ప్రాంతీయం

వేసవికాలంలో మూగజీవులను రక్షణ సూచనలు

147 Views

తెలుగు 24/7 న్యూస్

 

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం పశువైద్యాధికారి ఎస్. శ్రీనివాస్ వేసవికాలంలో మూగజీవులను రక్షించుకోవడం ముఖ్యమని అన్నారు. మూగ జీవులను రక్షించుకునే సూచనలను అందించారు. వేసవికాలంలో పశువులను మేత మేపడం ఉదయం 6 గంటలకు సాయంత్రం 3 గంటల 30 నిమిషాలకు తీసుకువెళ్లి మేత మేపి కొట్టాలలో, కమ్మల గుడిసెలలో కట్టివేయాలని అన్నారు,వడ దెబ్బ తగలకుండా ఫ్లూయిడ్స్, డిహైడ్రేషన్ చేయాలన్నారు. మేత పచ్చి గడ్డి వరిగడ్డి తగు పోషకాలు గల ఆహారాన్ని అందించాలన్నారు.నీటి తొట్టెలు గాని శుద్ధ నీటిని గాని అందించాలని అన్నారు.సన్న జీవులకు గా  అమ్మ తల్లి టీకాలు వేయాలన్నారు. పెద్ద జీవులకు గాలికుంటు టీకాలు అందించాలన్నారు. గ్రామీణ అభివృద్ధికి దేశాభివృద్ధికి పసుపు పోషణ ఎంతగానో దోదపడుతుందని అన్నారు. మండల ప్రజలు పైన తెలిపిన విషయాలను అవగాహన చేసుకుని సూచనలు పాటించి వారి మూగజీవులను రక్షించుకోవాలని అన్నారు.

No Slide Found In Slider.

Poll not found