దుబ్బాక మున్సిపాలిటీ పోలింగ్ సెంటర్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి….
సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 11, తెలుగు న్యూస్ 24/7
దుబ్బాక మున్సిపాలిటీలోనీ టిటిడి కళ్యాణ మండపం దగ్గర మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాలలోనీ పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హైమావతి క్షేత్రస్థాయిలోపరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.ఓటింగ్ సరళి ముగిసిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారం ప్రతిదీ చెక్ చేసుకుని బ్యాలెట్ బాక్స్ లాక్ వేసి సీల్ వేసి ఏ ఒక్క మెటీరియల్ కూడా మర్చిపోకూడదు సూచించారు. జోనల్ రూట్ ఆఫీసర్ ద్వారా మీకు కేటాయించిన వాహనం పోలీస్ ఎస్కార్ట్ ద్వారానే రిసెప్షన్ సెంటర్ కి వెళ్ళాలని తెలిపారు.రిసెప్షన్ సెంటర్ లో అన్ని అరేంజ్మెంట్ లు చూసుకుని బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచాలని తెలిపారు. పోలింగ్ సిబ్బంది అందరికీ రాత్రి భోజన సదుపాయాల్లో ఎలాంటి లోటు రాకుండ చూసుకోవాలని అలాగే వాళ్ల వారి స్వగృహాలకు వెళ్లడానికి ఆయా రూట్ ల వళ్ళు గా బస్సు సౌకర్యం కల్పించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు తదితరులు ఉన్నారు.





