Breaking News

త్రిబుల్ ఐటీ కి ఎంపిక అయింది..

174 Views

జులై 3, 24/7 తెలుగు న్యూస్:వర్గల్ మండలం మైలారం గ్రామానికి చెందిన కుమ్మరి కనకయ్య సరిత దంపతుల కుమార్తె కుమ్మరి నిత్యశ్రీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ పదవ తరగతిలో 9.8 జిపిఎస్ సాధించింది.

ఉన్నత చదువులు చదవాలని లక్ష్యంతో బాసరలోని త్రిబుల్ ఐటీ లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోగా నేడు వెలువరించిన ఫలితాలలో త్రిబుల్ ఐటీ కి ఎంపికయింది. ఈ విషయంలో విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించి సన్మానించారు. తమ కుమార్తెకు త్రిబుల్ ఐటీలో సీటు రావడంతో తల్లిదండ్రులు మిఠాయిలు తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు. ఉన్నత చదువులు చదవాలని లక్ష్యంగా ఉన్న తమ కుమార్తెకు సీటు రావడం ఆనందంగా ఉందని తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found