Breaking News

అయ్యో బాబోయ్ కుక్కలు…!

313 Views

ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాలలో వీధి కుక్కల బెడద తీవ్ర మయింది.చిన్నా పెద్ద తేడా లేకుండా అందరిపై వీధి కుక్కలు దాడి చేస్తూ కాటు వేస్తుండటం తో మండలంలోని పలు గ్రామాలకు చెందిన చిన్నారులు,వ్యక్తులు కుక్క కాటుకు గురవుతూ ఆసుపత్రుల్లో చికిస్చ తీసుకుంటున్నారు.
మండలంలోని బొప్పాపూర్ గొల్లపల్లి గ్రామాలలో వీధి కుక్కలు విపరీతంగా పెరిగి పోయి రహదారులపై పదుల సంఖ్యలో విచ్చల విడిగా సంచరిస్తున్నాయి.గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతూ రహదారి వెంట వెళుతున్న వారిపై దాడి చేసి గాయపరుస్తున్నాయి.
ఇటీవల గ్రామానికి చెందిన బిజెపి నాయకుడు భాస్కర్ పై కుక్కలు దాడి చేసి గాయపర్చాయి .బొప్పా పూర్ గ్రామానికి చెందిన నీరటి విష్ణు ప్రసాద్ ఎల్లారెడ్డి పేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు.బుధవారం రోజు వారిగా విధులకు వెళుతున్న సమయంలో ఒక్క సారిగా కుక్కలు అతని బైక్ కు అడ్డు రావడంతో అతడు బైక్ పైనుండి కింద పడి గాయపడ్డాడు.
అలాగే ఇటీవల నారాయణ పూర్,ఎల్లారెడ్డిపేట గ్రామాలకు చెందిన చిన్నారులను,మహిళలను
కుక్కలు దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డ సంఘటనలు ఉన్నాయి.
గ్రామాలలో తీవ్రమైన కుక్కల బెడదను నివారించి ప్రజలను కుక్కల బారి నుండి కాపాడాలని పంచాయతీ కార్యదర్శులను ప్రజలు కోరుతున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *