ముస్తాబాద్, జనవరి 26 (24/7న్యూస్ ప్రతినిధి): బిజెపి ముస్తాబాద్ మండలశాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడతానన్న 6గ్యారంటీలను అమలు పరచడంలో విఫలమైందని స్థానిక తాహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించి వినతి పత్రం సమర్పించారు. ప్రజలకు అనేక హామీలు కురిపించి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 6గ్యారంటీలను అమలు చేయడంలో విఫలం ఎందుకయిందని బిజెపి నాయకులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చాలని లేనిపక్షంలో జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు సౌర్ల క్రాంతి, బాద నరేష్, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, శ్రీనివాసరావు, వరి వెంకటేష్, జిల్లెల్ల మల్లేశం, కసోడి రమేష్, తిరుపతి, బాల్ రెడ్డి, కోల కృష్ణ గౌడ్, నవీన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
