యోజనముల వెడల్పు గల లవనసముద్రమును దాటెను.
తత్ర లఙ్కాం సమాసాద్య పురీం రావణపాలితామ్ ।
దదర్శ సీతాం ధ్యాయన్తీమశోకవనికాం గతామ్ ॥ 73॥
హనుమంతుడు రావణుడు పాలించుచున్న లంకాపురము చేరి, అచట అశోకవనములో రామునే ధ్యానించుచు ఉన్న సీతాదేవిని చూచెను.
నివేదయిత్వాఽభిజ్ఞానం ప్రవృత్తిం వినివేద్య చ ।
సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణమ్ ॥ 74॥
హనుమంతుడు, తన చేతికి రాముడిచ్చిన అంగుళీయకమును సీతాదేవికి గుర్తుగా ఇచ్చి, సుగ్రీవునితో రామునకు మైత్రి కలుగుట మొదలగు వృత్తాంతమును విన్నవించి, ఆమెను ఊరడించి, అశోకవనబహిర్ద్వారమును చూర్ణంచేసెను.
పఞ్చ సేనాగ్రగాన్ హత్వా సప్త మన్త్రిసుతానపి ।
శూరమక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్ ॥ 75॥
హనుంతుడు సేనాపతుల నైదుగురిని, మంత్రిపుత్రులను ఏడుగురిని చంపి, శూరుడైన అక్షకుమారుని వధించి, ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు కట్టువడెను.
అస్త్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వా పైతామహాద్వరాత్ ।
మర్షయన్రాక్షసాన్వీరో యన్త్రిణస్తాన్యదృచ్ఛయా ॥ 76॥
తతో దగ్ధ్వా పురీం లఙ్కామృతే సీతాం చ మైథిలీమ్ ।
రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్మహాకపిః ॥ 77॥
పరాక్రమశాలియగు హనుమంతుడు, పూర్వము బ్రహ్మదేవుడు తన కిచ్చిన వరముల ప్రభావములవలన, తనను బ్రహ్మాస్త్రబంధము వదిలిపోయినట్లు తెలిసినను, తనను త్రాళ్లచే కట్టి ఈడ్చుకొనిపోవుచున్న రాక్షసులను వధించుటకు సమర్థుడైనను, రావణుని చూడ గోరి, ఆ రాక్షసుల బాధలను సహించెను. రావణునితో మాటలాడిన పిమ్మట సీతాదేవి నివసించు ప్రదేశము తప్ప లంకాపురి నంతయు కాల్చి, రామునకీ సంతోషవార్త చెప్పటకై మరల రాముని సమీపమునకు వెళ్లెను.
సోఽభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణమ్ |
న్యవేదయదమేయాత్మా దృష్టా సీతేతి తత్త్వతః ॥ 78॥
అతిబుద్ధిశాలి యగు హనుమంతుడు, సీతావియోగము కలిగినను ఎంతమాత్రము ధైర్యము తగ్గని రాముని వద్దకు వెళ్ళి, అతనికి ప్రదక్షిణనమస్కారము చేసి “చూచితిని సీతను” అని యథార్థముగా విన్నవించెను.
తతః సుగ్రీవసహితో గత్వా తీరం మహోదధేః ।
సముద్రం క్షోభయామాస శరైరాదిత్యసన్నిభైః ॥ 79॥
సుగ్రీవుడుతో కలసి రాముడు సముద్రతీరము చేరి, సముద్రుడు తనకు వశము కానందుకు కోపించి, సూర్యునివలె తీక్ష్ణములైన బాణములచే సముద్రుని క్షోభింపచేసెను.
దర్శయామాస చాత్మానం సముద్రః సరితాం పతిః ।
సముద్రవచనాచ్చైవ నలం సేతుమకారయత్ ॥ 80॥
నదులకు పతియైన సముద్రుడు రాముని కోపమునకు భయపడి నిజరూపముతో కనబడి చెప్పగా, అతని మాటలప్రకారము రాముడు నీలునిచే సేతువు కట్టించెను.
తేన గత్వా పురీం లఙ్కాం హత్వా రావణమాహవే ।
రామః సీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్ ॥ 81॥
రాముడు ఆ సేతుమార్గమున లంకలోనికి ప్రవేశించెను. యుద్ధము నందు రావణుని సంహరించెను. సీతను పొంది, “పరగృహములో చాలకాలము వసించిన భార్యను ఎట్లు పరిగ్రహింతును?” అని చాల సిగ్గుపడెను.
తామువాచ తతో రామః పరుషం జనసంసది ।
అమృష్యమాణా సా సీతా వివేశ జ్వలనం సతీ ॥ 82॥
ఆ కారణమువలన రాముడు జనులందరిలోను, సీతతో పరుషముగా మాటలాడెను. మహాపతివ్రత యగు ఆ సీతాదేవి ఆ మాటలను సహింపజాలక అగ్నిలో ప్రవేశించెను.
తతోఽగ్నివచనాత్సీతాం జ్ఞాత్వా విగతకల్మషామ్ ।
బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వదైవతైః ॥83॥
“సీత ఎట్టిపాపమును లేనిది” అని అగ్ని చెప్పగా రాముడు చాల సంతసించెను. దేవతలు పూజింపగా ప్రకాశించెను.
కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరమ్ ॥
సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః ।|84॥
మహాత్ముడైన రాముడు లోకకంటకుడైన రావణుని చంపుటచే స్థావరజంగమాత్మకములైన మూడు లోకములను, దేవతాఋషిగణసహితముగా సంతోషించినవి.
అభిషిచ్య చ లఙ్కాయాం రాక్షసేన్ద్రం విభీషణమ్ ।
కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రముమోద హ ॥ 85॥
రాముడు పూర్వము విభీషణుని సముద్రతీరమున అభిషిక్తుని చేసెను. ఇపుడు లంకాపురంలో కూడ విభీషణుని రాక్షసరాజునుగా అభిషిక్తుని చేసి, కృతకృత్యుడైయ్యెను. తన ప్రతిజ్ఞ నెరవేరునో లేదో అను చింత తొలగిపోయెను. రాముని సత్యవ్రత మత్యాశ్చర్యకరము కదా!
దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ ।
అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేణ సుహృద్వృతః ॥ 86॥
రాముడు తనను చూడ వచ్చిన దేవతలనుండి వరమును పొందెను. దాని ప్రకారము మృత్యులైన వానరులనందరిని బ్రతికించుకొనెను. స్నేహితులతో కూడి, పుష్పక విమానారూఢుడై అయోధ్యకు బయలుదేరెను.
భరద్వాజాశ్రమం గత్వా రామః సత్యపరాక్రమః ।
భరతస్యాన్తికే రామో హనూమన్తం వ్యసర్జయత్ ॥ 87॥
సత్యమునందు స్థిరముగ నిలచువాడును, లోకాభిరాముడును అగు రాముడు భరద్వాజాశ్రమమునకు వెళ్ళెను. హనుమంతుని భరతుని వద్దకు పంపెను.
పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవసహితస్తదా ।
పుష్పకం తత్సమారుహ్య నన్దిగ్రామం యయౌ తదా ॥ 88॥
ఆ రాముడు సుగ్రీవవిభీషణాదులతో కూడి, పూర్వవృత్తాంతములను చెప్పుకొనుచు నందిగ్రామమునకు వెళ్ళెను.
నన్దిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితోఽనఘః ।
రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ ॥ 89॥
ఎట్టి పాపములు లేని ఆ రాముడు నందిగ్రామమున సోదరుల నందరిని కలిసెను. వారందరును జడలను విడచిరి. మునివేషమును విడుచుటచే సీతతో గార్హస్థ్యమును అవలంబిచెను. మరల రాజ్యమును పొందెను.
ప్రహృష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః ।
నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్షభయవర్జితః ॥ 90॥
రాముడు రాజ్యాభిషిక్తుడు కాగా, లోక మంతయు సంతోషాతిశయముచే గగ్గుర్పాటు చెందెను. రాముడు రాజు కావలెననెడి తమ కోరిక తీరుటచే ప్రజలెల్లరు ప్రీతి చెందిరి. ఆనందాతిశయముచే స్థావర జంగమాత్మకమగు లోకము యొక్క శరీరము వృద్ధి చెందినది. ప్రజలందరును చక్కగా ధర్మము నాచరించుచుండిరి. లోకమందు పీడలు, వ్యాధులు, దుర్భిక్షముల భయము తొలగిపోయెను.
న పుత్రమరణం కేచిద్ ద్రక్ష్యన్తి పురుషాః క్వచిత్ ।
నార్యశ్చావిధవా నిత్యం భవిష్యన్తి పతివ్రతాః ॥ 91॥
రాముడు రాజ్యము చేయుచున్నప్పుడు తండ్రి యుండగా పుత్రుడు మరణిచడు. స్త్రీలకు వైధవ్యదుఃఖము ఉండదు. వారు సర్వదా పతివ్రతలై యుందురు.
న చాగ్నిజం భయం కిఞ్చిన్నాప్సు మజ్జన్తి జన్తవః ।
న వాతజం భయం కిఞ్చిన్నాపి జ్వరకృతం తథా ॥ 92॥
న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా ।
రాముని రాజ్యములో అగ్ని భయము కాని, జల భయము కాని, వాత భయము కాని, జ్వర భయము కాని, క్షుద్భాధ కాని, చోరభయము కాని లేదు.
నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ ॥ 93॥
నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా ।
నగరములు, దేశములు కూడ, ధనధాన్యసమృద్ధములై ఉన్నవి. కృతయుగములో వలెనే ప్రజ లందరును సంతోషవంతులై యున్నారు.
అశ్వమేధశతైరిష్ట్వా బహువస్త్రసువర్ణకైః ॥ 94॥
గవాం కోట్యయుతం దత్త్వా బ్రహ్మలోకం గమిష్యతి ।
అసఙ్ఖ్యేయం ధనం దత్త్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః ॥ 95॥
గొప్ప కీర్తి గల రాముడు వందల కొలదిఅశ్వమేధయాగముల చేతన, అనేక ‘బహుసువర్ణక’ యాగములచేతన దేవతలను పూజించి, పదివేల కోట్లగోవులను, లెక్కింప రానంత ధనమును బ్రహ్మణుల కిచ్చి, శాశ్వత మగు తన స్థానమును పొందగలడు.
రాజవంశాఞ్ఛతగుణాన్స్థాపయిష్యతి రాఘవః ।
చాతుర్వర్ణ్యం చ లోకేఽస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి ॥ 96॥
రాముడు క్షత్రియులకు రాజ్యము లిచ్చి నూరింతలుగా వారి వంశములను వృద్ధి పొందింపగలడు. నాలుగు వర్ణములవారిని వారి వారి ధర్మములాచరించు నట్లు నియమించగలడు.
దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ ।
రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి ॥ 97॥
రాముడు పదకొండు వేల సంవత్సరముల పాటు రాజ్యమును ప్రజలకు సుఖము కలుగు నట్లు పాలించి, బ్రహ్మలోకమును చేరగలడు.
ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్ ।
యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే ॥ 98॥
రామచరిత్ర పరిశుద్ధిని కలిగించును. పాపములను నశింపజేయును. పుణ్యములను ఇచ్చును. ఇది వేదముతో సమానము. దీనిని చదువువాని సర్వపాపములును తొలగిపోవుని.
ఏతదాఖ్యానమాయుష్యం పఠన్రామాయణం నరః ।
సపుత్రపౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే ॥ 99॥
రామాయణమనెడి ఈ ఆఖ్యానము ఆయుర్దాయమును వృద్ధి పొందించును. దీనిని చదువువాడు పుత్రపౌత్రాదులతోను, భృత్యబంధుగణములతోను కూడి సర్వసౌఖ్యములను అనుభవించి, మరణాంతరము స్వర్గమునందు దేవతలచేత పూజింపబడును.
పఠన్ద్విజో వాగృషభత్వమీయాత్ స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్ ।
వణిగ్జనః పణ్యఫలత్వమీయాజ్జనశ్చ శూద్రోఽపి మహత్త్వమీయాత్ ॥ 100॥
ఈ రామాయణమును బ్రాహ్మణుడు పఠించినచో అష్టాదశవిద్యలందును ప్రావీణ్యమును పొందును. క్షత్రియుడు పఠించినచో భూమండలాధిపతియగును. వైశ్యుడు పఠించ్నచో వ్యాపారమునందు లాభమును పొందును. శూద్రుడు పఠించినచో గొప్పవాడగును.
????????????????????????????????????????????????
????????????????????????????????????????????????
*శ్రీరామ జననం*
*నిర్వృత్తే తు క్రతౌ తస్మిన్ హయమేధే మహాత్మనః|*
*ప్రతిగృహ్యా సురా భాగాన్ ప్రతిజగ్ముః యథాగతమ్ ||*
తా|| మహాత్ముడైన దశరథ మహారాజు ప్రారంభించిన అశ్వమేథ పుత్త్రకామేష్టి క్రతువులు ముగిసినవి . దేవతలు అందరూ తమతమ హవిర్భాగములు స్వీకరించి స్వస్థానములకు చేరిరి.
*సమాప్త దీక్షా నియమః పత్నీగణ సమన్వితః |*
*ప్రవివేశ పురీం రాజా సభృత్యబలవాహనః ||*
తా|| యజ్ఞదీక్షానియమములు పూర్తికాగానే సేవకులు సైనికులు వాహనములు వెంటరాగా రాజు రాణులతో గూడి పురమున ప్రవేశించెను.
*యథార్హం పూజితస్తేన రాజ్ఞా వై పృథివీశ్వరాః |*
*ముదితాః ప్రయయుర్దేశాన్ ప్రణమ్య మునిపుంగవమ్ ||*
*శ్రీమతాం గచ్ఛతాం తేషాం స్వపురాణి పురాత్తతః |*
*బలాని రాజ్ఞాం శుభ్రాణి ప్రహృష్టాని చకాశిరే ||*
తా|| యజ్ఞమునకు విచ్చేసిన దేశాధిపతులందరినీ వారి వారి యోగ్యతలనుసరించి సమ్మానించెను. వారును మిక్కిలి సంతోషించి మునిపుంగవుడైన వశిష్ఠమహర్షి కి నమస్కరించి తమతమ దేశములకు బయలు దేరిరి. తమ నగరములకు పోవుచున్న ఆ శ్రీమంతులైన రాజులయొక్క సైనికులు దశరథుడు ఇచ్చిన వస్త్రాభరణముల తో సంతసించినవారై చక్కగా భాసిల్లిరి.
