ప్రాంతీయం

భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

39 Views

ముస్తాబాద్, ఏప్రిల్ 6 (24/7న్యూస్ ప్రతినిధి):  భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్  ఆధ్వర్యంలో స్థానిక మండల కేంద్రం వివేకానంద విగ్రహంవద్ద జెండా ఆవిష్కరణ ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం బిజెపి మండల అధ్యక్షులు మేర్గు అంజయ్య గౌడ్ మాట్లాడుతూ జన సంగ్ నుంచి 1980, ఏప్రిల్ 6న శ్యాంప్రసాద్ ముఖర్జీ, దిందయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారి వాజ్‌పేయి, ఎల్కే అద్వాని ఆధ్వర్యంలో బీజేపీగా అవతరించిందన్నారు. అప్పుడు ఇద్దరు ఎంపీలతో మొదలైన బీజేపీ వరుసగా మూడవసారి అధికారంలోకి రావడం జరిగిందనీ, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. జిల్లా అధికార ప్రతినిధి సంతోష్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు బాధ నరేష్, సౌళ్ళ క్రాంతి ,ఆవిర్భావ దినోత్సవం కమిటీ మండల కన్వీనర్ శ్రీనివాసరావు, పాక్స్ డైరెక్టర్ ఏళ్ల గిరిధర్ రెడ్డి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు చిగురు వెంకన్న, మండల ఉపాధ్యక్షుడు ఎదునూరు గోపి, మీసా శంకర్, కొల కృష్ణ, కమిటీకారి పద్మ, శ్రావణ్, గణేష్, భగత్ తదితరులు పాల్గోన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్