ప్రాంతీయం

అక్రమ అరెస్టులు ఖండిస్తున్నాం.. కంచర్ల రవిగౌడ్…

132 Views

ముస్తాబాద్, జనవరి 27 (24/7న్యూస్ ప్రతినిధి): జిల్లా కేంద్రంలో తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ భారత రాష్ట్ర సమితి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ నిన్నటి రోజున జనగామ శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కొంతమంది కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం హాస్యపదంగా ఉందన్నారు. జనగామ నియోజకవర్గంలో ఎర్రగుంట తండాలో నిర్వహించిన ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయాలని ప్రజల పక్షాన కోరితే జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. ప్రజా ప్రతినిధి స్థానిక శాసనసభ్యుడు ప్రజల పక్షాన నిలబడి మీరు ఇచ్చిన హామీలన్నీ పేద ప్రజలకు అమలు కావాలని అడిగినందుకు దాడి చేయడం చాలా సిగ్గుచేటు అని ఈ సందర్భంగా అన్నారు ఇదేనా ఇందిరమ్మ రాజ్యం ఇదేనా ప్రజా పాలన అని అడిగారు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ఒక ఎమ్మెల్యేపై దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. బిఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను విచ్చలవిడిగా రక్తం వచ్చేలా లాఠీ ఛార్జ్ చేయడం చాలా బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అడిగితే లారీ చార్జ్ అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం కచ్చితంగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ లో ఇచ్చిన 6 గ్యారంటీని అమలు అయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల పక్షానా నిలబడి అడుగుతాం మాకెసిఆర్, కేటీఆర నాయకత్వంలో ప్రజల పక్షాన నిలబడి ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే వరకు మిమ్మల్ని వెంటాడుతామని పేర్కొన్ఇనారు. ప్పటికైనా మీరిచ్చిన ఆరు గారంటీలను పూర్తి అమలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముష్కం అనిల్ గౌడ్, శ్రీకాంత్, సంపత్, నిఖిల్, అక్రమ్, అసిన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు….

No Slide Found In Slider.

Poll not found