*గతేషు పృథివీశేషు రాజా దశరథస్తదా |*
*ప్రవివేశ పురీం శ్రీమాన్ పురస్కృత్య ద్విజోత్తమాన్ ||*
తా|| రాజులందరూ వెళ్ళిన పిమ్మట శుభలక్షణసంపన్నుడైన దశరథుడు వశిష్ఠాది మహర్షులు ముందునకు సాగిపోవుచుండగా పురమున ప్రవేశించెను.
*శాంతయా ప్రయయౌ సార్థం ఋష్యశృంగస్సుపూజితః |*
*అన్వీయమానో రాజ్ఞాsథ సానుయాత్రేణ ధీమతా ||*
తా|| నగరప్రవేశానంతరము దశరథుడు ఋష్యశృంగుని సాదరముగా పూజించెను. పిమ్మట ఆ మహర్షి తన భార్యయైన శాంతతో గూడి ప్రయాణమయ్యెను . ధీశాలిఅయిన రోమాపాదుడు ఆయనను సపరివారముగా అనుసరించెను. వాఱినందరిని దశరథుడు కొంతదూరము అనుసరించి వీడ్కొలిపెను.
*ఏవం విసృజ్య తాన్ సర్వాన్ రాజా సంపూర్ణమానసః |*
*ఉవాస సుఖితస్తత్ర పుత్రోత్పత్తిం విచింతయన్ ||*
తా|| దశరథ మహారాజు వచ్చినవారందరికి వీడ్కొలిపి మిక్కిలి ఆనందించెను.. అనంతరము పుత్త్రప్రాప్తిని గూర్చి ఆలోచించుచూ హాయిగా నివశింపసాగెను.
*తతో యజ్ఞే సమాప్తేతు ఋతూనాం షట్ సమత్యయుః |*
*తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ |*
*నక్షత్రేsదితి దైవత్యే స్వోచ్ఛసంస్థేషు పంచసు |*
*గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతివిందునా సహ ||*
*ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతమ్ |*
*కౌసల్యాsజనయద్రామం సర్వలక్షణ సంయుతమ్ ||*
తా|| యజ్ఞము ముగిసిన పిమ్మట ఆరు ఋతువులు గడిచెను. పిమ్మట పండ్రెండవ మాసమున చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నాలుగవ పాదమున కర్కాటక లగ్నమున కౌసల్యాదేవిగర్భములో శ్రీరామచంద్ర ప్రభువు జన్మించెను. సూర్యుడు ,అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని ఐదు గ్రహములు తమ ఉచ్ఛస్థానములోఅనగా మేష, మకర, కర్కాటక, మీన, తులా రాసులయందు ఉండిరి. కర్కాటక రాశియందు గురుచంద్రులు కలిసి ఉండిరి. బుధాదిత్యులు మేషమునందు ఉండిరి. కౌసల్యాదేవి కి శ్రీరామచంద్రుడు జన్మించెను .ఆయన జగన్నాధుడును అన్ని లోకములచే నమస్కరింపబడువాడును, సర్వశుభలక్ష సంపన్నుడును మహాభాగ్యశాలియూ విష్ణ్వంశసంభూతుడును ఇక్ష్వాకువంశవర్ధనుడు .
*విష్ణోరర్థమ్ మహాభాగం పుత్త్రం ఇక్ష్వాకు వర్ధనమ్ |*
*లోహితాక్షం మహాబాహుం రక్తోష్ఠం దుందుభిస్వనమ్||*
*కౌశల్యా శుశుభే తేన పుత్త్రేణామిత తేజసా |*
*యథా వరేన దేవానాం అదితిర్వజ్రపాణీనా ||*
ఇక్ష్వాకు కుల నందనుడు, విష్ణువులో సగ భాగమైనవాడు, లోహితాక్షుడు మహాబాహువులు గలవాడు, ఎఱ్ఱని కళ్ళు గలవాడు దుందుభివంటి స్వరము గలవాడు. ఆ అమిత తేజస్సుగల పుత్త్రునితో కౌసల్యదేవి, దేవతలలో శ్రేష్ఠుడు వజ్రాయుధము ధరించువాడైన ఇంద్రుని పుత్త్రునిగా పొందిన అదితి వలే ఏంతో శోభించెను.
*భరతోనామ కైకేయ్యాం జజ్ఞే సత్యపరాక్రమః |*
*సాక్షా ద్విష్ణోశ్చతుర్థాంశః సర్వైః సముదితో గుణైః ||*
*అథ లక్ష్మణశతృఘ్నౌ సుమిత్రాsజనయత్ సుతౌ |*
*వీరౌ సర్వాస్త్రకుశలౌ విష్ణోరర్థసమన్వితౌ ||*
తా|| సత్యపరాక్రమములు గలవాడు , సాక్షాత్ విష్ణువుయొక్క చతుర్థాంశముఅయిన వాడు సర్వగుణ సంపన్నుడు అగు భరతుడనువాడు కైకేయికి జన్మించెను. అప్పుడు వీరులు అన్ని శస్త్రాస్త్రములలో కుశలురు విష్ణ్వంశలతో కూడినవారు అగు లక్ష్మణ శతృఘ్నులు సుమిత్రాదేవి కి జన్మించిరి.
*పుష్యే జాతస్తు భరతో మీనలగ్బే ప్రసన్నధీః |*
*సార్పే జాతౌ తు సౌమిత్రీ కుళీరేsభ్యుదితే రవౌ |*
*రాజ్ఞః పుత్త్రా మహాత్మనః చత్వారో జజ్ఞిరే పృథక్ ||*
*గుణవంతో అనురూపాశ్చ రుచ్యా ప్రోష్ఠపదోపమాః |*
*జగుః కలం చ గంధర్వా ననృతుశ్చాస్సరోగణాః |*
*దేవ దుందుభయో నేదుః పుష్పవృష్టిశ్చ ఖాచ్చ్యుతా ||*
తా|| భరతుడు పుష్యమి నక్షత్రయుక్త మీనలగ్నమందు అన్మించుటవలన ప్రసన్న మనస్సు గలవాడయ్యెను. లక్ష్మణ శతృఘ్నులు ఆశ్లేషా నక్షత్రయుక్త కర్కాటక లగ్నమందు రవి ఉచ్ఛరాశిలో ఉన్నప్పుడు జన్మించిరి. ఆ రాజుకి గుణవంతులు తగినరూపముగలవారు అగు మహాత్ములగు నలుగురుపుత్రుల జననము విడివిడిగా ఆయెను. అప్పుడు గంధర్వులు మధురముగా గానము చేసిరి. అప్సరస గణములు నాట్యము చేసిరి. దేవ దుందుభులు మ్రోగెను.
ఆకాశమునుండి పుష్పవృష్టి కురిసెను.
*ఉత్సవశ్చ మహానాసీత్ అయోధ్యాయాం జనాకులః |*
*రథ్యాశ్చ జనసంబాధా నటనర్తక సంకులాః |*
*గాయనైశ్చ విరావిణ్యో నాదనైశ్చ తథా అపరైః ||*
*ప్రదేయాంశ్చ దదౌ రాజా సూతమాగధవందినామ్ |*
*బ్రాహ్మణేభ్యో దదౌ విత్తం గోధనాని సహస్రశః ||*
తా|| అయోధ్యానగరములో జనులందరితో మహోత్సవములు జరిగినవి. రాజవీధులన్నియూ కోలాహలముతో నటనర్తకుల సంకులముతో గానవాద్య గోష్ఠులతో వందిమాగధుల స్తోత్రపాఠములతో ప్రతిధ్వనించెను. ఆ (దశరథ) మహారాజు వందిమాగధులకు పౌరాణికులకు పారితోషకములనిచ్చెను. బ్రాహ్మణులకు వేలకొలదీ గోధనములను దానము చేసెను.
*అతీత్యైకాదశాహం తు నామకర్మ తథా అకరోత్ |*
*జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీసుతమ్ ||*
*సౌమిత్రిం లక్ష్మణమితి శతృఘ్నం అపరం తథా |*
*వసిష్ఠః పరమప్రీతో నామాని కృతవాంస్తదా ||*
తా||పుత్త్రులుజన్మించిన పదనొకండు దినముల పిమ్మట దశరథుడు వారికి నామకరణ కర్మ చేసెను. వశిష్ఠ మహాముని పరమ ప్రీతితో మహాత్ముడగు జ్యేష్ఠకుమారునకు ‘రాముడు’ అనియూ , కైకేయీ పుత్త్రునకు భరతుడనియూ, సుమిత్రానందనులకు లక్ష్మణుడు శతృఘ్నుడు అనియూ నామకరణము చేసెను.
*బ్రాహ్మణాన్ భోజయామాస పౌరాన్ జానపదానపి |*
*అదదాత్ బ్రాహ్మణానాం చ రత్నౌఘమ్ అమితం బహు |*
*తేషాం జన్మక్రియాదీని సర్వకర్మాణ్యకారయత్ ||*
తా|| రాజు బ్రాహ్మణులకూ, పురజనులకూ , గ్రామవాసులకూ భోజనములు పెట్టెను. బ్రాహ్మణులకు బహువిధములగు రత్నములను బహుకరించెను. పిమ్మట ఆ కుమారులకు జన్మక్రియకు సంబంధించిన సర్వకార్యములను జరిపించెను.
*తేషాం కేతు రివ జ్యేష్ఠో రామో రతికరః పితుః |*
*బభూవ భూయో భూతానాం స్వయంభూరివ సమ్మతః ||*
*సర్వే వేదవిదః శూరాః సర్వే లోకహితే రతాః |*
*సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః ||*
తా|| వారిలో జ్యేష్ఠుడైన ధ్వజపతాకమువంటి రాముడు తండ్రికి మిక్కిలి సంతోషముగూర్చుచుండెను. సమస్త ప్రాణులకూ స్వయంభూవలె ఎంతయూ ప్రేమపాత్రుడయ్యెను. ఆ రాజకుమారులందరూ అన్ని వేదములనూ అభ్యశించిరి. వారు శూరులు . ఎల్లప్పుడు ప్రజలహితమునందే ఆశక్తి గలవారు. జ్ఞాన సంపన్నులు. సకల సద్గుణ సంపన్నులు.
*తేషామపి మహాతేజా రామస్సత్యపరాక్రమః |*
*ఇష్టః సర్వస్య లోకస్య శశాంక ఇవ నిర్మలః ||*
*గజస్కంధే అశ్వపృష్టే చ రథ చర్యాసు సమ్మతః |*
*ధనుర్వేదేచ నిరతః పితృశుశ్రూషేణ రతః ||*
తా|| వారిలో గూడా రాముడు సత్యపరాక్రమములు గలవాడు. లోకములో వున్న అందరికి ప్రియపాత్రుడు. చంద్రునివలె నిర్మలము గా ఉండువాడు. గజారోహణ అశ్వారోహణ రధారోహణ చర్యలలో కుశలుడు. ధనుర్విద్యలో కుశలుడు . పితృసేవలో నిమగ్నుడైయుండెడివాడు.
*బాల్యాత్ ప్రభృతి సుస్నిగ్ధో లక్ష్మణో లక్ష్మివర్ధనః |*
*రామస్య లోకరామస్య భ్రాతుర్జ్యేష్ఠస్య నిత్యశః ||*
*సర్వప్రియకర్తస్య రామస్యాపి శరీరతః |*
*లక్ష్మణో లక్ష్మిసంపన్నో బహిః ప్రాణ ఇవాపరః ||*
తా|| బాల్యమునుంచియూ లోకాభిరాముడైన పెద్ద అన్నగారగు రామునియందు భక్తి తత్పరుడు. తనసుఖములను మరచి రామునకు అన్నివిధములుగా ప్రియముగూర్చువాడు. అతడు రామునకు బహిః ప్రాణము.
*న చ తేన వినా నిద్రాం లభతే పురుషోత్తమః |*
*మృష్టమన్న ముపానీతమ్ అశ్నాతి న చ తం వినా ||*
*యదా హి హయమారూఢో మృగయాం యాతి రాఘవః |*
*తదైనం పృష్టతోsన్వేతి స ధనుః పరిపాలయన్ ||*
*భరతస్యాపి శతృఘ్నో లక్ష్మణావరజో హి సః |*
*ప్రాణైః ప్రియతరో నిత్యం తస్య చాసీత్ తథా ప్రియః ||*
తా|| పురుషోత్తముడైన ఆ రాముడు లక్ష్మణుడు తనచెంత లేనిచో నిద్రపోయెడివాడివాడు కాడు, వచ్చిన మృష్టాన్నములను తీసుకొనెడివాడు కాడు. రాముడు అశ్వమునెక్కి వేటాడు నపుడు లక్ష్మణుడు ధనస్సు చేబూని వెంట నడిచెడివాడు. లక్ష్మణునకు తమ్ముడైన శతృఘ్నుడు అతని వలే సేవాస్వభావము కలవాడు అతడు భరతునకు ప్రాణముకన్న ప్రియమైనవాడు. అట్లే శతృఘ్నుడును భరతునిపై ప్రేమకలవాడు.
*స చతుర్భిర్మహభాగైః పుత్రైః దశరథః ప్రియైః |*
*బభూవ పరమప్రీతో దేవైరివపితామహః ||*
*తే యదా జ్ఞానసంపన్నాః సర్వే సముదితాగుణైః |*
*హ్రీమంతః కీర్తిమంతశ్చ సర్వజ్ఞా దీర్ఘదర్శినః ||*
*తేషామేవం ప్రభవాణామ్ సర్వేషాం దీప్తతేజసామ్ |*
*పితా దశరథో హృష్టో బ్రహ్మలోకాధిపో యథా ||*
తా|| ఆ సర్వలక్షణసంపన్నులగు ఆ నలుగురు ప్రియమైన పుత్త్రులతో దశరథమహారాజు దేవలతో గూడిన బ్రహ్మదేవునివలె పరమానంద భరితుడాయెను. ఆ నలుగురూ జ్ఞానసంపన్నులు, సద్గుణసంపన్నులూ , లౌకిక ప్రజ్ఞానిథులు, కీర్తిమంతులు , సర్వజ్ఞులు, దూరదృష్టిగలవారు. ఇట్లు ప్రతిభాశాలురూ తేజోమూర్తులైన తనకుమారులను జూచి లోకాధిపతియగు బ్రహ్మవలే ఆనందించెను.
