
సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 25(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండల కేంద్రంలో శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో ఆర్యవైశ్య సంఘం ఏర్పాటుచేసిన గణపతిని రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పూజారులు ప్రతాపరెడ్డికి శాలువాతో సత్కరించి గణపతి ప్రసాదం అందజేశారు.
అంతకుముందు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్, స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్,ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్, సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ యువజన విభాగ అధ్యక్షులు రవి కంటి చంద్రశేఖర్, జగదేవపూర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొండల్, మండల కో ఆప్షన్ ఎక్బల్,
గజ్వేల్ మార్కెట్ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, ఆర్యవైశ్య సంఘం నాయకులు బుద్ధ నాగరాజు, సత్యం, బుద్ధ సత్యపాల్, అమరరామ్, వెంకటయ్య,లక్ష్మీనరసయ్య,జగదయ్య, శ్రీనివాస్, వెంకటేష్ ,విలాస్ తదితరులు పాల్గొన్నారు.




