రామగుండం పోలీస్ కమీషనరేట్.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష కేంద్రాలను సందర్శించిన ఏఆర్ డీసీపీ భాస్కర్ ఐపిఎస్.
మంచిర్యాల పట్టణంలో ఉన్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షా కేంద్రాలు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లు, ఇతర పరీక్షా కేంద్రాలను సందర్శించిన మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్., ఈ సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న అధికారులకు సిబ్బందికి పటిష్టమైన బందోబస్తు గురించి తగు సూచనలు సలహాలు చేశారు. పేపర్ ఎస్కార్ట్ ఉన్న సిబ్బంది క్వశ్చన్ పేపర్ తీసుకొని వచ్చేటప్పుడు మరియు ఆన్సర్ పేపర్లు తీసుకొని వెళ్లేటప్పుడు ఎస్కార్ట్ ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని సూచించారు. మరియు ఎగ్జామ్ సెంటర్ చుట్టూ పరిసర ప్రాంతాలను కూడా గమనిస్తూ ఉండాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమల్లో ఉందని తెలిపారు. పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం మంచిర్యాల జోన్ పరధిలో ఉన్న కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
డీసీపీ వెంట మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, ఉన్నారు.