*తే చాపి మనుజవ్యాఘ్రా వైదికాధ్యయనే రతాః |*
*పితృశుశ్రూషణరతా ధనుర్వేదేచ నిష్ఠితాః ||*
*అథ రాజా దశరథః తేషాం దారక్రియాం ప్రతి |*
*చింతయామాస ధర్మాత్మా సోపాధ్యాయః సబాంధవః ||*
*తస్య చింతయమానస్య మంత్రిమధ్యే మహాత్మనః |*
*అభ్యాగచ్ఛన్ మహాతేజా విశ్వామిత్రోమహామునిః ||*
తా|| ఆ పురుషశ్రేష్ఠులైన ( మనుజవ్యాఘ్రులైన) రాజకుమారులు వేదవేదాంగముల ఆధ్యయనములో నిరతులు. పితృ సేవలో నిరతులు. ధనుర్విద్యలో నిష్ఠగలవారు. అప్పుడు ఆ రాజు కుమారుల వివాహ ప్రయత్నములతో గురువులతో బాంధవులతో అలోచించసాగెను. అ మహాత్ముడగు దశరథమహారాజు మంత్రులతో ఆలోచించుచుండగా మహాతేజోమయుడైన విశ్వామిత్రమహర్షి అచటికి వచ్చెను.
*స రాజ్ఞా దర్శనాకాంక్షీ ద్వారాధ్యక్షాన్ ఉవాచ హ |*
*శీఘ్రమాఖ్యాత మాం ప్రాప్తం కౌశికం గాధినస్సుతమ్ ||*
*తత్ శ్రుత్వా వచనం త్రాసాత్ రాజ్ఞో వేశ్మ ప్రదుద్రువుః |*
*సంభ్రాంత మనసః సర్వే తేన వాక్యేన చోదితాః ||*
*తే గత్వా రాజభవనం విశ్వామిత్రం ఋషిం తదా |*
*ప్రాప్తమావేదయామాసుః నృపాయైక్ష్వాకవే తదా ||*
తా|| రాజదర్శనాకాంక్షతో ఆ ముని ద్వారపాలకులతో ఇట్లు చెప్పెను. ‘ నేను గాధిరాజు కుమారుడను. కుశికుని వంశమువాడను. నాపేరు విశ్వామిత్రుడు. శీఘ్రముగా నారాకను తెలుపుడు’ అని. ఆ మాటలను విని సంభ్రాంత మనస్సులతో కలవరపడి ద్వారపాలకులు రాజభవనము వద్దకు వెళ్ళిరి. వారు రాజభవనము చేరి విశ్వామిత్రుని రాకగురించి ఆ మహరాజుకి నివేదించిరి.
*తేషాం తద్వచనం శ్రుత్వా స పురోధాః సమాహితః |*
*ప్రత్యుజ్జగామ తం హృష్టో బ్రహ్మణమివ వాసవః ||*
*తం దృష్ట్వా జ్వలితం దీప్యా తాపసం సంశితవ్రతమ్ |*
*ప్రహృష్టవదనో రాజా తతోsర్ఘ్యం ఉపహారయత్ ||*
*స రాజ్ఞః ప్రతిగృహ్యార్ఘ్యం శాస్త్ర దృష్టేన కర్మణా |*
*కుశలం చావ్యయం చైవ పర్య పృఛ్ఛన్ నరాధిపమ్ ||*
తా|| ఆ వచనములను విని సంతోషముతో పురోహితులను వెంట తీసుకొని బ్రహ్మకడకు ఇంద్రునివలె వెళ్ళెను. అమితమైన తేజస్సుతో వెలుగుచున్న ఆ మహర్షిని చూచి దశరథ మహారాజు మిక్కిలి సంతోషించెను. ఆ రాజు అప్పుడు అర్ఘ్యపాద్యములను సమర్పించెను.ఆ మహర్షి రాజు సమర్పించిన అర్గ్యపాద్యములను ప్రతిగ్రహంచి పిమ్మట అ రాజుతో కుశలప్రశ్నలు గావించెను.
*పురేకోశే జనపదే బాంధవేషు సుహృత్సు చ |*
*కుశలం కౌశికో రాజ్ఞః పర్యపృఛ్ఛత్ సుధార్మికః ||*
*అపి తే సన్నతాః సర్వే సామంతా రిపవో జితాః |*
*దైవం చ మానుషం చాపి కర్మ తే సాధ్వనుష్టితమ్ ||*
తా|| ‘ఓ రాజా నీ ధనాగారము , దేశము , బంధుమిత్రులు కుశలమేగదా’ అని ధార్మికోత్తముడైన ఆ మహర్షి రాజుని అడిగెను.’ ఇంకనూ ‘సామంతరాజులు అదుపులో ఉన్నారా? శతృవులందరినీ జయించితివా? యజ్ఞాదిదైవకార్యములు , అతిథి సత్కారములు చక్కగా సాగుచున్నవి కదా?’ అని అడిగెను.
*వసిష్ఠం చ సమాగమ్య కుశలం మునిపుంగవః |*
*ఋషీంశ్చాన్యాన్ యథా న్యాయం మహాభాగానువాచ హ ||*
*తే సర్వే హృష్టమనసః తస్య రాజ్ఞో నివేశనమ్ |*
*వివిశుః పూజితాస్తత్ర నిషేదుశ్చ యథార్హతః ||*
తా|| పిమ్మట ఆ మునీశ్వరుడు వశిష్ఠుని సమీపించి ఆయనతో కుశలప్రశ్నలు గావించెను. అదే విథముగా ఇతర ఋషులతో యథావిథిగా యథోచితముగా అ మహాముని పరామర్శించెను. ఆ విథముగా గౌరవింపబడినవారై వారందరూ మిక్కిలి సంతసించిరి. పిమ్మట తమతమ యోగ్యతల ప్రకారము అశీనులైరి.
*అథ హృష్టమనా రాజా విశ్వామిత్రం మహామునిమ్ |*
*ఉవాచ పరమోదారో హృష్టస్తమభిపూజయన్ ||*
*యథా అమృతస్య సంప్రాప్తిః యథా వర్షమనూదకే |*
*యథా సదృశదారేషు పుత్త్రజన్మాsప్రజస్య చ ||*
*ప్రణష్టస్య యథా లాభో యథా హర్షో మహోదయే |*
*తథైవాగమనం మన్యే స్వాగతం తే మహామునే ||*
తా|| అప్పుడు ఉదారస్వభావముగల దశరథమహారాజు సంతోషముతో పూజించుచూ విశ్వామిత్రునితో ఇట్లనెను. ‘ఓ మహర్షీ అమృతము లభించినటులనూ , నీళ్ళు లేని చోట వర్షము కురిసినట్లునూ, సంతానములేనివానికి ధర్మపత్నియందు పుత్త్రులు కలిగినట్లునూ, నష్టపోయినవానికి నిథులు లభించినట్లునూ , మహోత్సవములతో సంతోషము కలిగినటుల మీ రాక మాకు మహదానందము కలిగించినది మీకు స్వాగతము’.
*కం చ తే పరమం కామం కరోమి కిము హర్షితః |*
*పాత్రభూతోsసి మే బ్రహ్మన్ దిష్ట్యా ప్రాప్తోsసి కౌశిక ||*
*అద్య మే సఫలం జన్మ జీవితంచ సుజీవితమ్ |*
*పూర్వం రాజర్షి శబ్దేన తపసా ద్యోతిత ప్రభః ||*
*బ్రహ్మర్షిత్వ మనుప్రాప్తః పూజ్యోsసి బహుధా మయా |*
*త దద్భుత మిదం బ్రహ్మన్ పవిత్రం పరమం మమ ||*
*శుభక్షేత్రగతశ్చాహం తవ సందర్శనాత్ ప్రభో |*
*బ్రూహి యత్ ప్రార్థితం తుభ్యం కార్యమాగమనం ప్రతి ||*
*ఇచ్ఛామ్యనుగృహీతోsహం త్వదర్థపరివృద్ధయే |*
తా|| ‘ఓ ధర్మాత్మా మీ అభీష్ఠమేమి ?మేము ఏమి చేయవలెను ? మీరు అన్నివిధములుగా పాత్రులు. మీ రాక మా అదృష్ఠము. ఈ దినము నా జన్మ సఫలమైనది, నా జీవితము చరితార్థమైనది. పూర్వము రాజర్షి గా వాసిగాంచితిరి. అనంతరము బ్రహ్మర్షిత్వము పొందిరి. కనుక మీరు మాకు చాలాపూజ్యులు. ఓ బ్రహ్మర్షీ మీరాక అద్భుతమైనది. మీరాక వలన మాగృహము పావకమైనది. మీరు ఏ కార్యనిమిత్తము వచ్చిరో తెలుపుడు. మీకార్యము నెరవేర్చుటకు సిద్ధముగా ఉన్నాను’ అని.
*కార్యస్య న విమర్శం చ గంతుమర్హసి కౌశిక |*
*కర్తాచాహమశేషేణ దైవతం హి భవాన్ హి మమ ||*
*మమచాయమనుప్రాప్తో మహానభ్యుదయో ద్విజ |*
*తవాగమనజః కృత్శ్నో ధర్మశ్చానుత్తమో మమ ||*
తా||’ ఓ కౌశికా! కార్యవిషయమున సందేహము వలదు. మీరు దైవ సమానులు. శేషములేకుండా కార్యము చేసెదను. ఓ బ్రహ్మర్షీ! మీ రాకవలన నేను ఆచరించిన సమస్త ధర్మములూ ఫలించినవి’.
*ఇతి హృదయసుఖం నిశమ్య వాక్యం*
*శ్రుతిసుఖమాత్మవతా వినీతముక్తమ్ |*
*ప్రధితగుణయశా గుణైర్విశిష్టః*
*పరమఋషిః పరమం జగామ హర్షమ్ ||*
తా|| అట్లు హృదయమునకు సంతోషమిచ్చు వాక్యములను విని ఉత్తమోత్తమమైన గుణములతో ప్రఖ్యాతికెక్కినవాడును శమదమాది విశిష్ఠగుణ సంపన్నుడును అయిన విశ్వామిత్రమహర్షి పరమానంద భరితుడాయెను.
*ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే*
*బాలకాండే అష్టాదశస్సర్గః ||*
*సమాప్తం ||*
????????????????????????????????????????????????
????????????????????????????????????????????????
*వసిష్ఠుల వారు ఇక్ష్వాకు వంశ చరిత్ర చెప్పుట*
*తతః ప్రభాతే జనకః కృతకర్మా మహర్షిభిః |*
*ఉవాచ వాక్యం వాక్యజ్ఞః శతానందం పురోహితమ్ ||*
తా|| పిమ్మట ప్రభాత సమయమున మహర్షులు చేయవలసిన పనులు పూర్తి చేసి వాక్యజ్ఞుడైన జనకుడు పురోహితుడగు శతానందునితో ఈ వాక్యములను చెప్పెను.
*భ్రాతా మమ మహాతేజా యవీయానతిధార్మికః |*
*కుశధ్వజైతి ఖ్యాతః పురీమ్ అధ్యవసత్ శుభామ్ ||*
*వార్యాఫలక పర్యంతాం పిబన్నిక్షుమతీం నదీమ్ |*
*సాంకాశ్యాం పుణ్యసంకాశాం విమానమివ పుష్పకమ్ ||*
తా|| “నా తమ్ముడు అతి తేజోవంతుడు అతి ధార్మికుడు కుశధ్వజుడు అను పేరుపొందిన వాడు. అతడు ఇక్షుమతీ నదీ జలములను తాగుచున్నట్లు ఉన్న సాంకశ్యాఅనబడు పుణ్యనగరము పుష్పక విమానము వంటి శుభమైన నగరములో నివశించును”.
*తమహం ద్రష్టుమిచ్ఛామి యజ్ఞ గోప్తా స మే మతః |*
*ప్రీతిం సో sపిమహాతేజా ఇమాం భోక్తా మయా సహ ||*
తా|| “యజ్ఞమునకు సహాయపడిన అతనిని చూచుటకు కోరికగానున్నది. మహాతేజోవంతుడైన అతడు కూడా నాతో ఇక్కడ ఆనందములో పాల్గొనవచ్చును అని నా అభిమతము”.
*ఏవముక్తేతు వచనే శతానందస్య సన్నిధౌ |*
*ఆగతాః కేచిదవ్యగ్రా జనకస్తాన్ సమాదిశత్ ||*
తా|| శతానందుని సన్నిధిలో ఇట్లు చెప్పబడుచుండగా కొందరు యోధులు అచటికి వచ్చిరి. జనకుడు వారిని అదేశించెను.
*శాసనాత్తు నరేంద్రస్య ప్రయయు శ్శీఘ్రవాజిభిః |*
*సమానేతుం నరవ్యాఘ్రం విష్ణుమింద్రాజ్ఞయా యథా ||*
తా|| అ నరేంద్రుని ఆజ్ఞతో ఆ నరవ్యాఘ్రుని తీసుకువచ్చుటకు వేగముగాపోవు అశ్వములపై ఇంద్రుని ఆజ్ఞతో విష్ణువు వద్దకు పోయిన దూతలవలె వెళ్ళిరి.
*సాంకాశ్యాం తే సమాగత్య దదృశుశ్చ కుశధ్వజమ్ |*
*న్యవేదయన్ యథావృత్తం జనకస్య చ చింతితమ్ ||*
*తద్వృత్తం నృపతిః శ్రుత్వా దూతశ్రేష్ఠైర్మహాబలైః |||*
*ఆజ్ఞయాథ నరేంద్రస్య ఆజగామ కుశధ్వజః |*
*స దదర్శ మహాత్మానం జనకం ధర్మవత్సలమ్ ||*
తా|| వారు సాంకాశ్యనగరము చేరి కుశధ్వజుని చూచిరి. జనకుని అలోచనలను యథాతథముగా నివేదించిరి. అప్పుడు కుశధ్వజ మహారాజు ఆ శ్రేష్ఠమైన బలశాలురైన దూతలద్వారా ఆ మాటలను విని జనకుని ఆజ్ఞానుసరించి బయలుదేరి వచ్చెను. ( వచ్చిన పిమ్మట) మహాత్ముడు ధర్మవత్సలుడు అగు జనకుని చూచెను.
*సోs భివాద్య శతానందం రాజానం చాపి ధార్మికమ్ |*
*రాజార్హం పరమం దివ్యం ఆసనం చాధ్యరోహత ||*
తా|| ఆతడు ధార్మికుడగు రాజుకి శతానందునికి అభివాదమొనర్చి రాజులకు తగు దివ్యమైన ఆసనముపై కూర్చునెను.
*ఉపవిష్టావుభౌ తౌ తు భ్రాతరావతి తేజసా |*
*ప్రేషయమాసతుర్వీరౌ మంత్రి శ్రేష్ఠం సుదామనమ్||*
తా|| ఆతి తేజస్సు గల వీరులు అగు సోదరులు కూర్చుని మంత్రిశ్రేష్ఠుడగు సుదామనుని పిలిపించిరి.
*గచ్ఛ మంత్రిపతే శీఘ్రం ఇక్ష్వాకుం అమితప్రభమ్ |*
*ఆత్మజైస్సహ దుర్దర్షం ఆనయస్వ స మంత్రిణమ్ ||*
తా|| “ఓ మంత్రివర్యా! శీఘ్రముగా వెళ్ళి అత్యంత తేజముకల , జయింపబడని ఇక్ష్వాకు మహరాజుని తన పుత్రులతో మంత్రులతో తీసుకు రమ్ము”.
*ఔపకార్యం స గత్వా తు రఘూణాంకులవర్థనమ్|*
*దదర్శ శిరసా చైనం అభివాద్యేదమబ్రవీత్ ||*
తా|| అతడు వెళ్ళి రఘుకులోత్తముని చూచి శిరస్సువంచి నమస్కరించి ఇట్లు పలికెను.
*అయోధ్యాధిపతేర్వీర వైదేహో మిథిలాధిపః |*
*స త్వాం దృష్టుం వ్యవసితః సోపాద్ధ్యాయ పురోహితమ్||*
తా||” ఓ వీర ! అయోధ్యాధిపతి ! మిథిలానగరపు రాజు వైదైహుడు పురోహితులు ఉపాధ్యాయులతో కూడిన మిమ్ములను చూచుటకు కోరికగలవాడు”.
*మంత్రిశ్రేష్ఠవచః శ్రుత్వా రాజా సర్షిగణస్తదా |*
*సబంధురగమత్ తత్ర జనకో యత్ర వర్తతే ||*
తా|| ఆ మంత్రివర్యుని వచనములను వినిన పిమ్మట ఆ రాజు ఋషిగణములు బంధువులు తో కలిసి జనకుడు ఉన్నచోటికి వెళ్ళెను.
*స రాజా మంత్రి సహితః సోపాధ్యాయ స్సబాంధవః |*
*వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠో వైదేహమిదమబ్రవీత్ ||*
తా|| మంత్రులతోనూ ఉపాధ్యాయులతోనూ బంధువులతో కూడి వాక్యకోవిదుడైన రాజు జనకునితో ఇట్లు పలికెను.
*విదితం తే మహారాజ ఇక్ష్వాకుకుల దైవతమ్ |*
*వక్తా సర్వేషు కృత్యేషు వసిష్ఠో భగవాన్ ఋషిః ||*
తా “ఓ మహారాజ ! భగవాన్ వసిష్ఠుడు మహర్షి ఇక్ష్వాకు కులదైవము ఆని అన్ని కార్యములలో మాకు మార్గమును చూపించునని తెలిసిన విషయమే”
*విశ్వామిత్రాభ్యనుజ్ఞాతః సహ సర్వైర్మహర్షిభిః |*
*ఏష వక్ష్యతి ధర్మాత్మా వసిష్ఠో మే యథాక్రమమ్ ||*
తా|| “ధర్మాత్ముడగు వసిష్ఠుడు విశ్వామిత్రుని అంగీకారముతో మహర్షులందరితో కూడి మాగురించి చెప్పవలసిన రీతిగా చెప్పును”.
*ఏవముక్త్వా నరశ్రేష్ఠే రాజ్ఞాం మధ్యే మహాత్మనామ్ |*
*తూష్ణీం భూతే దశరథే వసిష్ఠో భగవాన్ ఋషిః ||*
*ఉవాచ వాక్యం వాక్యజ్ఞో వైదేహం స పురోధసమ్ |||*
తా|| నరశ్రేష్ఠుడైన ఆ దశరథమహారాజు ఆ రాజుల సమక్షములో ఇట్లు పలికి మిన్నకుండగా వాక్యజ్ఞుడైన భగవంతునితో సమానమైన ఋషివర్యుడు వైదేహునితో అతని పురోహితునితో ఇట్లు పలికెను.
*అవ్యక్త ప్రభవో బ్రహ్మ శాశ్వతో నిత్య అవ్యయః |*
*తస్మాన్మరీచిః సంజజ్ఞే మరీచేః కాశ్యపస్సుతః |*
*వివస్వాన్ కాశ్యపాజ్జజ్ఞే మనుర్వైవస్వతః స్మృతః ||*
తా|| “అవ్యక్తమైన భగవత్స్వరూపమునుంచి ఉదయించిన బ్రహ్మ శాశ్వతుడు నిత్యుడు. అతనినుంచి మరీచుడు జన్మించెను. మరీచుని సుతుడు కాశ్యపుడు. కాశ్యపుని నుంచి వివస్వతుడు . మనువు వివస్వతునినుంచి జన్మించెను”.
*మనుః ప్రజాపతిపూర్వం ఇక్ష్వాకుస్తు మనోః సుతః |*
*తమిక్ష్వాకుం అయోధ్యాయాం రాజానం విద్ధి పూర్వకమ్ ||*
తా|| “మనువు మొదటి ప్రజాపతి. మను యొక్క పుత్రుడు ఇక్ష్వాకు. ఆ ఇక్ష్వాకుని అయోధ్యాధిపతిగా ఎఱుంగుము”.
*ఇక్ష్వాకోs స్తు సుత శ్శ్రీమాన్ కుక్షిరిత్యేవ విశ్రుతః |*
*కుక్షేరథాత్మజ శ్శ్రీమాన్ వికుక్షి రుదపద్యత ||*
తా|| “ఇక్ష్వాకుని సుతుడు కుక్షి అని విదితము. ఆ కుక్షి సుతుడు వికుక్షి” .
*వికుక్షేస్తు మహాతేజా బాణః పుత్త్రః ప్రతాపవాన్ |*
*బాణస్యతు మహాతేజా ఆనరణ్యః ప్రతాపవాన్ ||*
తా|| “వికుక్షి పుత్రుడు మహాతేజోవంతుడైన బాణుడు. బాణుని యొక్క పుత్రుడు మహాతేజోవంతుడైన అనరణ్యుడు”.
*అనరణ్యాత్ పృథుర్జజ్ఞే త్రిశంకుస్తు పృథోసుతః |*
*త్రిశంకోరభవత్ పుత్త్రో దుందుమారో మహాయశాః ||*
*దుందుమారాన్మహాతేజా యువనాశ్వోవ్యజాయత్ |||*
తా|| “అనరుణ్యుని పుత్రుడు పృథు. పృథుని పుత్రుడు త్రిశంకు. త్రిశంకుని పుత్రుడు మహాయశోవంతుడైన దుందుమారుడు. దుందుమారుని పుత్రుడు యవనాశ్వుడు”.
*యువనాశ్వసుతస్త్వాసీత్ మాంధాత పృథివీపతిః|*
*మాంధాతుస్తు సుతశ్శ్రీమాన్ సుసంధిరుదపద్యత ||*
తా|| “యవనాశ్వుని పుత్రుడు మాంధాత. మాంధాతుడు శ్రీమంతుడైన సుసంధికి జన్మనిచ్చెను”.
*సుసంధేరపి పుత్త్రౌ ద్వౌ ధ్రువసంధిః ప్రసేనజిత్ |*
*యశస్వీ ధ్రువసంధిస్తు భరతో నామనామతః ||*
*భరతాత్తు మహాతేజా అసితో నామ జాతవాన్ ||*
తా||” సుసంధుని కి ఇద్దరు పుత్రులు ధ్రువ సంధి ప్రశేనజిత్ అని. యశస్వీ అయిన ధ్రువసంధి కి భరతుడను పేరుగల వాడు పుట్టెను. భరతునికి మహాతేజోవంతుడైన అసితుడు కలిగెను”.
*యస్యైతే ప్రతిరాజాన ఉదపద్యంత శత్రవః |*
*హైహయాస్తాలజంఘాశ్చ శూరాశ్చ శశిబిందవః ||*
తా|| “అతనికి రాజులు హేహైయా తాలజంఘ శశిబిందు అనబడు వీరులు శత్రువులు అయిరి”.
*తాంస్తు స ప్రతియుధ్యన్ వై యుద్ధే రాజా ప్రవాసితః |*
*హిమవంతం ఉపాగమ్య భృగు ప్రస్రవణే sవసత్ ||*
*అసితోల్పబలో రాజా మంత్రిభిః సహితస్తదా |*
*ద్వే చాస్య భార్యే గర్భిణ్యౌ బభూవతురితి శ్రుతమ్ ||*
తా|| “వారితో యుద్ధములో ప్రతియుద్ధము చేయలేక రాజు ప్రవాశితుడయ్యెను. అ తక్కువ బలముగల రాజు మంత్రులతో కూదా హిమవత్పర్వతములను చేరి భృగు ప్రశ్రవనములో నివశించుచుండెను. అతనికి ఇద్దరి భార్యలు గర్భిణులు అని వినడమైనది”.
*ఏకా గర్భ వినాశాయ సపత్న్యై సగరం దదౌ |*
*తతశ్శేలవరం రమ్యం బభూవాభిరతో మునిః|*
*భార్గవశ్చ్యవనో నామ హిమవంతముపాశ్రితః ||*
తా|| “ఒక భార్య గర్భవినాశనము కొఱకు తన తోకూడిన సపత్నికి విషము ఇచ్చెను. అచట ఆ రమ్యమైన శ్రేష్ఠమైన హిమవంతములో భార్గవచ్యవనుడను ముని ఉండెను”.
*తత్రైకా తు మహాభాగా భార్గవం దేవవర్చసమ్ |*
*వవందే పద్మపత్రాక్షీ కాంక్షంతీ సుతమాత్మనః ||*
తా|| “ఆ పద్మము వంటి కళ్ళు గల మహాలక్ష్మి తనకు పుత్రుడు కావలనని కోరికతో ఆ భార్గవునకు వందనము చేసెను”.
*తం ఋషిం సాభ్యుపాగమ్య కాళిందీ చాభ్యవాదయత్ |*
*స తామభ్యవదద్విప్రః పుత్త్రేప్సుం పుత్త్రజన్మని ||*
తా|| “ఆ కాళింది ఆ ఋషిని సమీపించి అభివాదము చేసెను. పుత్రుడుకావలనను కోరికతో పుత్రుడు జన్మించుటకు కోరిన ఆమెతో ఆ విప్రుడు ఇట్లు చెప్పెను”.
*తవకుక్షౌ మహభాగే సుపుత్త్రసుమహాబలః |*
*మహావీర్యో మహాతేజా అచిరాత్ సంజనిష్యతి ||*
*గరేణ సహిత శ్శ్రీమాన్ మాశుచః కమలేక్షణే |*
తా|| ” ఓ మహాభాగా నీకు గర్భములో మంచి మహావీరుడగు మహాతేజోవంతుడగు త్వరలో జన్మించెదడు. ఓ కమలాక్షి ! అతడు విషమును సహించగలడు భయము లేదు”.
*చ్యవనం తు నమస్కృత్య రాజపుత్రీ పతివ్రతా |*
*పతిశోకతురా తస్మాత్ పుత్త్రం దేవీ వ్యజాయత ||*
తా|| “పతిశోకములో నున్న ఆ పతివ్రత రాజపుత్రి చ్యవనునికి నమస్కరించి పుత్రుని పొందెను”.
*సపత్న్యా తు గరస్తస్యై దత్తో గర్భజిఘాంసయా |*
*సహ తేన గరేణైవ జాత స్స సగరోs భవత్ ||*
తా|| “సపత్నీ ద్వ్రారా గర్భచ్ఛిన్నము కోసము విషము ఇవ్వబడినను విషముతో కూడాపుట్టిన వాడగుటచే సగరుడు అనబడెను”.
*సగరస్యాసమంజస్తు అసమంజాత్ తథాంశుమాన్ |*
*దిలీపోంశుమతః పుత్త్రో దిలీపస్య భగీరథః ||*
తా|| “సగరునికి అసమంజుడు అలాగే అసమంజునికి అంశుమంతుడు కలిగెను. అంశుమతునికి దిలీపుడు దిలీపునికి భగీరథుడు కలిగిరి”.
*భగీరథాత్ కకుత్ స్థశ్చ కకుత్ స్థస్యరఘుస్సుతః |*
*రఘోస్తు పుత్త్ర స్తేజస్వీ ప్రవృద్ధః పురుషాదకః ||*
తా||” భగీరథునకు కకుత్‍స్థుడు కకుత్‍శ్థునికి రఘు కలిగిరి.రఘుపుత్రుడు తేజస్వి అగు ప్రవృద్ధుడు అయ్యెను” |
*కల్మాషపాదో హ్యభవత్ తస్మాజ్జాతస్తు శంఖణః |*
*సుదర్శన శ్శంఖణస్య అగ్నివర్ణ స్సుదర్శనాత్ ||*
తా||” ప్రవృద్ధుడు కల్మషాదుడు అయ్యెను. అతనికి శంఖణుడు కలిగెను. సంఖణుని పుత్రుడు సుదర్శనుడు.సుదర్శనునికి అగ్నివర్ణుడు కలిగెను”.
*శీఘ్రగస్త్వగ్నివర్ణస్య శీఘ్రగస్య మరుస్సుతః |*
*మరోః ప్రశుశ్రుక స్త్వాసీత్ అంబరీషః ప్రశుశ్రుక్రాత్ ||*
తా|| “అగ్నివర్ణుని పుత్రుడు శీఘ్రుగుడు. శీఘ్రుగుని పుత్రుడు మరు. మరుని పుత్రుడు ప్రశుశుకుడు. ప్రశుశుకునికి అంబరీషుడు కలిగెను”.
