రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఎల్లారెడ్డి పేట వయో వృద్ధుల డే కేర్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డే కేర్ సెంటర్ లో ఆశ్రయం ఉంటున్న వారికి అందుతున్న సేవలను వయో వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? ప్రతి శుక్రవారం ఆరోగ్య సమస్యలకు వైద్య సహాయం అందుతుందా? ఫిజియోథెరపీ సేవలు అందుతున్నాయా అంటూ… టివి పని చేస్తుందా అంటూ ? వృద్ధులను ప్రశ్నించారు.
డే కేర్ సెంటర్ తమకు అన్ని విధాలుగా సహకారం అందుతుందన్నారు. సిబ్బంది ఏ లోటు లేకుండా బాగా చూసుకుంటున్నారనీ తెలిపారు.డే కేర్ సెంటర్ లో అక్కడక్కడ ఉన్న లీకేజీల ను అరెస్ట్ చేయాలన్నారు. వాష్ బేసిన్ లో ఉన్న
చిన్న చిన్న మరమ్మతులతో వినియోగంలో లేని వాటికీ వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. *”చిరంజీవి గారు … టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీజ్”* అంటూ కలెక్టర్ ఏల్లారెడ్డిపేట ఎంపిడివో కు సూచించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీఓ ఆనంద్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మిరాజం, నాయబ్ తహశీల్దార్ ఎ జయంత్ కుమార్ లు ఉన్నారు.
