ప్రాంతీయం

నిబంధనలు నిల్.. బాల్యమంతా బట్టిల్లో…

67 Views

ముస్తాబాద్, జనవరి 30 మండలంలో ఇటుకబట్టీల వ్యాపారస్తులు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు ఉన్నాయో లేవో అధికారులకి తెలుసు.. పక్క రాష్ట్రాలు ఒరిస్సా మహారాష్ట్రం వంటి పలు రాష్ట్రాల నుండి అమాయక కార్మికులను తీసుకువచ్చి ఇటుక బట్టీలలో వినియోగిస్తున్నారు. వారి శ్రమంతా రోజువారి పొట్టకే కానీ వెనుకేసుకున్నదేందో.. ప్రమాద ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులు, నివాస సముదాయాలు, కనీస సౌకర్యాలు దేవుడెరుగు వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకునే విధంగా యజమానులు..బాల్యమంత పశ్రమకుతగ్గ వేతనం గాలికి.. అంతేకాకుండా బాల్యంలో ఉన్న పసిమొగ్గలు ఇటుబట్టి బూడిదనే అంగన్వాడీ.. కార్మికుల శ్రమను సంపాదనగా మలుచుకుని కోట్లల్లో వ్యాపారం లక్షలు లాభాలా.. మండలంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇకనైనా ఇలాంటి ఇటుక బట్టీలకు ప్రభుత్వ అనుమతులు ఉన్నావా.. ఉంటే ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించే నిర్వహిస్తున్నారా అనే అంశంపై మండల ప్రజలు అనేక ఆరోపణలు చేస్తున్నారు.

No Slide Found In Slider.

Poll not found