ప్రాంతీయం

ప్రజలను మోసం చేస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియా

31 Views

ఫామ్ ల్యాండ్‌ ముసుగులో అక్రమ వెంచర్లు

ప్రజలను మోసం చేస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియా

మంచిర్యాల జిల్లా, ఫిబ్రవరి 27

మంచిర్యాల జిల్లా నగర పరిసరాల్లో ఇతరపట్టణ మరియు మండల పరిసర ప్రాంతాలలో ఫామ్ ల్యాండ్ పేరిట అక్రమ వెంచర్లు విస్తరిస్తున్నారు.డీటీసీపీ (డీటీసీపీ ) అనుమతులు లేకుండా వ్యవసాయ భూములను ప్లాట్లుగా విక్రయించి ప్రజలను మోసం చేసే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిబంధనలను ధిక్కరిస్తూ, అధికారులను తప్పుదోవ పట్టిస్తూ, ప్రజలను మభ్యపెట్టి కేటుగాళ్లు భారీగా లాభాలను పొందుతున్నారు.

ఫామ్ ల్యాండ్ పేరుతో అక్రమ వ్యాపారంప్రస్తుతం చాలా మంది రైతులు తమ భూములను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న వేళ, ఫామ్ ల్యాండ్ పేరుతో కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నాయి. ఈ భూములు రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూములుగానే ఉండటంతో ఇక్కడ ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వ అనుమతులు రావు. అయినప్పటికీ, కొన్ని సంస్థలు “ఇది పూర్తిగా లీగల్” అని ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు.

అక్రమ వెంచర్లకు డీటీసీపీ అనుమతుల్లేవు
నియమితంగా అభివృద్ధి చెందే వెంచర్లకు (డీటీసీపీ )(డైరెక్టరేట్, ఆఫ్, టౌన్, కంట్రీ   ప్లానింగ్ ) అనుమతులు అవసరం. కానీ అక్రమ వెంచర్లకు ఈ అనుమతులు లేవు.

ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించి అభివృద్ధి చేయబడతాయి.
రోడ్లు, డ్రైనేజ్, మౌలిక సదుపాయాలు లేకుండా ప్రజలను మోసం చేస్తాయి.భవిష్యత్తులో నివాస నిర్మాణానికి అనుమతులు రావటం కష్టమవుతుంది.ఈ అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు భవిష్యత్తులో నిర్మాణ అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది.

ఇటీవల కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకుల అండదండలతో ఇటు అధికారులను అటు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు.
అక్రమ వెంచర్లను లీగల్ అని చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రభుత్వ భూములను కూడా సర్వే నంబర్లను మార్చి విక్రయించే కుట్రలు జరుగుతున్నాయి.అధికారులకు లక్షల రూపాయలను ముట్టజెప్పి అక్రమాన్ని సక్రమంగా చేసి అప్రతిష్టలేకుండా నిర్వహించేందుకు రియల్ ఎస్టేట్ మాఫియా ప్రయత్నిస్తోంది.

ప్రజలకు హెచ్చరిక.
ప్రభుత్వ అనుమతులు లేని ప్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఎక్కువ. కనుక, ప్లాట్ కొనేముందు (డీటీసీపీ ), రెవెన్యూ రికార్డులను పరిశీలించి, నిజమైన స్థితిగతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.అక్రమ వెంచర్లపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రజలను మోసం చేస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్