నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంతోష్ గౌడ్ మినిస్టర్ ఛాంబర్ కలిశారు.
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుచ్చిలింగు సంతోష్ గౌడ్ శుక్రవారం హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసి వినతిని సమర్పించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ఎల్లారెడ్డిపేట మండలంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.. ప్రైవేటు రంగంలోని కంపెనీలను తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వినతిపత్రంలో కోరారు..