*అంబరీషస్య పుత్త్రో sభూత్ నహూషః పృథివీపతిః|*
*నహుషస్య యయాతిస్తు నాభాగస్తు యయాతిజః ||*
తా|| “అంబరీషునికి పృథివీపతి అగు నహూషుడు కలిగెను. నహూషునకు యయాతి కలిగెను. యయాతి పుత్రుడు నాభాగుడు”.
*నాభాగస్య బభూవాజో అజా ద్దశరథో sభవత్|*
*అస్మాద్దశరథా జ్జాతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ||*
తా|| “నాభాగుని పుత్రుడు అజుడు. అజుని పుత్రుడు దశరథుడు. ఆ దశరథునకు జన్మించిన సోదరులు రామలక్ష్మణులు”.
*ఆదివంశ విశుద్ధానాం రాజ్ఞాం పరమ ధార్మిణామ్ |*
*ఇక్ష్వాకుకుల జాతానాం వీరాణాం సత్యవాదినామ్ ||*
తా|| “ఇక్ష్వాకుకులములో జన్మించిన రాజులు శుద్ధమైన ఆదివంశము వారు. అత్యంత ధార్మికులు. సత్యవాదులు”.
*రామలక్ష్మణయోరర్థే త్వత్సుతే వరయే నృప |*
*సదృశాభ్యాం నరశ్రేష్ఠ సదృశే దాతుమర్హసి ||*
తా|| “ఓ రాజా! రామలక్ష్మణులు నీ కుమార్తెలకు తగిన వరులు . ఓ నరశ్రేష్ఠ ! తగిన వారికి తగిన వారిని ఇచ్చుటకు తగును”
*ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే సప్తతితమ స్సర్గః ||*
*సమాప్తం ||*
????????????????????????????????????????????????
????????????????????????????????????????????????
*జనక మహారాజు మిథిలాధిపతుల వంశ చరిత్ర చెప్పుట*
*ఏవం బ్రువాణం జనకః ప్రత్యువాచ కృతాంజలిః |*
*శ్రోతుమర్హసి భద్రం తే కులం నః పరికీర్తితమ్ ||*
తా|| ఈవిథముగా పలికిన వానికి ( వసిష్ఠునికి) అంజలి ఘటించి జనకుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. “మీకు శుభమగు గాక . కీర్తిపొందిన మా వంశ చరిత్ర మీరు వినుదురు గాక .”
*ప్రదానే హి మునిశ్రేష్ఠ కులం నిరవశేషతః |*
*వక్తవ్యం కులజాతేన తన్నిభోధ మహామునే ||*
తా|| ఓ మునిశ్రేష్ఠ ! కులాధిపతి (కన్యా) దానమిచ్చునప్పుడు శేషములేకుండా (తన వంశ చరిత్రను) వ్యక్తపరచవలెను గదా.
*రాజాభూత్ త్రిషు లోకేషు విశ్రుతః స్వేన కర్మణా |*
*నిమిః పరమ ధర్మాత్మా సర్వ సత్త్వవతాం వరః ||*
తా|| పరమధరాత్ముడు మూడు లోకములలోనూ తన కార్యములచేత ప్రశిద్ధికెక్కినవాడు , బలముకలవారిలో బలిష్ఠుడు అగు నిమి మహారాజు ( మావంశమునకు ) మూలపురుషుడు.
*తస్యపుత్త్రో మిధిర్నామా మిథిలా యేన నిర్మితా |*
*ప్రథమో జనకో నామ జనకాదప్యుదావసుః ||*
తా|| అయన పుత్త్రుడు మిథి అను పేరుగలవాడు. అయన చేత మిథిలానగరము నిర్మించబడినది. ఆయన మొదటి జనకుడు అను పేరుగలవాడు. జనకునకు ఉదావసుడు కలిగెను.
*ఉదావసోస్తు ధర్మాత్మా జాతో వై నందివర్ధనః |*
*నందివర్ధన పుత్త్రస్తు సుకేతుర్నామ నామతః ||*
తా|| ఉదావసునకి పుట్టెను దర్మాత్ముడగు నందివర్థనుడు. నందివర్థనుని పుత్త్రుడు సుకేతుడు అని పేరు గలవాడు.
*సుకేతోరపి ధర్మాత్మా దేవరాతో మహాబలః |*
*దేవరాతస్య రాజర్షేః బృహద్రథ ఇతి స్మృతః ||*
తా|| సుకేతునుకి ధర్మాత్ముడు మహాబలవంతుడు అగు దేవరాతుడు పుట్టెను. దేవరాతునకు రాజర్షి అగు బృహద్రధుడు కలిగెను.
*బృహద్రథస్య శూరోsభూత్ మహావీరః ప్రతాపవాన్ |*
*మహావీరస్య ధృతిమాన్ సుధృతి స్సత్యవిక్రమః ||*
తా|| బృహద్రధునికి శూరుడు మహాప్రతాపము గల మహావీరుడు కలిగెను. మహావీరునకు సత్యము పాలించు సుధృతి అను సుతుడు పుట్టెను.
*సుధృతేరపి ధర్మాత్మా దృష్టకేతు స్సుధార్మికః |*
*దృష్టకేతోస్తు రాజర్షేః హర్యశ్వ ఇతి విశ్రుతః ||*
తా|| సుధృతి కి కుడా దృష్ఠకేతు అనబడు సుధార్మికుడు కలిగెను. దృష్ట కేతునకు రాజర్షి అగు హర్యస్వుడు కలిగెను.
*హర్యశ్వస్య మరుః పుత్త్రో మరోః పుత్త్రః ప్రతింధకః |*
*ప్రతింధకస్య ధర్మాత్మా రాజా కీర్తిరథస్సుతః ||*
తా హర్యస్వుని పుత్త్రుడు మరు. మరుని పుత్రుడు ప్రతింధిక అనబడు వాడు. ప్రతింధకుని పుత్త్రుడు కీర్తిరథుడు అనబడువాడు
*పుత్త్రః కీర్తిరథస్యాపి దేవమీఢ ఇతిస్మృతః |*
*దేవమీఢస్య విబుధో విబుధస్య మహీధ్రకః ||*
తా|| కీర్తిరథుని పుత్త్రుడు దేవమీఢుడు. దేవమీఢునిపుత్రుడు విబుధుడు. విబుధుని పుత్రుడు మహీద్రకుడు.
*మహీధ్రకసుతో రాజా కీర్తిరాతో మహాబలః |*
*కీర్తిరాతస్య రాజర్షేః మహారోమా వ్యజాయత ||*
తా|| మహీద్రకుని పుత్రుడు మహాబలుడు అగు రాజా కీర్తిరాతుడు. కీర్తిరాతునికి రాజర్షి అగు మహారోముడు కలిగెను.
*మహారోమ్ణస్తు ధర్మాత్మా స్వర్ణరోమా వ్యజాయత |*
*స్వర్ణరోమస్తు రాజర్షేః హ్రస్వ రోమా వ్యజాయత ||*
తా|| మహారోముని పుత్రుడు స్వర్ణరోముడు. స్వర్ణరోముని పుత్రుడు హ్రస్వరోముడు.
*తస్య పుత్త్రద్వయం జజ్ఞే ధర్మజ్ఞస్య మహాత్మనః |*
*జ్యేష్ఠో హమనుమజో భ్రాతా మమవీరః కుశద్వజః ||*
తా|| ఆ ధర్మజ్ఞుడికి ఇద్దరు పుత్త్రులు. అ అనుజులలో నేను జ్యేష్ఠుడను. నా తమ్ముడు కుశధ్వజుడు.
*మాంతు జ్యేష్ఠం పితా రాజ్యే సోsభిషిచ్య నరాధిపః |*
*కుశధ్వజం సమావేస్య భారం మయి వనం గతః ||*
తా|| నరాధిపుడైన నా తండ్రి నాకు రాజ్యము పట్టాభిషేకము చేసి కుశధ్వజుని భారము అప్పగించి వనమునకు పోయెను.
*వృద్ధే పితరి స్వర్యాతే ధర్మేణ ధురమావహమ్ |*
*భ్రాతరం దేవసంకాశం స్నేహాత్ పశ్యన్ కుశధ్వజమ్ ||*
తా|| వృద్ధుడైన నాతండ్రి స్వర్గస్తులు అయినప్పుడు రాజ్యమును ధర్మబద్ధముగా చేయుచుంటిని. తమ్ముడగు అ కుశధ్వజుని స్నేహపూర్వకముగా చూచుచుంటిని.
*కస్యచిత్త్వథ కాలస్య సాంకాశ్యాదగమత్ పురాత్ |*
*సుధన్వా వీర్యవాన్ రాజా మిథిలాం అవరోధకః ||*
తా|| పిమ్మట కొంతకాలము తరువాత వీరుడగు సుధన్వుడు మిథిలానగరమునకు ప్రతిబంధకములు కలిగించుటకు సాంకశ్యనగరము నుంచి వచ్చెను.
*స చ మే ప్రేషయామాస శైవం ధనురుత్తమమ్ |*
*సీతా కన్యా చ పద్మాక్షి మహ్యం వ దీయతాంమితి ||*
తా|| అతడు నా ఉత్తమమైన శివ ధనస్సును , పద్మాక్షి అగు సీతను తనకి ఇవ్వమని వార్త పంపెను.
*తస్యాప్రదానార్బ్రహ్మర్షే యుద్ధమాసీన్మయా సహ |*
*స హతోs భిముఖో రాజా సుధన్వాతు మయా రణే |*
తా|| ఓ బ్రహ్మర్షీ ! తనకి ఇవ్వని కారణమువలన నాతో యుద్ధమునకు వచ్చెను. ఆ రాజు యుద్ధములో నా ఎదుట రణములో చనిపోయెను.
*నిహత్య తం మునిశ్రేష్ఠ సుధన్వానం నరాధిపమ్ |*
*సాంకాశ్యే భ్రాతరం వీరం అభ్యషించం కుశధ్వజమ్ ||*
తా|| ఓ మునిశ్రేష్ఠ ! ఆ నరాధిపుడగు సుధన్వుని సంహరించి సాంకాశ్యనగరమునకు సోదరుడు వీరుడగు కుశ ధ్వజుని పట్టాభిషిక్తుని చేసితిని.
*కనీయానేషమే భ్రాతా అహం జ్యేష్ఠో మహామునే |*
*దదామి పరమప్రీతో వధ్వౌ తే మునిపుంగవ |*
*సీతాం రామభద్రాయ భద్రం తే ఊర్మిళాం లక్ష్మణాయ చ |||*
తా|| ఓ మహామునీ ! ఇతడు నాతమ్ముడు. నేను పెద్దవాడిని. సీతను రామభద్రునకు ఊర్మిళను లక్ష్మణునకు ఇచ్చెదను. ఓ మునిపుంగవ మీకు మంగళమగు గాక .
*వీర్య శుల్కాం మమసుతాం సీతాం సురసుతోపమామ్|*
*ద్వితీయామూర్మిళాం చైవ త్రిర్వదామి నసంశయః ||*
తా|| సురలతో సమానమగు వీర్య శుల్కమగు నాకూతురు సీతని , రెందవది ఊర్మిళను అని మూడు సార్లు చెప్పుచున్నాను. సందేహము లేదు.
*రామలక్ష్మణయో రాజన్ గోదానం కారయస్వ హ |*
*పితృకార్యం చ భద్రం తే తతో వైవాహికం కురు |*
*మఖాహ్యద్య మహాబాహో తృతీయే దివసే ప్రభో ||*
*ఫల్గునా ముత్తరే రాజన్ తస్మిన్ వైవాహికం కురు |*
*రామలక్ష్మణయోరాజన్ దానం కార్యం సుఖోదయమ్ ||*
తా|| “ఓ రాజన్ ! రామలక్ష్మణులచేత గోదాన క్రియను జరిపించుడు. తండ్రి వివాహమునకు సంభంధించిన చేయవలసిన కార్యములు కూడా చేయుడు. ఈ దినము మఖ నక్షత్రము. ఓ మహాబాహో మూడవ దినము ఉత్తర ఫల్గుణి. అందు వివాహము చేయుడు. రామలక్ష్మణుల సుఖము కొఱకు దానకర్మలను చేయుడు”.
*ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ఏకసప్తతితమ స్సర్గః ||*
*సమాప్తం ||*
????????????????????????????????????????????????
????????????????????????????????????????????????
*సీతా రామ కల్యాణము*
*యస్మింస్తు దివసే రాజా చక్రే గోదాన ముత్తమమ్|*
*తస్మింస్తు దివసే శూరో యుధాజిత్ సముపేయవాన్ ||*
త|| ఉత్తమమైన గోదానము చేసిన దినమే శూరుడైన యుధాజిత్తు అచటికి వచ్చెను.
*పుత్త్రః కేకేయరాజస్య సాక్షాత్ భరతమాతులః|*
*దృష్ట్వా పృష్ట్వా తు కుశలంరాజానం ఇదమబ్రవీత్||*
తా|| అతడు కేకేయరాజపుత్త్రుడు. సాక్షాత్తు భరతుని మేమమామ . రాజుని చూచి కుశలములు అడిగి ఇట్లు పలికెను.
*కేకాయాధిపతీ రాజా స్నేహాత్ కుశలమబ్రవీత్ |*
*యేషాం కుశలకామోs సి తేషాం సంప్రత్యనామయమ్ ||*
తా ఓ రాజా ! కేకాయాధిపతి మీ కుశలములగురించి అడిగెను. ఏవరి కుశలములపై మీకు ప్రేమో వారందరూ కుశలమే
*స్వస్రీయం మమ రాజేంద్ర ద్రష్టుకామో మహీపతిః |*
*తదర్థముపయాతో sహమ్ అయోధ్యాం రఘునందన ||*
తా|| ఓ రఘునందన ఓ రాజేంద్ర ! నా మేనల్లుడుని చూడకోరితిని .అందుకు అయోధ్యానగరము పంపబడితిని.
