ప్రాంతీయం

నామినేషన్ వేసిన బిజెపి అభ్యర్థి గోమాస శ్రీనివాస్

115 Views

*పెద్దపల్లి భాజపా పార్లమెంట్ అభ్యర్థి శ్రీ గోమాస శ్రీనివాస్ నామినేషన్ మహోత్సవంలో పాల్గొన్న సిర్పూర్ శాసన సభ్యులు డా‌.పాల్వాయి హరీష్ బాబు*

పెద్దపల్లి :పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని బీట్ మార్కెట్ నుంచి కలెక్టరేట్ వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నామినేషన్ ర్యాలీలో పాల్గొని ప్రసంగించిన సిర్పూర్ శాసన సభ్యులు డా‌.పాల్వాయి హరీష్ బాబు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుండి 12 పార్లమెంట్ స్థానాలు గెలిచి భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలిపిన నరేంద్ర మోదీ గారికి బహుమతిగా ఇద్దామని తెలిపారు. కార్యకర్తలు అందరూ భేదాభిప్రాయాలు పక్కనపెట్టి సైనికుల్లాగా పని చేయాలని పిలుపునిచ్చారు. రూ.2లక్షల రుణమాఫీ విషయంలో అబద్ధమాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్ లోకర్రు కాల్చి వాత పెట్టాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సునీల్ రెడ్డి, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గొమాసె శ్రీనివాస్, మాజీ శాసనసభ్యులు గుజ్జుల రామకృష్ణారెడ్డి, కాసిపేట లింగయ్య, శ్రీదేవి మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కందుల సంధ్యారాణి, దుర్గం అశోక్, కన్నం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్