ప్రాంతీయం

మంచిర్యాలలో శాంతి భద్రతలు పూర్తిగా ఓం శాంతి అయిపోయాయి.మంచిర్యాలలో లా అండ్ ఆర్డర్ గాడిలో ఉండాలంటే మంచిర్యాలకి కొత్త యంగ్ IPS ఆఫీసర్ రావాలి.-బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్

7 Views

మంచిర్యాలలో శాంతి భద్రతలు పూర్తిగా ఓం శాంతి అయిపోయాయి.మంచిర్యాలలో లా అండ్ ఆర్డర్ గాడిలో ఉండాలంటే మంచిర్యాలకి కొత్త యంగ్ IPS ఆఫీసర్ రావాలి.-బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్.

తెలుగు న్యూస్ మంచిర్యాల:మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్.

మంచిర్యాలలో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, అధికార పార్టీ నాయకులే తిన్నది అరగక వాళ్లలో వాళ్లు కొట్టుకుంటూ మొత్తం ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఇక పోలీసులు కళ్ళుండి కూడా చూడలేకపోతున్నారు.ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచి మొదలైంది. అదే రోజు పాత మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు మనుషులతో టీఆర్ఎస్ నాయకులను కొట్టించిన దగ్గర నుంచి, నిన్న మళ్ళీ అదే పాత మంచిర్యాలలో ఒకరి ఇంట్లోకి దూరి దౌర్జన్యం చేసే వరకు ఇదే నడుస్తోంది.ఎమ్మెల్యే మూడు సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే చేసింది ఏంటి? అందర్నీ కొట్టడం, కేసులు పెట్టడం, గుండాయిజాన్ని, రౌడీయిజాన్ని పెంచి పోషించడం.ఎమ్మెల్యే ఏ స్థాయికి దిగజారాడు అంటే, సద్దుల బతుకమ్మ రోజు తాళ్లపేటలో గొడవ జరుగుతుంటే, మేడారిపేట వరకు పోయి తాళ్లపేటకు పోయే ధైర్యం లేక తన వర్గం నాయకులను పంపించడం. దెబ్బలు తినేవాళ్ళకు దసరా రోజు తాళ్లపేటకు వస్తా అని ప్రోగ్రాం ఇచ్చి, తర్వాత క్యాన్సిల్ చేయడం. దసరా తెల్లారి బైపాస్ మీద అటాక్ చేస్తా అని చెప్పి, ఇంటికి పిలిపించుకుని మళ్ళీ తోక ముడవడం.ఎమ్మెల్యే గురించి ఆ పార్టీకి చెందిన వాళ్లే ఏ విధంగా మాట్లాడుతున్నారో సోషల్ మీడియాలో అందరూ చూశారు. ఆ బూతులు వినలేనంతగా ఉన్నాయి.తాగేవాళ్లకు పదవులు ఇవ్వను అని చెప్పిన ఎమ్మెల్యే, ఎలాంటి వాళ్లకు పదవులు ఇచ్చాడు అనేది ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు చూస్తే అందరికీ అర్థమవుతుంది.