*శ్రుత్వా త్వహ మయోధ్యాయాం వివాహార్థం తవాత్మజాన్ |*
*మిథిలాం ఉపయాతాంస్తు త్వయా తవ మహీపతే |*
*త్వరయాs భ్యుపాయాతోs హం ద్రష్టుకామః స్వస్సుతమ్ ||*
తా|| ఓ రాజా మీరు మీపుత్రులవైవాహనిమిత్తమై అయోధ్యానగరము నుంచి మిథిలానగరము వచ్చితిరని విని నామేనల్లుని చూడ కోరికతో నేను త్వరగా ఇచటికి వచ్చితిని.
*అథ రాజా దశరథః ప్రియాతిథిముపస్థితమ్ |*
*దృష్ట్వా పరమ సత్కారైః పూజార్హం సమపూజయత్ ||*
తా|| అప్పుడు దశరథ మహారాజు ఉపస్థితుడైన ప్రియమైన అతిథిని చూచి పూజార్హుడైన అతనిని చక్కగా పూజించెను.
*తతస్తాముషితో రాత్రిం సహపుత్త్రైర్మహాత్మభిః ||*
తా|| పిమ్మట పుత్త్రులు మహాత్ములతో కూడి ఆ రాత్రి సంతోషముతో గడిపెను.
*ప్రభాతే పునరుత్థాయ కృత్వా కర్మాణి కర్మవిత్ |*
*ఋషీం స్తదా పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్ ||*
తా|| ప్రభాత సమయమున మళ్ళీ లేచి చేయవలసిన కర్మలను చేసి అప్పుడు ఋషులను తో కలిసి యజ్ఞవాటికకు చేరెను.
*యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణ భూషితైః |*
*భాతృభిః సహితో రామః కృతకౌతుక మంగళః ||*
*వసిష్ఠం పురతః కృత్వా మహర్షీనపరానపి |*
*పితుః సమీప మాశ్రిత్య తస్థౌ భ్రాతృభిరావృతః|*
*వసిష్ఠో భగవానేత్య వైదేహీమిదమబ్రవీత్ ||*
తా|| అప్పుడు తగిన శుభమైన ముహూర్తములో సర్వాభరణభూషితుడైన రాముడు సోదరులతో కూడి చేయవలసి మంగళకార్యక్రమములను చేసి వసిష్ఠుడు తదితర ఋషులతో కలిసి తండ్రిని సమీపించి నిలబడెను. అప్పుడు భగవాన్ వసిష్ఠ మహాముని జనకునితో ఇట్లనెను.
*రాజా దశరథో రాజన్ కృత కౌతుక మంగళైః |*
*పుత్త్రైః నరవరశ్రేష్ఠ దాతారమ్ అభికాంక్షతే ||*
తా|| “ఓ రాజన్ ! దశరథ మహారాజు నరవరులలో శ్రేష్ఠుడైన తనపుత్రులతో చేయవలిసిన కౌతుక కర్మలను కావించి దాతవైన నీ కొరకు ఎదురుచూచున్నాడు”.
*దాతృప్రతిగ్రహీతృభ్యాం సర్వార్థాః ప్రభవంతి హి |*
*స్వధర్మం ప్రతిపద్యస్వ కృత్వా వైవాహ్యముత్తమమ్ ||*
తా|| “దానము ఇఛ్చువాడు దానిని పరిగ్రహించువాడు ద్వారానే అన్నికార్యక్రమములు అగును కదా ! ఉత్తమమైన వివాహము జరిపించి నీ ధర్మమును అనుసరించుము”.
*ఇత్యుక్తః పరమోదారో వసిష్ఠేన మహాత్మనా |*
*ప్రత్యువాచ మహాతేజా వాక్యం పరమధర్మవిత్ ||*
తా|| అని పరమ ఉదారుడైన మహాత్ముడగు వసిష్ఠుని చే చెప్పబడిన మహాతేజోవంతుడు పరమ ధర్మజ్ఞుడు అయిన జనకుడు ఇట్లు ప్రత్యుత్తరము ఇచ్చెను.
*కః స్థితః ప్రతిహారో మే కస్యాజ్ఞా సంప్రతిష్ఠతే |*
*స్వగృహే క్వ విచారోs స్తి యథారాజ్యమిదం తవ ||*
తా|| ఇది మీ రాజ్యమేనని భావింపుడు . మిమ్ములను అడ్డగించువారు ఏక్కడ ? ఎవరి ఆజ్ఞకు ఎదురు చూచుచున్నారు? స్వగృహమున సంకోచమెందుకు?
*కృతకౌతుక సర్వస్వా వేదిమూలముపాగతః |*
*మమ కన్యా మునిశ్రేష్ఠ దీప్తా వహ్నిరివార్చిషః ||*
తా|| ఓ మునిశ్రేష్ఠ ! నా పుత్రికలు చేయవలసిన కౌతుక కర్మలను చేసి వెలుగుచున్న అగ్నిజ్వాలలవలె తేజరిల్లుచూ వేదిక కడ ఉన్నారు.
*సజ్జో హం త్వత్ప్రతీక్షో స్మి వేద్యామస్యాం ప్రతిష్ఠితః |*
*అవిఘ్నం కురుతాం రాజా కిమర్థ మవలంబతే ||*
తా|| నేను సర్వసన్నధుడనై ఆ వేదిక వద్ద మీ కొఅకు ప్రతీంక్షుచున్నాను. ఓ రాజా విఘ్నము లేకుండా చేయుదురుగాక. జాప్యము చేయవలదు.
*తద్వాక్యం జనకేనోక్తం శ్రుత్వా దశరథస్తదా |*
*ప్రవేశయామాస సుతాన్ సర్వాన్ ఋషిగణానపి ||*
తా|| అప్పుడు దశరథుడు జనకునిచే చెప్పబడిన ఆ మాటలను విని తన పుత్రులందరితో ఋషిగణములతో ప్రవేశించెను.
*తతో రాజా విదేహానాం వసిష్ఠమిదమబ్రవీత్ |*
*కారయస్వ ఋషేసర్వం ఋషిభిః సహ ధార్మిక |*
*రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం విభో ||*
తా|| అప్పుడు విదేహ రాజు వసిష్ఠునితో ఇట్లనెను. “ఓ ధార్మిక ! ఋషులతో కూడి లోకరాముని సర్వకార్యములు చేయుడు. ఓ విభో ! రామునియొక్క వైవాహిక క్రియను జరిపింపుడు.
*తథేత్యుక్త్వాతు జనకం వసిష్ఠో భగవాన్ ఋషిః |*
*విశ్వామిత్రం పురస్కృత్య శతానందం చ ధార్మికమ్ ||*
*ప్రపామధ్యేతు విధివత్ వేదిం కృత్వా మహాతపాః |*
*అలం చకార తాం వేదిమ్ గంధపుష్పైస్సమంతతః ||*
తా|| జనకునితో అట్లేనని చెప్పి ఋషి భగవాన్ వసిష్ఠుడు ధార్మికుడైన విశ్వామిత్రుని తో శతానందునితో కలిసి యథావిథిగా వేదికను మండపు మధ్యలో చేసి ఆ వేదికను గంధపుష్పములతో అలంకరించెను.
*సువర్ణపాలికాభిశ్చ ఛిద్రకుంభైశ్చ సాంకురైః |*
*అంకురాడ్యైశ్శరావై శ్చ ధూపపాత్రై స్సధూపకైః ||*
*శంఖపాత్రైః స్రువైః స్రుగ్భిః పాత్రైరర్ఘ్యాభిపూరితైః |*
*లాజపూర్ణైశ్చ పాత్రీభిః అక్షతైరభిసంస్కృతైః ||*
తా|| ఆ వేదిక సువర్ణ పాత్రలతో , అంకురములతో కూడిన చిల్లులు కల కడవలతోనూ, మొలకులతో ఒప్పుచున్న మూకుళ్ళతో , ధూపముతో కూడిన ధూపపాత్రలతో ( నిండియున్నది). శంఖపాత్రలతో స్రుక్సువములతోనూ , అర్ఘ్యజలముతో నిండిన పాత్రలతోనూ పేలాలతో కూడిన పాత్రలతో, అక్షతలతో కూడిన పాత్రలతో (వేదికను సిద్ధము చేసిరి).
*దర్భైస్సమైస్సమాస్తీర్య విధివన్మంత్రపూర్వకమ్ ||*
*అగ్నిమాదాయ వేద్యాం తు విధిమంత్ర పురస్కృతమ్ |*
*జుహావాగ్నౌ మహాతేజా వసిష్ఠో భగవాన్ ఋషిః ||*
తా|| మంత్రపూర్వకమైన సమానమైన దర్భలతో విధివశముగా వేదికను అలంకరించి, మంత్రపూర్వకముగా అగ్నిని తీసుకు వచ్చి, మహాతేజోవంతుడైన భగవాన్ వసిష్ఠుడు అగ్నిని వెలిగించెను.
*శ్రీ సీతాకల్యాణ మహోత్సవ ఘట్టః*
*తతస్సీతాం సమానీయ సర్వా భరణ భూషితాం |*
*సమక్షేమగ్నే సంస్థాప్య రాఘవాభిముఖే తదా |*
*అబ్రవీజ్జనకో రాజా కౌసల్యా నందవర్ధనమ్ ||*
తా|| అప్పుడు అన్ని ఆభరణములతో అలంకరింపబడిన సీతను తీసుకు వచ్చి అగ్నికి ఏదురుగా , రాముని ఎదురుకుండా కూర్చునబెట్టి ఆ జనక మహారాజు కౌసల్యా నందవర్ధనునితో ఇట్లు పలికెను.
*ఇయం సీతా మమసుతా సహధర్మచరీ తవ |*
*ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణీనా ||*
తా|| నా కుమార్తె యగు ఈ సీత నీ సహధర్మచారిణిగా స్వీకరింపుము . నీకు శుభమగుగాక .(ఆమే) చేతిని (నీ) చేతిలో తీసుకొనుము.
*పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా |*
*ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మంత్రపూతం జలం తదా ||*
తా|| “సర్వసౌభాగ్యవతి అయిన పతివ్రత ఎల్లప్పుడు నీకు నీడవలె అనుసరించును” అని పలికి మంత్రపూరితమైన జలమును ప్రక్షాలించెను.
*సాధు సాధ్వితి దేవానాం ఋషీణాం వదతాం తదా |*
*దేవదుందుభి నిర్ఘోషః పుష్పవర్షో మహానభూత్ ||*
తా|| దేవతలూ ఋషులు అప్పుడు “బాగు బాగు” అని పలికిరి. అప్పుడు దేవదుందుభులు మ్రోగెను. మహత్తరమైన పుష్పవృష్ఠి కురిశెను.
*ఏవం దత్వా తదా సీతాం మంత్రోదకపురస్కృతామ్ |*
*అబ్రవీజ్జనకో రాజా హర్షేణాభి పరిప్లుతః ||*
తా|| అప్పుడు మంత్రోదకములతో సీతను ఇచ్చి జనక మహారాజు హర్షముతో పొంగిపోవుచూ ఇట్లు పలికెను.
*లక్ష్మణాగచ్ఛ భద్రంతే ఊర్మిళాం ఉద్యతాం మయా |*
*ప్రతీచ్ఛ పాణిం గృహ్ణీష్వ మాభూత్ కాలస్య పర్యయః ||*
తా|| “లక్ష్మణా రమ్ము. నీకు శుభమగుగాక. నేను ఊర్మిళను ఇచ్చెదను. స్వీకరించుము . పాణిగ్రహణము చేయుము. ముహూర్తకాలము దాటకుండుగాక”.
*తమేవ ముక్త్వా జనకో భరతం చాభ్యభాషత |*
*గృహాణ పాణిం మాండవ్యాః పాణీన రఘునందన ||*
తా||ఇట్లు పలికిన జనకుడు భరతునితో ఇట్లు పలికెను. “ఓ రఘునందన మాండవియొక్క చేయిని పాణిగ్రహణము చేయుము”.
*శతృఘ్నం చాపి ధర్మాత్మా అబ్రవీజ్జనకేశ్వరః |*
*శ్రుతకీర్త్యా మహాబాహో పాణిం గృహ్ణీష్వ పాణినా ||*
తా| ధర్మాత్ముడైన జనకుడు శతృఘ్నునితో ఇట్లు పలికెను. “ఓ మహాబాహో ! శ్రుతకీర్తి చేతిని పాణిగ్రహణము చేయుము “.
*సర్వే భవంతః సౌమ్యాశ్చ సర్వే సుచరితవ్రతాః |*
*పత్నీభిస్సంతు కాకుత్ స్థ మాభూత్ కాలస్య పర్యయః ||*
తా|| “ఓ కకుత్‍స్థులారా ! మీరు అందరూ సౌమ్యులు. మీరందరూ మంచి చరిత్రకలవారు. మీభార్యలతో ( సుఖముగా) ఉందురుగాక. కాలము అతిక్రమించకూడదు”.
*జనకస్య వచః శ్రుత్వా పాణీన్ పాణిభిరస్పృశన్ |*
*చతారస్తే చతసౄణామ్ వసిష్ఠస్య మతే స్థితాః ||*
తా|| వసిష్ఠుని మదిలో నున్న అ జనకుని మాటలను విని నలుగురూ నలుగురు పాణిగ్రహణము చేసిరి.
*అగ్నిం ప్రదక్షిణీకృత్యా వేదిం రాజానమేవ చ |*
*ఋషీంశ్చైవ మహాత్మానః స భార్యా రఘుసత్తమాః ||*
*యథోక్తేన తదా చక్రుర్వివాహమ్ విధిపూర్వకమ్ |*
తా|| ఆ రఘుసత్తములు భార్యలతో కలిసి అగ్నివేదికనూ రాజులనూ ఋషులని ప్రదక్షిణము చేసి విధి పూర్వకముగా వేదములలో చెప్పిన విథముగా వివాహము చేసికొనిరి.
*పుష్పవృష్టిర్మహత్యాసీత్ అంతరిక్షాత్ సుభాస్వరా |*
*దివ్య దుందుభి నిర్ఘోషైః గీతవాదిత్రనిస్వనైః ||*
*ననృతు శ్చాప్సరస్సంఘా గంధర్వాశ్చ జగుః కలమ్ |*
*వివాహే రఘుముఖ్యానాం తదద్భుత మదృశ్యత ||*
తా|| అంతరిక్షమునుండి దివ్యదుందుభులు , గీత వాద్యములు మోగుచుండగా వెలుగుచున్న పుషవృష్ఠి కురిశెను. అప్సరసంఘములు నృత్యము చేసిరి. గాంధర్వులు గానము చేసిరి. రఘుముఖ్యుల వివాహము అత్యంత అద్భుతముగా జరిగెను.
