*రామగుండం పోలీస్ కమీషనరేట్*
*తల్లితండ్రులను పట్టించుకోని పిల్లలపై చట్టపరమైన చర్యలు ఆస్తులు వాపస్*
*కుమారులు పట్టించుకోవడం లేదని సీపీకి పిర్యాదు చేసిన తల్లితండ్రులు*
ఈరోజు రామగుండం పోలీస్ కమీషనర్ కార్యాలయానికి పోతారం గ్రామం, ముత్తారం మండలం, పెద్దపల్లి జిల్లాకి చెందిన గుజ్జుల సాయిలు, గుజ్జుల చిలకమ్మా అను ఇద్దరు వచ్చి తమకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలరు. అందులో పెద్దకొడుకు మల్లికార్జున్ ఆర్మీ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనిపై కి 2 ఎకరాల పొలం, చిన్న కొడుకు రమేష్ విద్యుత్ శాఖ లో లైన్ మెన్ గా పని చేస్తున్నాడు. ఇతని పేరు పై 1 1/2 ఎకరాలు భూమిని తల్లితండ్రులు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అట్టి పొలం కొనడానికి 10 లక్షల రూపాయలు అప్పు చేయడం జరిగింది అని ఇప్పుడు మేము అప్పు కట్టే పరిస్థితిలో లేము మరియు కుమారులు మా గురించి పట్టించుకోవడం లేదు. కనీసం నిత్య అవసరాల నిమిత్తం ఖర్చులు కూడా చూసుకోవడం లేదని సిపికి ఫిర్యాదు చేయగా వాళ్ళ సమస్య తెలుసుకొన్న సీపీ, వారి కుమారులని పిలిపించి సమస్య తెలుసుకొని తొందరగా వారి సమస్య చట్ట ప్రకారంగా పరిష్కరించేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినాడు.
ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ… వృధ్యాప్యంలో ఉన్న తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పార్లమెంటు ఓ చట్టాన్ని రూపొందించింది అని వృద్ధ తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం, మెయింటెనన్స్ యాక్ట్ 2007 పేరుతో దీన్ని అమలులోకి తీసుకొచ్చారు. కేంద్రం రూపొందించిన చట్టానికి అనుగుణంగా వివిధ రాష్ట్రాల్లో నిబంధనలు రూపొందించారు అన్నారు.
