బీజేపీ విజయం కాంగ్రెస్ పార్టీ అహంకారానికి చెంపపెట్టు – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్.
ఉమ్మడి కరీంనగర్- మెదక్ – ఆదిలాబాద్ – నిజామాబాద్ జిల్లా పట్టభద్రుల మరియు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో ఈరోజు మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తాలో బీజేపీ మంచిర్యాల పట్టణ అధ్యక్షులు అమిరిశెట్టి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టి గెలుపు సంబరాలు చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ గత 14 నెలల నుండి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో పేద ప్రజలన్న చేస్తున్న మోసానికి ప్రజలు కాంగ్రెస్ పార్టీ తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. మంచిర్యాల లో పట్టభద్రులను మరియు ఉపాధ్యాయుల పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని బెదిరింపులకు గురి చేసినా, పాఠశాలలు బంద్ చేసి ముఖ్య మంత్రి సభకు రావాలని హుకుం జారీ చేసిన శివరాత్రి రోజున సమావేశాలు పెట్టి ఇబ్బందులకు గురి చేసిన ఉపాధ్యాయలు భయపడకుండా ఈరోజున కాంగ్రెస్ పార్టీకి ఓటు అనే ఆయుధంతో తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. అదే విధంగా పోలింగ్ రోజున నస్పూర్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతామనే భయంతో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పై మరియు బీజేపీ కార్యకర్తల పై పోలీసుల సమక్షంలో దాడులకు పాల్పడి మళ్లీ బీజేపీ నాయకుల పై నాలుగు నాన్ బెయిలబుల్ కేసులు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాక్షస ఆనందం పొందుతున్నారు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కి ఈ ఓటమి చెంప పెట్టు లాంటిదని ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషి చేయాలని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థుల విజయం తద్యం అని అదే విధంగా రానున్న శాసన సభ ఎన్నికల్లో కూడా జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 2028 లో రాష్ట్రంలో కూడా వచ్చేది బీజేపీ ప్రభుత్వం మాత్రమే అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముల్కాల్ల మల్లారెడ్డి, మున్నా రాజా సిసోడియా, పెద్దపల్లి పురుషోత్తం, తుల ఆంజనేయులు, మల్యాల శ్రీనివాస్, ఆకుల అశోక్ వర్ధన్, బోయిని గారు కృష్ణ, రాకేష్ రెన్వ, రెడ్డిమల్ల అశోక్, జోగుల శ్రీదేవి, బండి మల్లికార్జున్, పచ్చ స్వప్న రాణి, కొండవీటి తిరుమల, గాజుల ప్రభాకర్, బూర్ల చిరంజీవి, కర్ర లచ్చన్న, దేవరకొండ వెంకన్న, అనిల్, భరత్, మేన సూరి, రాజబాబు మరియు తదితరులు పాల్గొన్నారు.
