మంచిర్యాల జిల్లా.
మంచిర్యాలలో ఐబీ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ధర్నా చేశారు.
ప్రజాధనాన్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దుర్వినియోగం చేస్తున్నారని టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. సోమవారం మంచిర్యాల ఐబి చౌరస్తాలో పార్టీ శ్రేణలతో కలిసి ధర్నా చేశారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలను మరియు చేసిన పనులను కూల్చివేయడంపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మండిపడ్డారు. అంతర్గాం వంతెన టెండర్ రద్దు అనాలోచిత నిర్ణయం అన్నారు. కాగా ఘటన స్థలానికి పోలీసులు రావడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
