ప్రాంతీయం

హామీలకే పరిమితమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. నిరసనగా వినతిపత్రం…

95 Views

ముస్తాబాద్, జనవరి 30 మండల కేంద్రంలోని స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పూల మాలవేసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలకు 420 రోజులు గడిచిన హామీలను తుంగలోతొక్కి గద్దెనెక్కి కూర్చున్నదన్నారు. అందుకు నిరసనగా మహాత్మగాంధీకి మాలవేసి వినతి పత్రం సమర్పించామన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found