ప్రాంతీయం

నిరుపేద వధువులకు పుస్తె మట్టెలు అందజేత

131 Views

దౌల్తాబాద్: మండల పరిధిలోని మాచిన్ పల్లి గ్రామానికి చెందిన తుమ్మల యాదమ్మ చంద్రయ్యల కుమార్తె మమత, మల్లేశం పల్లి గ్రామానికి చెందిన శివంది కళావతి ముత్యాలు కుమార్తె రత్నమాల వివాహాలకు ఎమ్మెన్నార్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రస్టు సభ్యులు పోతరాజు రవీందర్, చంద రాజు, స్వామి గౌడ్ లు పుస్తె మట్టెలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో పేదింటి ఆడబిడ్డలకు ఎమ్మెన్నార్ ట్రస్ట్ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజు, భాస్కర్, స్వామి, అశోక్, మామిళ్ల నాగరాజు, నవీన్, నర్సింహా చారి, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు..

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7