*ఈదృశే వర్తమానే తు తూర్యోద్ఘుష్టనినాదితే |*
*త్రిరగ్నిం పరిక్రమ్య ఊహూర్భార్యా మహౌజసః ||*
తా|| ఈ విథముగా తూర్యాది వాద్యములు మోగుచుండ తేజోమూర్తులైన ఆ దంపతులు మూడు సార్లు అగ్నికి ప్రదక్షిణము చేసిరి.
*అథోపకార్యాం జగ్ముస్తే స భార్యా రఘునందనాః |*
*రాజాప్యనుయయౌ పశ్యన్ సర్షిసంఘస్సబాంధవః ||*
తా|| పిమ్మట భార్యలతో కలిసి ఆ రఘునందనులు విడిదికి వెళ్ళిరి. ఋషిసంఘములతో బంధువులతో కూడి ఆ రాజు వారిని ఆనందముతో చూచుచూ వారిని అనుసరించెను.
*ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే త్రిసప్తతితమస్సర్గః ||*
*సమాప్తం ||*
????????????????????????????????????????????????
????????????????????????????????????????????????
*శ్రీరామ పట్టాభిషేకః*
*శిరస్యంజలి మాధాయ కైకేయ్యానన్దవర్ధనః|*
*బభాషే భరతో జ్యేష్ఠం రామం సత్యపరాక్రమమ్1*
*పూజితా మామికా మాతా దత్తం రాజ్యం మిదం మమ|*
*తద్దదామి పునస్తుభ్యం యదా త్వం అదదామమ2*
*ధురమేకాకినా న్యస్తా మృషభేణ బలీయసా|*
*కిశోరీవ గురుం భారం నవోఢుం అహముత్సహే3*
*వారివేగేన మహతా భిన్నస్సేతురివ క్షరన్|*
*దుర్బన్ధన మిదం మన్యే రాజ్యచ్చిద్రమసంవృతమ్4*
*గతిం ఖర ఇవాశ్వస్య హంసస్యేవ చ వాయసః|*
*నాన్వేతు ముత్సహే రామ తవమార్గమరిందమ5*
*యథా చారోపితో వృక్షో జాతశ్చాన్తర్నివేశనే|*
*మహాంశ్చ సు దురాహారో మహాస్కన్ధప్రశాఖవాన్6*
*శీర్యేత పుష్పితో భూత్వా న ఫలాని ప్రదర్శయన్|*
*తస్య నానుభవే దర్థం యస్య హేతోః స రోప్యతే7*
*ఏషోపమా మహాబాహో త్వమర్థం వేత్తుమర్హసి|*
*యద్యస్మాన్మనుజేంద్ర త్వం భక్తాన్భృత్యాన్నశాధి హి 8*
*జగదద్యాభిషిక్తం త్వామనుపశ్యతు సర్వతః|*
*ప్రతపన్త మివాదిత్యం మధ్యాహ్నే దీప్త తేజసమ్9*
*తూర్య సంఘాత నిర్ఘోషైః కాంచీనూపురనిస్వ్యనైః|*
*మధురైర్గీతశబ్దైశ్చ ప్రతిబుధ్యస్వ రాఘవ10*
*యావదావర్తతే చక్రం యావతీచ వసుంధరా|*
*తావత్వమిహ సర్వస్య స్వామిత్యమనువర్తయ11*
*భరతస్య వచః శ్రుత్వా రామః పరపురంజయః|*
*తథేతి ప్రతిజగ్రాహ నిషసాదాసనే శుభే12*
*తతః శత్రుఘ్నవచనాన్ నిపుణాః శ్మశ్రువర్ధకాః|*
*సుఖహస్తాః సుశీఘ్రాశ్చ రాఘవం పర్యుపాసత13*
*పూర్వం తు భరతే స్నాతే లక్ష్మణే చ మహాబలే|*
*సుగ్రీవే వానరేన్ద్రే చ రాక్షసేన్ద్రే విభీషణే14*
*విశోధితజటః స్నాతః చిత్రమాల్యానులేపనః|*
*మహార్హవసనో రామః తస్థౌ తత్ర శ్రియా జ్వలన్15*
*ప్రతికర్మచ రామస్య కారయామాస వీర్యవాన్|*
*లక్ష్మణస్య చ లక్ష్మీవాన్ ఇక్ష్వాకు కులవర్ధనః16*
*ప్రతికర్మ చ సీతాయాః సర్వా దశరథస్త్రియః|*
*ఆత్మనైవ తదా చక్రుర్మనస్విన్యో మనోహరమ్17*
*తతో వానరపత్నీనాం సర్వసామేవ శోభనమ్|*
*చకార యత్నాత్ కౌసల్యా ప్త్రహృష్టా పుత్రలాలసా18*
*తతః శత్రుఘ్నవచనాత్ సుమన్త్రో నామసారథిః|*
*యోజయిత్వాsభిచక్రామ రథం సర్వాంగశోభనమ్19*
*అర్కమణ్డల సంకాశం దివ్యం దృష్ట్వా రథోత్తమమ్|*
*ఆరురోహ మహాబాహూ రామః సత్యపరాక్రమః20*
*సుగ్రీవో హనుమాంశ్చైవ మహేన్ద్ర సదృశద్యుతీ|*
*స్నాతౌ దివ్యనిభైర్వస్రైర్జగ్మతుః శుభకుణ్డలౌ21*
*వరాభరణ సంపన్నా యుయుః తాః శుభకుణ్డలౌ|*
*సుగ్రీవపత్న్యః సీతా చ ద్రష్ఠుం నగరముత్సుకాః22*
*అయోధ్యాయాం తు సచివా రాజ్ఞో దశరథస్య యే|*
*పురోహితం పురస్కృత్య మన్త్రయామాసురర్థవత్23*
*అశోకో విజయశ్చైవ సుమన్త్రశ్చైవ సంగతాః|*
*మన్త్రయన్ రామవృధ్యర్థం వృధ్యర్థం నగరస్య చ24*
*సర్వమేవాభిషేకార్థం జయార్హస్య మహాత్మనః|*
*కర్తు మర్హథ రామస్య యద్యన్మంగళపూర్వకమ్25*
*ఇతి మన్త్రిణః సర్వే సన్దిశ్యతు పురోహితమ్|*
*నగరాన్ నిర్యయుస్తూర్ణం రామదర్శన బుద్ధయః26*
*హరియుక్తం సహస్రాక్షో రథమిన్ద్ర ఇవానఘః|*
*ప్రయయౌ రథమాస్థాయ రామోనగరముత్తమమ్27*
*జగ్రాహ భరతోరశ్మీన్ శత్రుఘ్నశ్ఛత్రమాదదే|*
*లక్ష్మణోవ్యజనం తస్య మూర్థ్నిసమర్యవీజయత్28*
*శ్వేతం చ వ్యాలవ్యజనం జగ్రాహ పురతః స్థితః |*
*అపరం చంద్రసంకాశం రాక్షసేన్ద్రో విభీషణః29*
*ఋషిసంఘైః తదాకాశే దేవైశ్చ సమరుద్గణైః|*
*స్తూయమానస్య రామస్య శుశ్రువే మధురధ్వనిః30*
*తతః శత్రుం జయం నామ కుంజరం పర్వతోపమం|*
*అరురోహమహాతేజాః సుగ్రీవః ప్లవగర్షభః31*
*నవనాగసహస్రాణి యుయురాస్థాయ వానరాః|*
*మానుషం విగ్రహం కృత్వా సర్వాభరణభూషితాః32*
*శబ్ద శబ్దప్రణాదైశ్చ దున్దుభీనాం చ నిస్స్వనైః|*
*ప్రయయౌ పురుషవ్యాఘ్రః తాం పురీం హర్మ్యమాలినీమ్33*
*దదృశుస్తే సమాయాన్తం రాఘవం స పురస్సరమ్|*
*విరాజమానం వపుషా రథేనాతిరథం తదా34*
*తే వర్థయిత్వా కాకుత్‍స్థం రామేణ ప్రతివన్దితాః|*
*అనుజగ్ముర్మహాత్మానం భ్రాతృభిఃపరివారితమ్35*
*అమాత్యైర్బ్రాహ్మణైశ్చైవ తథా ప్రకృతిభిర్వృతః|*
*శ్రియా విరురుచే రామో నక్షత్రైరివ చన్ద్రమాః36*
*సపురోగామిభిః తూర్యైః తాళస్వస్తిక పాణిభిః |*
*ప్రవ్యాహరద్భిర్ముదితైః మంగళాని యయౌ వృతః37*
*అక్షతం జాతరూపం చ గానః కన్యాస్తథా ద్విజాః|*
*నరామోదకహస్తాశ్చ రామస్య పురతో యయుః38*
*సఖ్యం చ రామః సుగ్రీవే ప్రభావం చానిలాత్మజే|*
*వానరాణామ్ చ తత్కర్మ రాక్షసానాం చ తద్బలమ్39*
*విభీషణస్య సంయోగమాచచక్షే చ మన్త్రిణామ్|*
*శ్రుత్వా తు విస్మయం జగ్ముః అయోధ్యాపురవాసినః40*
*ద్యుతిమానేతదాఖ్యాయ రామో వానరసంవృతః|*
*హృష్టపుష్టజనాకీర్ణాం అయోధ్యాం ప్రవివేశ హ41*
*తతో హ్యభ్యుచ్ఛ్రయన్ పౌరాః పతాకాస్తే గృహే గృహే|*
*ఇక్ష్వాకాధ్యుషితం రమ్యం ఆససాదపితుర్గృహమ్42*
*అథాబ్రవీత్ రాజసుతో భరతం ధర్మిణాం వరం|*
*అర్థోపహితయా వాచా మధురం రఘునన్దనః43*
*పితుర్భవనమాసాద్య ప్రవిశ్య చ మహాత్మనః|*
*కౌసల్యాం చ సుమిత్రాంచ కైకేయీం అభివాద్యచ44*
*యచ్చమద్భవనం శ్రేష్ఠం సాశోకవనికం మహత్|*
*ముక్తావైడూర్యసంకీర్ణం సుగ్రీవాయ నివేదయ45*
*తస్య తద్వచనం శ్రుత్వా భరతః సత్యవిక్రమః|*
*పాణౌ గృహీత్వా సుగ్రీవం ప్రవివేశ తమాలయమ్46*
*తతః తైలప్రదీపాంశ్చ పర్యంకాస్తరణాని చ|*
*గృహీత్వా వివిశుః క్షిప్రం శత్రుఘ్నేన ప్రచోదితాః47*
*ఉవాచ చ మహాతేజాః సుగ్రీవం రాఘవానుజః|*
*అభిషేకాయ రామస్య దూతా నాజ్ఞాపయ ప్రభో48*
*సౌవర్ణాన్ వానరేన్ద్రాణాం చతుర్ణాం చతురో ఘటాన్|*
*దదు క్షిప్రం స సుగ్రీవః సర్వరత్నవిభూషితాన్49*
*యథా ప్రత్యూషసమయే చతుర్ణాం సాగరామ్భసామ్|*
*పూర్ణైర్ఘటైః ప్రతీక్షధ్వం తథా కురుత వానరాః50*
*ఏవముక్తా మహాత్మానో వానరా వారణోపమాః|*
*ఉత్పేతుర్గగనం శీఘ్రం గరుడా ఇవ శీఘ్రగాః51*
*జాంబవాంశ్చ హనుమాంశ్చ వేగదర్శీ చ వానరః|*
*ఋషభశ్చైవ కలశాం జలపూర్ణాన్ అథానయన్52*
*నదీశతానాం పంచానాం జలం కుమ్భేషు చాహరన్|*
*పూర్వాత్ సముద్రాత్ కలశం జలపూర్ణమథాsనయత్53*
*సుషేణః సత్వసంపన్నః సర్వరత్న విభూషితమ్|*
*ఋషభో దక్షిణాత్తూర్ణం సముద్రాత్ జలమాహరత్54*
*రక్తచన్దనశాఖాభిః సంవృతం కాంచనం ఘటమ్|*
*గనయః పశ్చిమాత్ తోయం ఆజహారమహార్ణవాత్55*
*రత్నకుమ్భేన మహతా శీతం మారుతవిక్రమః|*
*ఉత్తరాచ్చ జలం శీఘ్రం గరుడానిలవిక్రమః56*
*అజహార సధర్మాతా నళః సర్వగుణాన్వితః|*
*తతస్తైః వానరశ్రేష్ఠైః ఆనీతం ప్రేక్ష్య తజ్జలమ్57*
*అభిషేకాయ రామస్య శత్రుఘ్నః సచివైః సహ|*
*పురోహితాయ శ్రేష్ఠాయ సుహృద్భ్యశ్చ న్యవేదయత్58*
* శ్రీరామపట్టాభిషేకఘట్టః *
*తతస్స ప్రయతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణైస్సహ |*
*రామం రత్నమయే పీఠే సహసీతం న్యవేశయత్ 59*
*వసిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః |*
*కాత్యాయనస్సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా 60*
*అభ్యషించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా |*
*సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా 61*
*ఋత్విగ్బిః బ్రాహ్మణైః పూర్వం కన్యాభిః మంత్రిభిస్తదా |*
*యోధై శ్చైవాభ్యషించంస్తే సంప్రహృష్టాః సనైగమైః 62*
*సర్వౌష ధిరస్తెర్దివ్యైః దైవతేర్నభసి స్థితైః |*
*చతుర్భిర్లోకపాలైశ్చ సర్వేర్దేవైశ్చ సంగతైః 63*
*బ్రహ్మణానిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితమ్|*
*అభిషిక్తః పురా యేన మనుస్తం దీప్త తేజసమ్64*
*తస్యాన్వవాయే రాజానః క్రమాత్ యేనాభిషేచితాః|*
*సభాయాం హేమక్లప్తాయాం శోభితాయాం మహాధనైః65*
*రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనైః|*
*నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిథి66*
*కిరీటేన తతః పశ్చాత్ వసిష్టేన మహాత్మనా|*
*ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః67*
*ఛత్రం తు తస్య జగ్రాహ శత్రుఘ్నః పాండురం శుభమ్|*
*శ్వేతం చ వాలవ్యజనం సుగ్రీవో వానరేశ్వరః 68*
*అపరం చంద్ర సంకాశం రాక్షసేంద్రో విభీషణః |*
*మాలాం జ్వలంతీం వపుషా కాంచనీం శతపుష్కరామ్ 69*
*రాఘవాయ దదౌ వాయుః వాసవేన ప్రచోదితః |*
*సర్వరత్న సమాయుక్తం మణిరత్న విభీషితమ్ 70*
*ముక్తాహారం నరేంద్రాయ దదౌ శక్ర ప్రచోదితః |*
*ప్రజగుర్దేవగంధర్వాః ననృతుశ్చాప్సరోగణాః 71*
*అభిషేకే తదర్హస్య తదా రామస్య ధీమతః|*
*భూమిః సస్యవతీశ్చైవ ఫలవంతశ్చ పాదపాః 72 *
*గంధవంతి చ పుష్పాణి బభూవూ రాఘవోత్సవే |*
*సహస్రశతమశ్వానాం ధేనూనాం చ గవాం తథా 73*
*దదౌ శతమ్ వృషాన్ పూర్వం ద్విజేభ్యో మనుజర్షభః*
*త్రింశత్కోటీర్హిరణ్యస్య బ్రాహ్మణేభ్యో దదౌ పునః 74*
*నానాభరణ వస్త్రాణి మహార్హాణి చ రాఘవః |*
*అర్కరస్మి ప్రతీకాశం కాంచనీం మణివిగ్రహమ్ 75*
*సుగ్రీవాయ స్రజం దివ్యాం ప్రాయచ్చన్మనుజర్షభః |*
*వైడూర్యమణి చిత్రే చ వజ్రరత్న విభూషితే 76*
*వాలిపుత్రాయ ధ్రుతిమాన్ అంగదాయాంగదే దదౌ |*
*మణి ప్రవరజుష్టంచ ముక్తాహారమనుత్తమమ్ 77*
*సీతాయై ప్రదదౌ రామః చంద్రరశ్మిసమప్రభమ్ |*
*అరజే వాససీ దివ్యే శుభాన్యాభరణాని చ 78*
*అవేక్షమాణా వైదేహీ ప్రదదౌ వాయుసూనవే |*
*అవముచ్యాత్మనః కంఠాత్ హారం జనకనందినీ 79*
*అవైక్షత హరీన్ సర్వాన్ భర్తారం చ ముహుర్ముహుః|*
*తామింగితజ్ఞస్సంప్రేక్ష్య బభాషే జనకాత్మజామ్ 80*
*ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని |*
*పౌరుషం విక్రమో బుద్ధిః యస్మిన్నేతాని సర్వశః 81*
*దదౌ సా వాయుపుత్రాయ తం హారమసితేక్షణా |*
*హనుమాంస్తేన హారేణ శుశుభే వానరర్షభః 82 *
*చంద్రాంశుచయగౌరేణ శ్వేతాభ్రేణ యథాచలః |*
*తతో ద్వివిదమైందాభ్యాం నీలాయ చ పరంతపః 83*
*సర్వాన్ కామగుణాన్ వీక్ష్య ప్రదదౌ వసుదాధిప |*
*సర్వవానరవృద్ధాశ్చ యే చాన్యే వానరేశ్వరాః 84*
*వాసోభిర్భూషణైశ్చైవ యథార్హం ప్రతిపూజితాః |*
*విభీషణోథ సుగ్రీవో హనుమాన్ జాంబవాంస్తథా 85*
*సర్వవానర ముఖ్యాశ్చ రామేణా క్లిష్టకర్మణా |*
*యథార్హం పూజితాః సర్వైః కామై రత్నైశ్చ పుష్కలైః 86*
*ప్రహృష్టమనస్సర్వే జగ్మురేవ యథాగతమ్ |*
*దృష్టా సర్వే మహాత్మానం తతస్తే ప్లవగర్షభాః 87*
*విసృష్టాః పార్థివేంద్రేణ కిష్కింధామభ్యుపాగమన్ |*
*సుగ్రీవో వానరశ్రేష్ఠో దృష్ట్వా రామాభిషేచనమ్ 88*
*లబ్ధ్వా కులధనం రాజా లంకాం ప్రాయాద్విభీషణః |*
*సరాజ్య మఖిలం శాసన్ నిహతారిర్మహాయశాః 89*
*రాఘవః పరమోదారః శశాస పరయాముదా |*
*ఉవాచ లక్ష్మణం రామో ధర్మజ్ఞం ధర్మ వత్సలః 90*
*అతిష్ఠ ధర్మజ్ఞ మయా సహేమాం*
*గాం పూర్వరాజాధ్యుషితాం బలేన |*
*తుల్యం మయా త్వం పితృభిః ధృత యా*
*తాం యౌవరాజ్యే ధురముధ్వహస్వ 91*
*సర్వాత్మనా పర్యనునీయమానో*
*యథా న సౌమిత్రిరుపైతి యోగమ్ |*
*నియుజ్యమానోపి చ యౌవరాజ్యే*
*తతోభ్యషించద్భరతం మహాత్మా 92 *
*పౌండరీకాశ్వమేధాభ్యాం వాజపేయేన చాసకృత్ |*
*అన్యైశ్చ వివిధైర్యజ్ఞైః అయజత్ పార్థివర్షభః 93*
*రాజ్యం దశ సహస్రాణి ప్రాప్య వర్షాణి రాఘవః |*
*శతాశ్వమేధానాజహ్రే సదశ్వాన్ భూరిదక్షిణాన్ 94*
*ఆజానులంబ బాహుః సమహాస్కంధః ప్రతాపవాన్ |*
*లక్ష్మణానుచరో రామః పృథ్వీమన్వపాలయత్ 95*
*రాఘవశ్చాపి ధర్మాత్మా ప్రాప్య రాజ్యమనుత్తమమ్ |*
*ఈజై బహువిధైర్యజ్ఞైః ససుహృత్ జ్ఞాతిబాంధవః 96*
*న పర్యదేవన్ విధవా న చ వ్యాళకృతం భయమ్ |*
*న వ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి 97*
*నిర్దస్యురభవల్లోకో నానర్థః కంచిదస్పృశత్ |*
*న చ స్మ వృద్ధా బాలానాం ప్రేతకార్యాణి కుర్వతే 98*
*సర్వం ముదిత మేవాసీత్ సర్వో ధర్మపరో భవత్ |*
*రామమేవానుపశ్యంతో నాభ్యహింసన్ పరస్పరమ్ 99*
*ఆసన్ వర్ష సహస్రాణి తథా పుత్త్రసహస్రిణః |*
*నిరామయా విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి 100*
*రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథాః |*
*రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి 101*
*నిత్య పుష్పా నిత్య ఫలాః తరవః స్కంధవిస్తృతాః |*
*కాలే వర్షీచ పర్జన్యః సుఖస్పర్శశ్చ మారుతః 102*
*బ్రాహ్మణాః క్షత్రియాః వైశ్యాః శుద్రా లోభవివర్జితాః |*
*స్వకర్మసు ప్రవర్తంతే తుష్టాః స్వైరేవ కర్మభిః 103*
*ఆసన్ ప్రజా ధర్మరతా రామే శాసతి నానృతాః |*
*సర్వే లక్షణ సంపన్నాః సర్వే ధర్మ పరాయణాః 104*
*దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ |*
*భాతృభిస్సహితః శ్రీమాన్ రామో రాజ్యమకారయత్ 105*
*ధర్మ్యం యశస్యమాయుష్యం రాజ్ఞాం చ విజయావహమ్ |*
*ఆదికావ్యమిదం త్వార్షం పురా వాల్మీకినా కృతమ్ 106*
*యః పఠేచ్ఛృణుయాల్లోకే నరః పాపాద్విముచ్యతే |*
*పుత్రకామాస్తు పుత్రాన్ వై ధనకామో ధనాని చ 107*
*లభతే మనుజే లోకే శ్రుత్వా రామాభిషేచనమ్ |*
*మహీమ్ విజయతే రాజా రిపూంశ్చాప్యధితిష్ఠతి 108*
*రాఘవేణ యథా మాతా సుమిత్రా లక్ష్మణేన చ |*
*భరతేనైవ కైకేయీ జీవపుత్రస్తథా స్త్రియః 109*
*శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుశ్చ విందతి |*
*రామస్య విజయంచైవ సర్వమక్లిష్టకర్మణః 110*
*శృణోతి య ఇదం కావ్యం అర్షం వాల్మీకినా కృతమ్*
*శ్రద్ధదానో జితక్రోధో దుర్గాణ్యతితరత్యసౌ 111*
*సమాగమ్య ప్రవాసాంతే లభతే చాపి బాంధవైః*
*ప్రార్థితాంశ్చ వరాన్ సర్వాన్ ప్రాప్నుయాదిహ రాఘవాత్ 112 *
*శ్రవణేన సురాస్సర్వే ప్రీయంతే సంప్రశృణ్వతాం |*
*వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్ఠంతి యస్యవై 113*
*విజయేత మహీమ్ రాజా ప్రవాసీ స్వస్తిమాన్ వ్రజేత్ |*
*స్త్రియో రజస్వలాః శ్రుత్వా పుత్రాన్ సూయురనుత్తమామ్ 114*
*పూజయంశ్చ పఠంశ్చేమమ్ ఇతిహాసం పురాతనమ్ |*
*సర్వపాపాత్ ప్రముచ్యేత దీర్ఘమాయురవాప్నుయాత్ 115*
*ప్రణమ్య శిరసా నిత్యం శ్రోతవ్యం క్షత్రియైర్ ద్విజాత్ |*
*ఇశ్వర్యం పుత్రలాభశ్చ భవిష్యతి న సంశయః 116*
*రామాయణమిదం కృత్స్నం శుణ్వతః పఠతస్సదా |*
*ప్రీయతే సతతం రామః సహి విష్ణుః సనాతనః 117*
*ఆదిదేవో మహాబాహుః హరిర్నారాయణః ప్రభుః |*
*సాక్షాద్రామో రఘుశ్రేష్ఠః శేషో లక్ష్మణ ఉచ్యతే 118*
*కుటుంబ వృద్ధిం ధనధాన్యవృద్ధిం*
*స్త్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమం చ|*
*శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం*
*ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం 119*
*ఆయుష్య మారోగ్యకరం యశస్యం*
*సౌభ్రాతృకం బుద్ధికరం సుఖంచ |*
*శ్రోతవ్య మేతన్నియమేన సద్భిః*
*ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః 120*
*ఏవమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు వః |*
*ప్రవ్యాహరత విస్రబ్ధం బలం విష్ణోః ప్రవర్థతామ్ 121*
*దేవాశ్చ సర్వే తుష్యంతి శ్రవణాద్గ్రహణాత్ తథా |*
*రామాయణస్య శ్రవణాత్ తుష్యంతి పితరస్తథా 122*
*భక్త్యా రామస్య యే చేమాం సంహితాం ఋషిణా కృతామ్ |*
*లేఖయంతీహ చ వరాః తేషాం వాసః త్రివిష్టపే 123 *
*ఇత్యార్షే శ్రీమద్రామాయణే* *వాల్మీకియే ఆదికావ్యే*
*యుద్ధకాండే శ్రీరామపట్టాభిషేకోనామ అంతిమసర్గః ||*
*సమాప్తం*
????????????????????????????????????????????????
????????????????????????????????????????????????
*మంగళా శాసనం*
????????????????????????????????????????????????
*స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః|*
*గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాస్సమస్తాః సుఖినో భవంతు||*
*కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ|*
*దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాస్సంతు నిర్భయాః||*
*అపుత్తాః పుత్త్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణః|*
*అధనాః సధనాస్సంతు జీవంతు శరదాం శతమ్||*
*చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్|*
*ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనమ్||*
*శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా|*
*స యాతి బ్రహ్మణః స్థానం, బ్రహ్మణా పూజ్యతే సదా||*
*రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే|* *రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః||*
*యన్మంగళం సహస్రాక్షే సర్వదేవనమస్కృతే |*
*వృత్రనాశే సమభవత్తత్తే భవతు మంగళమ్||*
*యన్మంగళం సుపర్ణస్య వినతాకల్పయ త్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళమ్||*
*మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే |*
*చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్ ||*
*అమృతోత్పాదనే దైత్యాన్*
*ఘ్నుతో వజ్రధరస్య యత్ అదితి ర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళమ్ ||*
*త్రీన్ విక్రమాన్ ప్రక్రమతో విష్నో రమితతేజసః | యదాసీ న్మంగళం రామ తత్తే భవతు మంగళమ్*
*ఋతవ స్సగరా ద్వీపా వేదా లోకా దిశ్చ తే | మంగళాని మహాబాహో దిశస్తుతవ సర్వదా ||*
*కాయేనవాచా మనసేంద్రియైర్వా*
*బుద్ద్యాత్మనావా ప్రకృతేః స్వభావత్|*
*కరోమి యద్యత్ సకలం పరస్మై*
*నారాయణేతి సమర్పయామి||*
????????????????????????????????????????????????
*శ్రీరామ జయరామ జయజయరామ* ????
*శ్రీరామ జయరామ జయజయరామ* ????
*శ్రీరామ జయరామ జయజయరామ* ????
????????????????????????????????????????????????
????????????????????????????????????????????????
*బంటు రీతి కొలువు (కీర్తన)*
*శ్రీ త్యాగరాజ స్వామి రచించిన కీర్తన*
పల్లవి
బంటు రీతి కొలువు ఈయవయ్య రామా | (బంటు)
అనుపల్లవి
తుంట వింటి వాని మొదలైన మదా- |
దుల బట్టి నేల గూల జేయు నిజ || (బంటు)
చరణం
రోమాంచ మనే ఘన కంచుకము |
రామ భక్తుడను ముద్ర బిళ్ళయు ||
రామ నామ మనే వర ఖడ్గ మివి |
రాజిల్లు నయ్య త్యాగరాజుని కే || (బంటు)
????????????????????????????????????????????????






