ప్రాంతీయం

తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులు…

98 Views

ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 22, దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని చివరి రోజు గురువారం అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం అమరవీరుల చేసిన త్యాగాలు మరువలేనివని ఎంపీపీ జనగామ శరత్ రావు అన్నారు. అందులో భాగంగా మండల అభివృద్ధి కార్యాలయంలో అమరవీరుల ఫ్లెక్సీ ఫోటోలో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద మండల అభివృద్ధి అధికారి రమాదేవితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాత్రికేయులు కలిసి ఘనంగా నివాళులర్పించి వారి సేవలను స్మరించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈకార్యక్రమంలో సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, ఎంపిటిసిలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *