ప్రాంతీయం

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ జయంతి…

160 Views
ముస్తాబాద్, ఏప్రిల్ 14 బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్134వ జయంతి సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో అత్యంత శోభానంగా గద్దెను పూలతో అలంకరించి అంబేద్కర్ విగ్రహాలకు ముందుగా గజమాల, పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి సురేష్ తో పాటు తదితర పార్టీలు నాయకులు, పార్టీలకు అతీతంగా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి అంబేద్కర్ సంఘాల నాయకులు, పలువురు ముఖ్య అతిథులు మాట్లాడుతూ మన భారత రాజ్యాంగానికి ప్రధాన రూపశిల్పి స్వతంత్య్ర భారతదేశంలో మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, దేశంలోనే ప్రముఖ న్యాయనిపుణుడిగా ఆర్థికవేత్తగా సంఘ సంస్కర్తగా అంబేడ్కర్ ఎంతో ప్రసిద్ధిగాంచారని గుర్తుచేశారు. అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తి అని పేద బడుగు బలహీనులకు రాజ్యాంగ పరంగా అనేకచట్టాలు తెచ్చి వారి అభ్యున్నతికి కృషి చేశారన్నారు. సామాజిక న్యాయం కోసం జరిగే సమరశీల పోరాటాలపై చెరగని ముద్రవేసిన మహానీయుని బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఆశయాలు నేటి యువతకు ఆదర్శమని తెలియచేసారు. ఈ కార్యక్రమంలోతదితర మాజీలు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, దళిత నాయకులు, అంబెడ్కర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7