ముస్తాబాద్, అక్టోబర్ 2 (24/7న్యూస్ ప్రతినిధి): మకర సంక్రాంతి రోజున కేరళలోని శబరిమల పొన్నంభాల ఓ నక్షత్రం కనిపిస్తుంది. అదే మకర జ్యోతి అంటారు. మకర జ్యోతి అనేది ఏటా జనవరి 14న మకర సంక్రాంతి రోజున సాయంత్రం ఆకాశంలో కనిపించే నక్షత్రం. అదే మాదిరిగా ఆవునూరు చెరువు కట్టపై చూడగానే దర్శనమిస్తుంది అంటే పప్పులో కాలేసినట్టే.. విషయానికొస్తే అవునూరు గ్రామం ఆడపడుచులకు బతుకమ్మ సంబరాలు జరుపుకొని గంగమ్మ ఒడికి చేర్చడానికి కారు చీకటి సేదు అనుభవం దర్శనమిచ్ఛింది. గత ప్రభుత్వం బంగారు తెలంగాణ అనుకొస్తే ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు కష్టాలు తప్పడంలేదు అన్నారు. ఆవునూర్ మానేరు వాగువద్ద కనీసం లైట్లు ఎర్పాటు చేయలేదు రోడ్డు అస్తవ్యస్తంగా ఉండడంతో మహిళలకు ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. అతి కష్టం మీద మహిళలు బతుకమ్మలను గంగమ్మ ఒడికి చేరడానికి ద్విచక్ర వాహనాల వెలుతురు సహాయంతో పూర్తి చేశారన్నారు. రేపటి లోగా త్వరితగతిన గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ స్పందించిన లైట్లు యధావిధిగా మహిళలకు ఇబ్బందులు ఎదురు కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బిజెపి ప్రధాన కార్యదర్శి సౌల క్రాంతి కుమార్, మంత్రి బాబు, కటకం పెద్ద మహేష్, ప్రవీణ్, గణేష్, అభిలాష్ తాము కోరుతున్నాం అన్నారు. లేనియెడల ప్రధాన రహదారిపై బతుకమ్మలు అడ్డుగా పెట్టి మహిళలలతో పాటు దీక్ష చేపడతామన్నారు.