ఎమ్మెల్యే గానీ, జగన్ మోహన్ రావు గానీ, ఇద్దరూ కలిసి ఉన్నా, విడిపోయినా దాడులు, కేసులు కామన్. కలిసి ఉంటే ప్రతిపక్షం మీద, విడిపోతే స్వపక్షం మీద ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం.మంచిర్యాల ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి, ప్రేమ్ సాగర్ రావుకి ఓటేసి తప్పు చేశామని ఒక నిర్ణయానికి వచ్చారు. దివాకర్ రావుని పదే పదే చూశాం కదా, కొత్త మొహం చూద్దాం అంటే, ఇయ్యాల మా మొహం వాచింది అని ప్రజలు అనుకుంటున్నారు.మంచిర్యాల గొడవల్లో తలదూర్చిన మంత్రి గారిని, ఎంపీ గారిని అడుగుతున్నా. మీ వర్గంలో ఉన్న ఎక్స్ మున్సిపల్ చైర్మన్లు, ఎక్స్ కౌన్సిలర్లు, ఎక్స్ ఎంపీటీసీల మీద కేసుల మీద కేసులు పెట్టింది. పోలీసులు ఉన్నది మీ కోసమేనా? మంత్రి గారు ఒక క్లారిటీ ఇవ్వాలి. మంచిర్యాల జిల్లా ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. పోలీసులు తప్పు చేశారా? మీ నాయకులు, కార్యకర్తలు తప్పు చేశారా? పోలీసులు తప్పు చేస్తే వాళ్ల మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీ నాయకులు తప్పు చేస్తే వాళ్ల మీద ఏం చర్యలు తీసుకుంటారు? ఇది ప్రజలకు క్లారిటీగా చెప్పాలి.పోలీసులను అడుగుతున్నా, ఒకటే గ్రూపు వెంకట్రావుపేటలో గానీ, పాత మంచిర్యాలలో గానీ అటాక్ చేసింది వాళ్ల మీద మీ చర్యలు ఏవి? కొట్టిన వాళ్లను వదిలిపెట్టి, అసలైన కారణం ఎవరో మీకు తెలిసినా వాళ్ల జోలికి పోకుండా, చిన్న చిన్న వాళ్లను పట్టుకుని వార్నింగ్ ఇస్తే మంచిర్యాల ప్రశాంతంగా ఉంటుందా? అసలు ప్రేమ్ సాగర్ రావుని, జగన్ మోహన్ రావుని ఇద్దరినీ నగర బహిష్కరణ చేస్తే తప్ప ఈ మంచిర్యాల ప్రశాంతంగా ఉండదు.దివాకర్ రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము అప్పటి ముఖ్యమంత్రి గారికి, డీజీపీ కి రిక్వెస్ట్ చేశాం. ఇక్కడికి డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు, కొత్తగా రిక్రూట్ అయిన యంగ్ బ్యాచ్ ని పోస్టింగ్ ఇవ్వమని. వాళ్లయితే ఎవరి మాట వినకుండా న్యాయం చేస్తారని. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఆరుగురు యంగ్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇక్కడికి వచ్చారు.విజయ్ కుమార్, అఖిల్ మహాజన్, అశోక్ , సుధీర్, రక్షిత మూర్తి మేడం, రష్మీ పెరుమాళ.ఈ మూడు సంవత్సరాలలో ఇక్కడ ఎందుకు ఏసీపీగా ఒక ఐపీఎస్ ని తీసుకురాలేకపోయారు? ఎందుకు రాలేదు? వస్తే శాంతిభద్రతలు కరెక్ట్ గా ఉంటాయి. అలా ఉంటే ఈ ఎమ్మెల్యేకు పైసలు రావు. పైసలు రావాలంటే చెప్పినట్టు చేసే పోలీసులే కావాలి. అందుకే యంగ్ ఐపీఎస్ ఆఫీసర్లను రానివ్వడం లేదు.నేను మీడియా ద్వారా చెబుతున్నా, ఈ ప్రాంతం కరెక్ట్ గా ఉండాలంటే దీనికి ఏకైక సొల్యూషన్ ఇప్పుడు వచ్చిన కొత్త తెలంగాణ క్యాడర్ యంగ్ ఐ.పీ.ఎస్ ఆఫీసర్ల లో ఒకరిని మంచిర్యాలకు పోస్టింగ్ చేస్తే తప్ప ఈ మంచిర్యాల బాగుపడదు అని అన్నారు.

*ఎమ్మెల్యే పై సొంత పార్టీ నేతలే విమర్శలు*

మంచిర్యాల చరిత్రలో ఎప్పుడూ అవిశ్వాస తీర్మానంతో ఒక చైర్మన్‌ను తొలగించిన దాఖలాలు లేవు. మొదటిసారి, చివరి మున్సిపాలిటీ అయిన నస్పూర్‌లో కూడా అవిశ్వాసం పెట్టి ఒక మచ్చ తెచ్చారు.మంచితనాన్ని, మంచి పద్ధతులను తుంగలో తొక్కి, మీ స్వార్థ రాజకీయాల కోసం చేస్తున్నారు. అక్కడ ఇక్కడ మున్సిపల్ చైర్మన్లు మీకు వ్యతిరేకం అవ్వడానికి కారణం ఏంటి?మంచిర్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య  ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన విషయాలు ఏంటి? గత రెండున్నర, మూడేళ్లుగా మేము చెబుతున్న అదే విషయాలను ఆయన చెప్పారు. అది కూడా మీ పార్టీ ఆఫీసులో, కాంగ్రెస్ పార్టీ బ్యానర్ పెట్టి, కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ అని చెప్పి పెట్టారు.అవి సొంత పార్టీ ప్రెస్ మీట్ అని మీ మీదే చెప్పారు. అవి నిజమైతే ఒక్కరోజు కూడా ఎమ్మెల్యేగా మీరు కొనసాగే హక్కు మీకు లేదు. ఆ రోజు ఆ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న నాయకులందరి మీద మీరు ఇప్పటికే చర్య తీసుకుని ఉండాలి. తీసుకోలేదు అంటే దాని అర్థం ఏంటి?ఇవాళ నేను చెబుతున్నది కాదు. ఈ జిల్లా మంత్రి వివేక్ కి సంబంధించిన వెలుగు పేపర్ గానీ, V6 ఛానల్ గానీ మంచిర్యాలలో ఎమ్మెల్యేనే దాడులు చేయిస్తున్నాడు అని కథనాలు పుష్కలంగా చూపిస్తున్నాయి.నేను పార్టీని అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా – అవి నిజమైతే మీరు ఎమ్మెల్యేను ఎందుకు సస్పెండ్ చేయడం లేదు? అవి అబద్ధాలైతే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి V6 కి, వెలుగుకి ఎందుకు లీగల్ నోటీసులు పోవడం లేదు? మా కేటీఆర్  మీద ఈనాడు పత్రిక తప్పుడు వార్తలు రాస్తే నోటీసు ఇస్తే, చరిత్రలో మొదటిసారి అనుకుంటా ఈనాడు పత్రిక కూడా క్షమాపణ చెప్పింది అని అన్నారు.

