Breaking News

దమ్మన్నపేట్ గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు క్షేత్ర పర్యటన

139 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లోని దమ్మన్నపేట్ గ్రామం లో గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులను ఉపాధ్యాయ బృందం క్షేత్ర పర్యటనకు తీసుకువెళ్లడం జరిగింది పాఠశాల సమీపంలో గల పంట పొలాలలో కాల్చిన కొయ్యకాలను చూపించి అవగాహన కల్పించడం జరిగింది ప్రస్తుతము భారతదేశంలో వ్యవసాయ రంగంలో జరుగుతున్నటువంటి వ్యవసాయ యాంత్రీకరణ మూలంగా వ్యవసాయ రంగానికి మరియు వాతావరణ పర్యావరణ ఇబ్బందులను రైతులకు అవగాహన కల్పించడం కొరకై. ఈ క్షేత్రపర్యటనకు ప్రాముఖ్యత సంచరించుకుంది కారణం ఏంటి అంటే గురువారం వారు కోసిన తర్వాత రైతులందరూ కొయ్యకాలను మరియు గడ్డిని కాల్చడం జరుగుతోంది ఆ విధంగా కాల్చడం మూలంగా వాతావరణ కాలుష్యం ఏర్పడి భూమి పై పొర లో ఉన్నటువంటి పోషకాలు నశించి సారవంతమైనటువంటి నేలలు నిస్సారంగా మారుతున్నాయని సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు దాసరి శ్రీధర్ ఇటు రైతులకు అటు విద్యార్థులకు అవగాహన ప్రత్యక్షంగా చూపించి వారికి కల్పించడం జరుగుతూ వచ్చింది అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ బోయన్న గారి నారాయణ మాట్లాడుతూ కాల్చివేతను అరికడదాం పర్యావరణాన్ని కాపాడుదాం కొయ్య కాళ్లు కాల్చివేత ను ఆపుదాం భూసారాన్ని రక్షిద్దాం అని నినాదాలు చేశారు. ఇట్టి కార్యక్రమంలో జగదాంబ తండా సర్పంచ్ శ్రీ బాల్య నాయక్ రైతులుఉపాధ్యాయ బృందం ఆశ్ర తబస్సుo తాడూరి సంపత్ దాసరి శ్రీధర్ మారేపల్లి రాజు గోల్కొండ శ్రీధర్ , పాశం భాస్కర్  మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found