ముస్తాబాద్, మార్చి 10 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండలంలోని ప్రైవేట్ పాఠశాలలలోని యాజమాన్యాలకు పాఠశాల యొక్క బస్సు డ్రైవర్ సమస్యల పరిష్కారం కోసం తమ యొక్క ప్రతి స్కూల్ బస్సు డ్రైవర్లకు ప్రతినెల నెల కనీస వేతనం 16 వేల నుండి 18 వేల వరకు యాజమాన్యం చెల్లించాలని కోరారు. ఈ సందర్భంగా డ్రైవర్లు తెలుపుతూ ప్రతి నెల రెండు సెలవులతోపాటు అత్యవసర పని ఉన్న రోజు విధులలోకి హాజరు కాకుండ వేతనం చెల్లించడంతోపాటు ప్రతి డ్రైవర్ పిల్లలకు ఒకరికి ఉచిత విద్య, పీఎఫ్ ఇవ్వాలని డ్రైవర్లకు ప్రతి సంవత్సరము రెండు జతల యూనిఫాంలు, అలాగే వేసవికాలం సెలవులలో సగం వేతనం చెల్లించాలి. దసరా దీపావళికి బోనస్ అందించాలి, సంవత్సరానికి ఒకసారి వేతనం10 శాతం పెంచాలి, తదితర మీటింగులకు పంపించినట్లయితే డ్రైవర్లకు1000 నుండి1500 వరకు భత్తా యాజమాన్యమే చెల్లించాలి. ఈ సమస్యలను ముస్తాబాద్ లోని స్కూల్ బస్ డ్రైవర్ లు అందరి నిర్ణయంతో తీర్మానం చేశామని పేర్కొన్నారు. ఈ సమస్యలన్నీ 2025 మార్చిలో సమస్యలు పరిష్కరించాలని యజమాన్యాలను కోరారు.
