రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళ వారం రోజు ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించి,విధుల్లో భాగంగా పోలీసులు మెయింటేన్ చేసే రిసెప్షన్,జీడీ ఎంట్రీ తదితర రికార్డును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
ఎన్నికల దృష్ట్యా విలేజ్ పోలీస్ అధికారులకు తమకి కేటాయించిన గ్రామాల యెక్క పూర్తి సమాచారం తెలిసి ఉండాలని,పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాత నేరస్తులు, సస్పెక్ట్ లు, రౌడీ షీటర్లపై నిఘాను ఉంచాలన్నారు. బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ సిబ్బంది నిరంతరం 24×7 గస్తీ నిర్వహిస్తూ,ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు.
