మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లాలో 6,200 కోర్టు కేసులు పరిష్కారం.
సైబర్ క్రైమ్ కేసులో 1.20 లక్షలు మరియు బ్యాంకు కేసులలో 28 లక్షల రూపాయల రికవరీ అయ్యాయి.
రాజీమార్గమే రాజమార్గం – బోయ శ్రీనివాసులు ప్రధాన న్యాయమూర్తి మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లా లోని న్యాయస్థానంలో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు మాట్లాడుతూ రాజీమార్గమే రాజమార్గమని లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తులు సూచించారు. ఈ లోక్ అదాలత్ ద్వారా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 6,200 కేసులు పరిష్కారమయ్యాయి. సైబర్ క్రైమ్ కేసుల్లో 1.20 లక్షలు మరియు బ్యాంకు కేసులలో 28 లక్షలు రికవరీ అయినయని తెలియజేశారు.
