ముస్తాబాద్, జనవరి 27 (24/7న్యూస్ ప్రతినిధి): సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సమస్య ఎదురైనప్పుడు పోలీసుల సాయం పొందాల్సి వస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని సీఐ, ఎస్సై అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని
చిప్పలపల్లి గ్రామంలో మీకోసం కార్యక్రమం సోమవారం సాయంత్రం నిర్వహించిన సభ కార్యక్రమంలో మాట్లాడుతూ మానవ తప్పిదంవల్లనే సైబర్ నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి. తమ పిల్లల బంగారు భవిష్యత్తును చెడు అలవాటు దూరం చేస్తుంది. ఏవైనా చెడు మార్పులు ఉంటే ఎలాంటి అనుమానం వచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని తెలిపారు. యువతీ యువకులకు గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాల బారిన పడకుండా కాపాడుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, సిసి కెమెరాల ఏర్పాటు, మాదక ద్రవ్యాల వినియోగం, కుల నిర్మూలన, తదితర అంశాలపై వివరించారు. సోషల్ మీడియాను తప్పుగా ఉపయోగించడం మరియు వాట్స్ యాప్ గ్రూప్‌లలో అనవసరమైన సమస్యలను పోస్ట్ చేయడంవల్ల కేసులు వస్తాయి. ఈ కార్యక్రమంలో సిఐ మొగిలి, ఎస్సై చిందం గణేష్ గ్రామస్తులు పాల్గొన్నారు.




