ప్రాంతీయం

ప్రతి టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ 10 సీఎం పి ఎఫ్ నిధికి జమ చేయాలి

28 Views

మంచిర్యాల జిల్లా.

ప్రతి టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ 10/- సీఎం పి ఎఫ్ నిధికి జమ చేయాలని నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం.
తేదీ..4/4/2025 శుక్రవారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలో సింగరేణి విశ్రాంతి ఉద్యోగుల సంఘం సమావేశమై ఇటీవల కోల్ కత్తా లో జరిగిన సీఎం పిఎఫ్ ట్రస్టు బోర్డు సమావేశంలో కోల్ ఇండియా బొగ్గు గనులు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ ఫండ్ స్థిరత్వం కోసం ఒక టన్ను బొగ్గు ఉత్పత్తికి Rs 10/- సీ ఎం పిఎఫ్ నిధికి కేటాయించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం సమావేశం హర్షం వ్యక్తం చేసినది అదేవిధంగా బొగ్గు పెన్షన్ దారుల పెన్షన్ పండును బలోపేతం చేయడానికి టన్నుకు రూపాయలు 10/- అదనంగా కేటాయించాలని నిర్ణయం తీసుకున్న కోల్ ఇండియా యజమాన్యానికి మరియు సీ ఎం పిఎఫ్ ట్రస్ట్ బోర్డ్ సభ్యులకు సింగరేణి విశ్రాంత కార్మిక సంఘం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నదని ఈ సమావేశంలో పేర్కొన్నారు.

ప్రస్తుతం ఒక టన్ను కు Rs 10/- లకు కేటాయిస్తుండగా కోల్ ఇండియా నిర్ణయంలో 20 రూపాయలకు పెరుగనుందని తెలియజేశారు. బొగ్గు పెన్షన్ ఫండ్ లోటు వల్ల కనీస పెన్షన్ పెరుగుడు దేవుడేరుగు అని ప్రస్తుతం వచ్చే పెన్షన్ ప్రతినెల వస్తదో రాదో అనే డోలాయంలో ఉన్న సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు టన్ను బొగ్గుకు 10 రూపాయలు పెంచి పెన్షన్ ప్రతి నెల తప్పక వస్తది అనే భరోసా కల్పించి నిర్ణయం తీసుకున్న కోల్ ఇండియా యజమాన్యానికి మరోసారి విశ్రాంత కార్మికులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

ఈ సమావేశంలో అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, ఉపాధ్యక్షులు బూర్ల జ్ఞాని,కార్యదర్శి పి. రాజిరెడ్డి ఆర్గనైజింగ్ కార్యదర్శి చిప్పరామస్వామి, నాయకులు,ఏ.రాజేష్, పర్వతాలు యాదవ్,కే. లక్ష్మణ్ బి.లక్ష్మీనారాయణ గౌడ్,ఏ.చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి విశ్రాంతి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని  నినాదాలు చేసినారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్