రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శనివారం వేకువజామున ముక్కోటి ఏకాదశి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్చకుడు వేణుగోపాల చారి భక్తులకు పాశ్రమం తోపాటు దైవ జ్ఞాన సంబంధ విషయాలను తెలిపారు మహిళలు మంగళహారతులతో స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందించారు.
ఎల్లారెడ్డిపేట వేణుగోపాల స్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకుడు నవీన్ చారి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్లు సూర నరసయ్య, జితేందర్,సర్పంచ్ నిమ్మ లక్ష్మి, మాజీ సర్పంచ్ దొమ్మాటి నరసయ్య, నాయకులు లింగం గౌడ్,సద్ది లక్ష్మారెడ్డి,చెన్ని బాబు, గంట బుచ్చగౌడ్, మోతె లక్ష్మారెడ్డి, బొమ్మెడి భాస్కర్ పాల్గొన్నారు.