*444 కోట్లు*

గతంలో మంచిర్యాల ఎమ్మెల్యే 444 కోట్లకు సంబంధించి 31 పేజీల PDF మీ అందరికీ పంపడం జరిగింది. అందులో మీరు చూసినట్లయితే సెప్టెంబర్ 10వ తారీఖున 70 కోట్లు బీకాండ్ కంపెనీ నుంచి వచ్చినట్లు మీకు కనిపిస్తుంది. మరి సెప్టెంబర్ లో 70 కోట్లు వస్తే, మార్చిలో కట్టిన పైసలు ఈ 70 కోట్లేనా? అప్పుడు ఎమ్మెల్యే ఎలా చెబుతాడు?ఈ 140 కోట్లు అప్పు తీసుకున్నది 20% వడ్డీకి. అంటే నెలకు రెండున్నర లక్షలు జీతం వచ్చే ఎమ్మెల్యే, నెలకు 2 కోట్ల 80 లక్షలు వడ్డీ కట్టాలి. అన్ని బిజినెస్సులు దివాలా తీసినయ్. నీ ఐటీ రిటర్న్స్, నీ బిజినెస్ సంబంధించిన ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చూస్తే ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి అన్ని బిజినెస్సులు దివాలా తీసినప్పుడు నెలకు దాదాపు 2 కోట్ల 80 లక్షలు ఎలా కడుతున్నాడు? ప్రజలకు చెప్పాలి అని అన్నారు.

*2BHK*

పేదలకు ఇల్లు కట్టిస్తే ఏ ప్రభుత్వం కట్టించినా, ఏ నాయకుడు కట్టించినా దాన్ని టీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది. కానీ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు ఉండకూడదని మేము కోరుకుంటున్నాం.నేను అధికారులకు చెబుతున్నా, కమిషనర్ గారిని అడిగితే ఎమ్మార్వో గారి పేరు చెబుతున్నారు, ఎమ్మార్వో గారిని అడిగితే కమిషనర్ గారి పేరు చెబుతున్నారు. 17 వేల మంది మాకు ఇల్లు కావాలని దరఖాస్తు పెట్టుకుంటే కేవలం 804 మందిని ఎలా సెలెక్ట్ చేస్తారు? మిగతా 16,200 మంది పేదలను ఏ పద్ధతి ప్రకారం రిజెక్ట్ చేశారు? ఇది ఎమ్మెల్యే చేయరాదు, లేదా మిగతా ఎన్నికైన నాయకులు, ప్రజాప్రతినిధులు చేయరాదు. అధికారులే సెలెక్ట్ చేయాలి. కలెక్టర్ ద్వారా, కమిషనర్ గారా, ఎమ్మార్వో గారా, ఆర్డీవో గారా – దీన్ని ఎవరు చేసినా, ఏ పద్ధతి ప్రకారం చేశారనేది మీరు వివరణ ఇవ్వాలి. ఇవ్వకపోతే రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి మూల్యం చెల్లించక తప్పదు.ఎన్నిసార్లు చెబుతున్నా మైనింగ్ మాఫియా ఆగడం లేదు. మొన్నటికి మొన్న ఇండస్ట్రియల్ పార్క్, ఐటీ పార్క్ అని చెప్పిన ప్రాంతం మొత్తం బొందల గడ్డ అవుతోంది. అర్ధరాత్రి కూడా అక్కడి నుంచి వెహికల్స్, టిప్పర్లు మా రంగపేట, పాత మంచిర్యాల మీదుగా పోతున్నాయి. దీన్ని నేను మొన్న మైనింగ్ అధికారికి కూడా వాట్సాప్ పెట్టడం జరిగింది, కానీ ఎలాంటి చర్య లేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు,TBGKS నాయకులు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *