ముస్తాబాద్, ఫిబ్రవరి 27 (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ గ్రామంలోని వట్టెల నర్సయ్యకు చెందిన తన వ్యవసాయ బావిలో గత నాలుగైదు రోజుల నుండి ముస్తాబాద్ గ్రామానికి చెందిన వడ్డెర రాజులు క్రేన్ సహాయంతో మట్టిని తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ఒల్లెపు దేవేందర్ తండ్రి రాములు సుమారుగా 35. సం అతను నీళ్లలోనే ఉండి విద్యుత్ మోటార్ సహాయంతో నీళ్లను బయట పంపిస్తామని మోటార్ యొక్క స్విచ్ ఆన్ చేయగా మోటర్ బాడీ తో సహా విద్యుత్ సప్లై కావడంతో షాక్ తగిలి కింద పడిపోయాడన్నారు. హుటావుటిన హాస్పిటల్ కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు స్థానిక డాక్టర్ నిర్ధారించారని స్థానికులు తెలిపారు. దేవేందర్ కు భార్య ఇద్దరు కొడుకులు ఉన్నారు. హాస్పిటల్ ఆవరణలో ఉన్న మృతదేహం వద్దకి పోలీసులు చేరుకున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
