*యాసంగిలో వరి దుక్కిలో జింకు తప్పనిసరిగా వేయాలి
.*
దౌల్తాబాద్; యాసంగిలో వరి దుక్కిలో జింకు తప్పనిసరిగా వేయాలని మండల వ్యవసాయ అధికారి గోవిందరాజు అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగిలో అధిక చలి నుండి పంట రక్షించుకోవడానికి జింక్ సల్ఫేట్ తప్పనిసరిగా వాడాలి. జింకు లోపం వలన మొక్కలలో రసాయన చర్యలు తగ్గి పంట యొక్క పెరుగుదల పిలకల సంఖ్య తగ్గి పంట దిగుబడి పై తీవ్ర ప్రభావం చూపుతుంది. జింకులోపు ఉన్నప్పుడు నత్రజని ఎరువులను వాడిన గాని పైరు పచ్చబడదన్నారు. జింకులోపు నివారణకు వరి వేసే ముందు ఆఖరి దుక్కిలో 20 కిలోల జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. పంటవేసిన తర్వాత జింక్ లోపం కనిపిస్తే నివారణకు రెండు గ్రాముల జింకు సల్ఫేట్ ద్రవణాన్ని లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. జింకును భాస్వరం ఎరువులతో కలిపి వేయకూడదు రసాయనక చర్యలు జరుగును. కావున జింకు మరియు భాస్వరం ఎరువులు వేయడానికి కనీసం ఐదు రోజుల వ్యవధిని ఉంచుకోవాలి అన్నారు. రైతులు తప్పకుండా పాటిస్తే దిగుబడి అధికంగా వస్తుందని అన్నారు.




