ముస్తాబాద్, మే 5 (24/7న్యూస్ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ గెలిపేలక్ష్యంగా పార్టీ శ్రేణులు చిత్తశుద్ధితో పనిచేస్తూ కేంద్రంలో అధికారం తీసుకొచ్చి ప్రజలకు మరింత చేరువలో ఉండాలని వచ్చేది కాంగ్రెస్సేనని మద్దికుంట కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు దోనుకుల కొండయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా మద్దికుంట గ్రామంలో ప్రతి ఇంటింట ప్రచారంలో ప్రతి ఓటరుకు హస్తము గుర్తుపై ఓటువేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఇక కేంద్రం కూడా అధికారంలోకి రావాలంటే సకల సౌభాగ్యాలు సొంతం చేసుకోవాలనుకుంటే ప్రతి ఇంటింటా వెలుగులు నిండాలంటే మీయొక్క అమూల్యమైన ఓటును చేయి గుర్తుపైవేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కర్ణాల అనిల్, సురభి రాజు, కుదిరే సత్యగౌడ్, సూత్రపు రాజ, మల్లయ్య, మెతుకు మధు, కుదిరే నరేష్, కమ్మరి వేణు, తెర్లు మద్దిరాజు, కిషన్, బత్తుల రాజు, కంచం రమేష్ నాంపల్లి పాల్గొన్నారు.
