ప్రాంతీయం

పోలీస్ కిష్టయ్య వర్ధంతి అధికారికంగా నిర్వహించాలి…

101 Views
  ముస్తాబాద్ డిసెంబర్ 01, మలిదశ తెలంగాణ అమరుడు పోలీసు కిష్టయ్య ముదిరాజ్ 13వ వర్ధంతి వేడుకలు సంస్కరణ సభ పోస్టర్లు ఆవిష్కరించారు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కిష్టయ్య వర్ధంతి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ముదిరాజ్ సంఘం సభ్యులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజ్ మండల శాఖ ఆధ్వర్యంలో మలిదశ తెలంగాణ అమరుడు పోలీసు కిష్టయ్య ముదిరాజ్ 13వ వర్ధంతి పురస్కరించుకొని మాత్మ జ్యోతిబాపూలే విగ్రహం వద్ద పోలీస్ కిష్టయ్య వర్ధంతికి ముఖ్యఅతిథిగా ఎస్సై వెంకటేశ్వర్లు విచ్చేసి ముదిరాజ్ మండల అధ్యక్షులు గోపాల్ ఉపాధ్యక్షులు గొడుగు శంకర్ ముదిరాజ్ కార్యవర్గ సభ్యులు కుల బంధువులు కలిసి పోలీస్ కృష్ణయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఐదు నిమిషాలు మౌనం పాటించి తెలంగాణ మలిదశా ఉద్యమం ప్రాణాలను అర్పించిన కిష్టయ్యకు జోహార్ జోహార్ నినాదాలు చేశారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం కొరకు ఎంతోమంది ప్రాణాలకు తెగించి రాష్ట్రం కోసం పోరాడుతున్న తరుణంలో తెలంగాణ ప్రాణాల ద్వారా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి రాష్ట్రం వస్తదని తన పోలీస్ వృత్తిలో ఉండి సర్వీసు రివాల్వర్ కాల్చుకొని మలిదశ ఉద్యమం తొలి ఆమరుడు పోలీస్ కిష్టయ్య అని ఆయనకు నివాళులు అర్పించారు. అలాగే ముదిరాజ్ మండల ఉప అధ్యక్షులు గొడుగు శంకర్ మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమం ఉద్యమంలో గౌరవపదమైన వృత్తిలో ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను లెక్కచేయకుండా సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని రాష్ట్రం కోసం తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య అని అలాగే రాష్ట్ర ప్రభుత్వం వర్ధంతిని జయంతి లను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పోలీస్ కిష్టయ్య విగ్రహం విగ్రహాన్ని ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయాలని ముదిరాజ్ సంఘం నాయకులు కోరారు. ఈకార్యక్రమంలో అధ్యక్షులు పిట్ల రాంగోపాల్. ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు గొడుగు శంకర్, ఏఎంసి డైరెక్టర్ చిగురు నరేష్, వడ్లకొండ చంద్రం, కంచం నర్సింలు, గిసశంకర్, జ్వాల బిక్షపతి, రంజాన్ వెంకటేష్, రంజాన్ రమేష్, ముదిరాజ్ కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్