ముస్తాబాద్, మార్చి 6 (24/7న్యూస్ ప్రతినిధి): మండల పరిధిలోని చికోడు గ్రామంలోని ఆరోగ్య ఉపకెంద్రం ఆవరణలో మండల వైద్యాధి కారిని డాక్టర్ గీతాంజలి ఆధ్వర్యంలో క్షయ వ్యాధి గుర్తింపు శిబిరం నిర్వహించారు. సుమారుగా 16 మంది అనుమానితుల నుండి తేమడ సేకరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లాబ్ కి పంపించారు.. ఈ సందర్భంగా డాక్టర్ గీతాంజలి మాట్లాడుతూ క్షయ వ్యాధి అనేది అంటువ్యాధి అని వ్యాధి ఉన్నవారి నుండి మరొరికి సోకే అవకాశం ఉంటుందని అలాంటి అనుమానితుల నుండి మరొకరికి సంక్రమించకుండ ఫేస్ మాస్క్ లు ధరించాలని సూచనలు చేశారు. వీరు పౌష్టిక ఆహారం తీసుకుంటూ వ్యాధి నిరోధక శక్తి పెంచుకుంటే వ్యాధిని దూరం చేయవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబి నోడల్ సూపర్ వైజర్ లక్ష్మి ప్రసాద్, మరియు ఎమ్ ఎల్ హెచ్ పి ఉదయి, మరియు ఆశాలు పాల్గొన్నారు
