ప్రాంతీయం

ఆడపడుచులకు అండగా సీఎం కేసీఆర్

130 Views

దౌల్తాబాద్: సీఎం కేసీఆర్ ఆడపడుచులకు అండగా నిలుస్తున్నాడని ఎంపీపీ గంగాధరి సంధ్య రవీందర్, జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ లు అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో గ్రామపంచాయతీ వద్ద మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మీ తో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు బతుకమ్మ చీరలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. బతుకమ్మ సంబరాల సమయంలో తన తోబుట్టులకు సారే ఇచ్చినట్లుగా చీరలను ఇస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేష్ కుమార్, ఎంపీఓ సయ్యద్ గపూర్ ఖాద్రీ, సర్పంచ్ యాదగిరి, ఎంపీటీసీ ఆది వనిత వేణుగోపాల్, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, వార్డు సభ్యులు నరేష్, లక్ష్మీ, బాలవ్వ, నాయకులు ఇప్ప దయాకర్, వివోఏలు రజిత, యాదగిరి తదితరులు పాల్గొన్నారు…

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *