సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో బజరంగ్ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శనివారం నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ పాశం బాపు రెడ్డి, బేగంపేట ఎస్సై అరుణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు శాంతి భద్రతలకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు. ఏర్పాటు చేసిన వినాయక మండపం అద్భుతంగా ఉందని నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ ప్రతిరోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తిని చాటుకుంటున్న గ్రామ ప్రజలు అభినందనీయులని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ .వార్డ్ నెంబర్లు సభ్యులు మహిళలు చిన్నారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
