సీఎం సహాయనిధి చెక్కులు మరియు కళ్యాణ లక్ష్మి& షాది ముబారక్ చెక్కులు పంపిణీ
మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా సీఎం సహాయనిధి చెక్కులు మరియు కళ్యాణ లక్ష్మి& షాది ముబారక్ చెక్కులు పంపిణీ.
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన 40 మంది లబ్దిదారులకు సీఎం సహాయనిధి విలువైన (1097500 )/- రూపాయల చెక్కులను మరియు మంచిర్యాల, హజీపూర్ మండలానికి చెందిన 138 మంది లబ్ధిదారులకు విలువైన (13816008) /- రూపాయల కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సంబంధిత అధికారులు.సీఎం సహాయనిధి ద్వారా ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలబడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ప్రజల కష్టసుఖలు తెలుసుకొని, సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, దేవాపూర్ అదాని సిమెంట్ కంపెనీ యూనియన్ అధ్యక్షులు కొక్కిరాల సత్య పాల్ రావు, సంబంధిత అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,లబ్ధిదారులు పాల్గొన్నారు..





