రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేత జోలి శాఖ, కేటీఆర్ చేనేత కార్మికుల నేరుగా వారి అకౌంట్లో రెండు వేల రూపాయలు మరియు అనుబంధ కార్మికులకు వెయ్యి రూపాయలు చొప్పున 3000 రూపాయలు ప్రతి నెల తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష సహాయాన్ని అందించడం చారిత్రాత్మక నిర్ణయమని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు, దేశంలో ఎక్కడా లేనివిధంగా చేనేత కార్మికుల కోసం ఐదు లక్షల బీమా సౌకర్యం , మరియు 25 వేల హెల్త్ ఇన్సూరెన్స్ ను , నూతనంగా ప్రభుత్వం ప్రవేశపెట్టడం కార్మికులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు,
ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ఈ పథకాలు ప్రవేశపెట్టినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, హ్యాండ్లూమ్ టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ ,మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాజీ ఎంపీ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, పవర్ లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు




